Realme Sales Record| రియల్‌మీ కొత్త ఫోన్ సేల్స్ రికార్డ్స్ బద్దలు కొడుతోంది. ఈ ఫోన్ కొనడానికి యువత క్రేజీగా ఆర్డర్లు చేస్తున్నారు. దీంతో యువత అవసరాలను అర్థం చేసుకోవడంతో రియల్‌మి ముందంజలో ఉందని తెలుస్తోంది. ఇటీవలే రియల్‌మీ P4 పవర్ 5G స్మార్ట్‌ఫోన్ 10,001mAh భారీ బ్యాటరీతో లాంచ్ అయింది. లాంచ్ అయిన వెంటనే ఈ ఫోన్‌కు భారీ ఆదరణ లభించింది.
రియల్‌మీ ప్రకారం.. మొదటి గంటలోనే సేల్స్ రికార్డులు బద్దలయ్యాయి. మునుపటి జనరేషన్ మోడల్‌తో పోలిస్తే 291 శాతం ఎక్కువ సేల్స్ జరిగాయి. మిడ్-రేంజ్ సెగ్మెంట్‌లో ఇలాంటి రికార్డు చాలా అరుదు. ఈ ఏడాది బ్యాటరీపై దృష్టి పెట్టిన ఫోన్లకు డిమాండ్ బాగా పెరిగిందని ఈ సక్సెస్ చూపిస్తోంది.
రియల్‌మీ P4 పవర్ 5G మొదటి సేల్ ఫిబ్రవరి 5న మధ్యాహ్నం 12 గంటలకు మొదలైంది. మొదటి గంటలోనే రియల్‌మీ అంచనాల కంటే ఎక్కువ సేల్స్ జరిగాయని కంపెనీ తెలిపింది. పాత మోడల్‌తో పోలిస్తే దాదాపు మూడు రెట్లు ఎక్కువ యూనిట్లు అమ్ముడయ్యాయి. ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్‌లలో డిమాండ్ ఇప్పటికీ ఇంకా ఎక్కువగా ఉంది. గేమర్లు, హెవీ మొబైల్ యూజర్లు ఈ భారీ బ్యాటరీ ఆకర్షణకు లోనయ్యారు.
When people believe in Power, they show up in numbers.
With 291% of last gen first-hour sales, #realmeP4Power proves that big battery energy hits different when it’s done right.
Thank you for the love. We’re just getting started.
Buy Now:https://t.co/5OlfDVEzw7… pic.twitter.com/okqIQDAnYi
— realme (@realmeIndia) February 5, 2026
రియల్‌మీ P4 పవర్ 5G మూడు స్టోరేజ్ వేరియంట్లలో వచ్చింది.
8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.25,999
8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ.27,999
12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ.30,999
మొదటి సేల్ సమయంలో రూ.2,000 ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ఉంది. దీంతో ప్రారంభ ధర రూ.23,999కి తగ్గింది. ఎక్స్చేంజ్ బెనిఫిట్స్, లిమిటెడ్ టైమ్ ఆఫర్లు కూడా ఇచ్చారు. ఈ ఫోన్‌తో నాలుగేళ్ల బ్యాటరీ వారంటీ కూడా ఉంది.
ఈ ఫోన్‌లోని ప్రధాన ఆకర్షణ 10,001mAh టైటాన్ బ్యాటరీ. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాటరీ అని రియల్‌మీ చెబుతోంది. హెవీ యూసేజ్‌తో కూడా రెండు రోజుల పాటు సులభంగా పనిచేస్తుంది. 80W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. 27W రివర్స్ చార్జింగ్ ఫీచర్ ద్వారా ఇతర డివైస్‌లకు పవర్ బ్యాంక్‌లా ఉపయోగించవచ్చు.
144Hz హైపర్‌గ్లో AMOLED డిస్‌ప్లే ఉంది. పీక్ బ్రైట్‌నెస్ 6500 నిట్స్ వరకు ఉంటుంది. బయట సూర్యకాంతిలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. కర్వ్డ్ 4D డిస్‌ప్లే ప్రీమియం అనుభవం ఇస్తుంది. IP66, IP68, IP69 రేటింగ్స్ ఉన్నాయి. దుమ్ము, నీరు, తీవ్ర వాతావరణ పరిస్థితుల నుంచి రక్షణ ఇస్తాయి. డ్యూరబుల్ బాడీ డిజైన్ ఉంది.
Also Read: ప్రకృతి నాశనం.. మనుషుల కంటే ఎక్కువ నీరు తాగేస్తున్న ఏఐ టెక్నాలజీ
మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్ ఉంది. హైపర్ విజన్ ప్లస్ AI చిప్ కూడా ఉంది. గేమింగ్, మల్టీటాస్కింగ్ స్మూత్‌గా జరుగుతాయి. యాప్స్ వేగంగా ఓపెన్ అవుతాయి. హెవీ గేమ్స్ ఎక్కువ హీట్ లేకుండా రన్ అవుతాయి.
రియల్‌మీ P4 పవర్ 5G బ్యాటరీ, పెర్ఫామెన్స్, డ్యూరబిలిటీపై దృష్టి పెట్టింది. ఎక్కువ సేపు బ్యాటరీ కావాలనుకునే యూజర్లను టార్గెట్ చేసింది. ఈ సేల్స్ సక్సెస్ భారీ బ్యాటరీ ఫోన్లకు డిమాండ్ ఉందని చూపిస్తోంది. ఈ ఏడాది మిడ్-రేంజ్ సెగ్మెంట్‌లో రియల్‌మీ మళ్లీ ఆధిపత్యం చెలాయించవచ్చు.