Illu Illalu Pillalu Today Episode February 6th: నిన్నటి ఎపిసోడ్ లో.. తన తండ్రికి ఇలా జరగడం పై చందు ఫీల్ అవుతాడు. అమూల్య దగ్గరకొచ్చిన చందు అమూల్య చంప పగలగొట్టి మా నాన్నకి ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఇదే అని సీరియస్ అవుతాడు.. మా ఇంట్లో అడుగు పెట్టడానికి నువ్వు ఎవరు రా నీకు భద్రం ఒకవైపు అంటున్న సరే చందు మాత్రం అమూల్యని కొడుతూ తన బాధని చెప్పుకుంటాడు. నాన్నకి హార్ట్ ఎటాక్ వచ్చిందని భద్ర పెద్దమ్మతో చెప్పడంతో ఆమె షాక్ అవుతుంది. కానీ భద్ర మాత్రం అలాంటి వాడికి హార్ట్ ఎటాక్ వచ్చిందంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది.. ఇక అమూల్య తన తండ్రిని చూడడానికి వెళ్తాను అని అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వస్తుంది. విశ్వం మాత్రం అమూల్య నువ్వు పంపించడానికి అస్సలు ఒప్పుకోడు.. కానీ భద్ర మాత్రం తన తండ్రి చావు బతుకులో ఉన్నాడు కదరా వెళ్ళనివ్వు అని ఉంటుంది.. ఆ తర్వాత వేదవతి కన్నీళ్లు పెట్టుకొని బాధపడిపోతూ ఉంటుంది. అమూల్య హాస్పిటల్ కి వస్తుంది.. పరిగెత్తుకుంటూ వెళ్లి రామరాజు రూంలోకి వెళుతుంది అమూల్య.. అది చూసిన వేదవతి అమూల్య దగ్గరికి వెళ్లి బయటికి లాక్కొని వస్తుంది.
నువ్వు చేసిన చండాలపు పని వల్లే ఇంట్లోని వాళ్ళందరూ కూడా ఇలా మారిపోయారు ఉక్కు లాంటి మనిషిని వల్ల మంచన పడ్డారు.. దేవుడి దయవల్ల ఆయన ఇంకా ప్రాణాలతో ఉన్నారు. ఇప్పుడు నువ్వు చేసిన చండాలపు పని వల్ల మళ్ళీ ఆయన ప్రాణాలు తీయాలని అనుకుంటున్నారా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అమూల్యని బయటికి తీసుకొచ్చి తోసేస్తుంది.. అత్తయ్య మీరు చేస్తున్నది ఏంటి? అందరూ చూస్తున్నారు అని నర్మదా అంటున్నా సరే వేదవతి మాత్రం చాలా సీరియస్ గా చూడని అని లోపలికి వెళ్ళిపోతుంది.అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అమూల్య నిన్ను విశ్వంతో మాట్లాడమని వల్లి ఎందుకు తీసుకొని వెళ్ళింది అని అడుగుతారు. అసలు విశ్వం నన్ను ప్రేమిస్తున్నాడని చెప్పిందే వల్లి వదిన అని అసలు మ్యాటర్ ని వాళ్లకి చెప్పేస్తుంది అమూల్య.. ఇక అమూల్య చెప్పడంతో ప్రేమ సీరియస్ అవుతుంది. నాకు మొదటి నుంచే ఆ బల్లి మీద డౌట్ ఉంది అక్క చూసావా ఇప్పుడు ఎంతటికి తెగించిందో దాని సంగతి ఇప్పుడు తేలుస్తాను అని ప్రేమ అంటుంది.. అమూల్య వద్దు వదిన నా జీవితం ఏదో ఇలా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నువ్వు వల్లి వదిన జీవితాన్ని నాశనం చెయ్యొద్దు.. మీరు నాకు మాట ఇచ్చారు. ఇంకేం మాట్లాడొద్దు..
అన్నయ్యకి పెళ్లి కావడం లేదని నాన్న చాలా బాధపడ్డాడు.. ఎన్నో సంబంధాలు చూసిన తర్వాత ఏరి కోరి తెచ్చుకున్న కోడలు వల్లి వదిన.. తన గురించి ఇలా అని తెలిస్తే ఇంక తట్టుకోలేడు.. మనకేమన్న అయితే మనం కూడా తట్టుకోలేము అని అమూల్య ఈ విషయాన్ని ఇక్కడితో మర్చిపోండి నా జీవితం ఎలాగో నాశనమైంది అని అనుకుంటారు.. అలాంటి తిన్నింటి వాసాలు లెక్కపెట్టే దాంతో మనం ఏం చేయకూడదు అని అనుకుంటే ఎలా ఇంకొకసారి బుద్ధ వచ్చేలాగా చేయాలి అని ప్రేమ సీరియస్ అవుతుంది..
శ్రీవల్లి మాత్రం అందరూ భోజనం చేయలేదు అంటూ క్యారేజ్ అందుతూ ఉంటుంది. ఇప్పటివరకు నా మనసు ఈ అన్నముడినట్లు ఉడికిపోయింది. నాన్న అమ్మ వెళ్లారు కదా అమూల్య అని బ్రతిమలాడు ఏదో ఒకటి చేసి నా గురించి చెప్పొద్దని చెప్తారు అని శ్రీవల్లి టెన్షన్ ఫ్రీగా ఉంటుంది. ఇకపోతే వల్లి క్యారేజ్ కట్టుకొని బయటకు రాబోతుంటే నర్మదా లోపలికి ఎంట్రీ ఇస్తుంది.. ఎక్కడికి వెళ్తున్నావు అని అంటుంది. ఇంట్లో వాళ్ళందరూ అన్నం తినలేదు కదా అందని ఒప్పించి అన్నం పెడదామని తీసుకొని వస్తున్నానని శ్రీవల్లి అంటుంది..
Also Read : అవనిని అవమానించిన భానుమతి.. పల్లవికి వార్నింగ్.. దిమ్మతిరిగే న్యూస్ చెప్పిన అభి..
ఇదంతా జరగడానికి కారణము నువ్వే.. మావయ్య ఇలా మంచం పడడానికి కారణం నువ్వే.. అమూల్యని విశ్వం ప్రేమించేలా చేయడానికి నువ్వే కదా కారణమని శ్రీవల్లి చెంప పగలగొడుతుంది.. ఇవన్నీ చేయడానికి నేనే కారణమని నీ దగ్గర రుజువుందా ఏంటి..? ఏం మాట్లాడుతున్నావ్ అని భాగ్యం ఇద్దరు కూడా షాక్ అవుతారు.. అప్పుడే నర్మదా అమూల్యను పిలుస్తుంది.. అమూల్య రావడంతో శ్రీవల్లి దొరికిపోయానని టెన్షన్ పడిపోతూ ఉంటుంది.. శ్రీవల్లికి నర్మదా స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది.. ఇంకొకసారి ఇలాంటివి చేస్తే మాత్రం నీ సంగతి చూస్తాను అని చెప్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..