E-Paper
Advertisement

సింగిల్ ఛార్జ్‌తో 20 రోజుల బ్యాటరీ.. Realme Watch S5 మార్కెట్‌లోకి వచ్చేసింది.. ధర ఎంతంటే?

సింగిల్ ఛార్జ్‌తో 20 రోజుల బ్యాటరీ.. Realme Watch S5 మార్కెట్‌లోకి వచ్చేసింది.. ధర ఎంతంటే?
Advertisement

Realme Watch S5: రియల్‌మీ సంస్థ ఇండియన్ మార్కెట్లోకి సరికొత్త స్మార్ట్‌వాచ్‌ను తీసుకొచ్చింది. Realme 16T స్మార్ట్‌ఫోన్‌తో పాటు Realme Watch S5ను గ్రాండ్‌గా లాంచ్ చేసింది. అద్భుతమైన డిజైన్, అదిరిపోయే డిస్‌ప్లేతో వచ్చిన ఈ వాచ్ యూజర్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. సింగిల్ ఛార్జ్‌తో ఏకంగా 20 రోజుల పాటు నడిచేలా దీని బ్యాటరీని డిజైన్ చేయడం విశేషం. ఇప్పుడీ స్మార్ట్‌వాచ్ పూర్తి వివరాల్లోకి వెళ్లిపోదాం రండి..

సేల్ ఎప్పుడంటే?

భారత్ మార్కెట్‌లో ఈ Realme Watch S5 ధరను కంపెనీ రూ.7,999గా నిర్ణయించింది. ఇది రాక్ గ్రే, శాండ్ వైట్ అనే రెండు ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్ జూన్ 5వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి అమ్మకాలు దేశవ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి.

కాలింగ్ ఫీచర్ అదరహో..

Advertisement

ఈ Realme Watch S5లో 1.97-ఇంచుల రౌండ్ అమోలెడ్ డిస్‌ప్లేను అందించారు. ఇది 1500 నిట్స్ బ్రైట్‌నెస్, ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే, 60హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. రాత్రి వేళల్లో స్పష్టత కోసం స్మార్ట్ నైట్ విజన్ సపోర్ట్ కూడా ఉంది. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ద్వారా ఫోన్ తీయకుండానే నేరుగా మణికట్టు నుంచే కాల్స్ మాట్లాడుకోవచ్చు.

Also Read: శాంసంగ్ యూజర్లు ఎగిరి గంతేసే బిగ్ అప్డేట్.. పాత ఫోన్లన్నీ ఇక Galaxy S26లా మారిపోతాయ్, ఎలాగంటే?

హెల్త్, ఫిట్‌నెస్ ట్రాకింగ్..

Advertisement

ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టేవారి కోసం దీనిలో బోలెడన్ని ఫీచర్లు ఉన్నాయి. గుండె వేగాన్ని కనిపెట్టే హార్ట్ రేట్ మానిటర్, రక్తంలో ఆక్సిజన్ శాతాన్ని చూపే ఎస్పీఓ2 ట్రాకర్లతో పాటు నిద్ర, ఒత్తిడి, శబ్ద కాలుష్యాన్ని కూడా ఇది గమనిస్తుంది. మహిళల కోసం ప్రత్యేకంగా మెన్‌స్ట్రువల్ సైకిల్ ట్రాకర్ కూడా ఉంది. రన్నింగ్, సైక్లింగ్, యోగా వంటి 110 కి పైగా స్పోర్ట్స్ మోడ్స్ ఇందులో ఉన్నాయి.

మరిన్ని ప్రత్యేకతలు..

రన్నర్స్ కోసం పేసింగ్ మెట్రోనొమ్, ట్రైనింగ్ కోర్సులు ఈ వాచ్‌లో అందుబాటులో ఉన్నాయి. అలాగే దీనిలో 5-సిస్టమ్ జీఎన్ఎస్ఎస్ పొజిషనింగ్ జీపీఎస్ ఉండటం వల్ల లొకేషన్‌ను ఖచ్చితంగా ట్రాక్ చేయొచ్చు. ఇది 5ఏటీఎం వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌తో వస్తుంది కాబట్టి.. చేతులు తడిగా ఉన్నా డిస్‌ప్లేను సులభంగా వాడుకోవచ్చు. కేవలం 32 గ్రాముల బరువు, 11.8 మిమీ మందంతో ఈ వాచ్ చాలా లైట్‌వెయిట్‌గా ఉంటుంది.

Also Read: బ్యాంక్ అకౌంట్‌తో పనిలేదిక.. టీనేజర్స్ కోసం టాప్-8 సూపర్ డిజిటల్ పాకెట్ మనీ యాప్స్ ఇవే!

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×