E-Paper
Advertisement

March 31st Deadline: ట్యాక్స్ సేవింగ్స్ చెక్ లిస్ట్.. మార్చి 31లోపు ఇవి పూర్తి చేయండి

March 31st Deadline: ట్యాక్స్ సేవింగ్స్ చెక్ లిస్ట్.. మార్చి 31లోపు ఇవి పూర్తి చేయండి
Advertisement

March 31st Deadline: మార్చి 31తో 2025-26 ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. కొత్త ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపన్ను చట్టం అమల్లోకి వస్తుంది. పెట్టుబడుల విషయంలో.. మార్చి 31లోపు పూర్తి చేయాల్సిన ఉంది. కొత్త పన్ను విధానం ప్రకారం రూ.12,75,000లోపు ఆదాయం ఉన్న ఉద్యోగులు ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించనక్కర్లేదు. కాబట్టి, ఈ పరిమితి లోపు ఆదాయం ఉన్నవారు ట్యాక్స్ సేవింగ్స్ స్కీమ్స్ లో పెట్టుబడుల కోసం ఆలోచించాల్సిన అవసరం లేదు. మంచి రాబడి వచ్చే ఇతర పథకాల్లో పెట్టుబడులు పెట్టవచ్చు. అయితే ఓల్డ్ ట్యాక్స్ విధానంలోనే కొనసాగుతుంటే మాత్రం.. కొన్ని ముఖ్య విషయాలను చూసుకోవాల్సిన అవసరం ఉంది.

సెక్షన్ 80C మినహాయింపులు

పాత పన్ను విధానంలో ఉన్నవారు సెక్షన్‌ 80C కింద రూ.1,50,000 వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. PPF, ELSS, సుకన్య సమృద్ధి, లైఫ్ ఇన్సూరెన్స్ పెట్టుబడులకు సెక్షన్ 80సీ వర్తిస్తుంది. పన్ను మినహాయింపు కోసం మార్చి 31లోపు ఇంత మొత్తంలో పెట్టుబడి పెట్టవచ్చు. పీపీఎఫ్‌ లేదా సుకన్య సమృద్ధి యోజన అకౌంట్లున్న వారు ఏడాదికి ఒకసారైనా కనీసం మొత్తంలో డిపాజిట్‌ చేయాలి. లేకపోతే ఆ అకౌంట్లు ఇన్ యాక్టివ్ అవుతాయి. వాటిని మళ్లీ యాక్టివ్ చేసేందుకు ఫైన్ కట్టాల్సి ఉంటుంది.

సెక్షన్ 80D మినహాయింపులు

Advertisement

హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై రూ.25,000 వరకు, సీనియర్‌ సిటిజన్లు అయితే రూ.50,000 వరకు సెక్షన్‌ 80D కింద పన్ను మినహాయింపు పొందవచ్చు. తల్లిదండ్రుల కోసం తీసుకున్న హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం పైనా సెక్షన్ 80D కింద పన్ను మినహాయింపు పొందవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.25 లక్షల వరకు లాంగ్ టర్మ్ పెట్టుబడుల మూలధన లాభంపై పన్ను ఉండదు. మీ లాభాలు ఆదాయపన్ను పరిమితిలోపు ఉంటే వాటిని మార్చి 31 లోపు విక్రయించి, మళ్లీ పెట్టుబడి పెట్టవచ్చు. దీంతో వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ లో ట్యాక్స్ తగ్గుతుంది. పాత పన్ను విధానాన్ని సెలెక్ట్ చేసుకున్న వారు.. మీరు పనిచేసే సంస్థకు వివరాలను మార్చి 31లోపు అందించాల్సి ఉంది. లేకపోతే, పెద్ద మొత్తంలో టీడీఎస్‌ కట్ అవుతుంది.

Also Read:  ఆస్తి పన్ను దారులకు ఏపీ సర్కార్ బంపర్ ఆఫర్.. వడ్డీలో 50% భారీ రాయితీ!

Related News

మళ్లీ రీఛార్జ్ ధరలు పెంచనున్న జియో.. అంబానీ కీలక వ్యాఖ్యలు

బంగారం సరే.. డబ్బులు ఎలా డబుల్ అవుతాయ్? ఇలా చేస్తే సరి!

భయపెడుతోన్న రూపాయి.. బలపడుతోన్న డాలర్, RBI కళ్లెం వేయగలదా?

పోస్ట్ ఆఫీస్ RDలో నెలకు రూ.6,000 పొదుపు చేస్తే.. 5 ఏళ్లకు ఎంత వస్తుంది?

పండుగ సేల్‌లో 80 శాతం వరకు డిస్కౌంట్.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ బిజినెస్ సీక్రెట్ ఇదే

19 ఏళ్ల యువకుడి అద్భుత సృష్టి.. 3D ప్రింటింగ్ ఐడియాతో.. రూ.7 కోట్లకు పైగా సంపాదన!

అత్తమామల ఇల్లు, ఆస్తిపై కోడలికి హక్కులుంటాయా? భారత చట్టం ఏం చెబుతోందంటే

కొత్త ఉద్యోగంలో చేరారా? మీ PF ఖాతాలో ఈ 5 వివరాలు తప్పనిసరిగా చూడండి

Big Stories

Advertisement
×