Redmi 15A 5G vs Realme P4 Lite vs Poco C85x Smartphone Comparison| ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ రెడ్మి తాజాగా రెడ్మి 15A 5G భారతదేశంలో తక్కువ బడ్జెట్‌లో మంచి 5G స్మార్ట్‌ఫోన్‌గా లాంచ్ చేసింది. ఈ ఫోన్.. రియల్‌మీ P4 లైట్ 5G, పోకో C85x 5Gతో నేరుగా పోటీ పడుతోంది. ఈ మూడు ఫోన్లు కూడా బడ్జెట్ వినియోగదారులకు 5G కనెక్టివిటీ, మంచి పర్‌ఫామెన్స్ అందించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.
రెడ్మి 15A 5G 4GB ర్యామ్ + 64GB వేరియంట్ రూ.12,999కి లభిస్తుంది. 4GB ర్యామ్ + 128GB రూ.14,499, 6GB ర్యామ్ + 128GB రూ.16,499కి ఉంది.
రియల్‌మీ P4 లైట్ 5G కూడా రూ.12,999 ధరకు 4GB ర్యామ్ + 64GB వేరియంట్‌తో మొదలవుతుంది. 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.13,999, 6GB వేరియంట్ రూ.15,999.
మూడింటిలో పోకో C85x 5G చౌకైన ఆప్షన్. 4GB ర్యామ్ + 64GB వేరియంట్ ధర కేవలం రూ.10,999, 4GB ర్యామ్ + 128GB రూ.11,999కి లభిస్తుంది.
రెడ్మి 15A 5Gలో 6.9 ఇంచ్ HD+ డిస్‌ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, 810 నిట్స్ బ్రైట్‌నెస్ ఇస్తుంది.
రియల్‌మీ P4 లైట్ 5Gలో 6.8 ఇంచ్ HD+ డిస్‌ప్లే 144Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఇది 900 నిట్స్ బ్రైట్‌నెస్ ఇస్తుంది.
పోకో C85x 5G కూడా 6.9 ఇంచ్ HD+ డిస్‌ప్లే, 120Hz రేట్, 810 నిట్స్ బ్రైట్‌నెస్ ఇస్తుంది.
రెడ్మి 15A 5Gలో 6300mAh బ్యాటరీ ఉంది. 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.
రియల్‌మీ P4 లైట్ 5Gలో 7000mAh భారీ బ్యాటరీ ఉంది. ఇది ఈ సెగ్మెంట్‌లో అతి పెద్ద బ్యాటరీ.
పోకో C85x 5Gలో కూడా 6300mAh బ్యాటరీ ఉంది. మూడింటిలో రియల్‌మీ బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ.
రెడ్మి 15A 5G, పోకో C85x 5G రెండూ ఆండ్రాయిడ్ 16తో HyperOS నడుస్తాయి.
రియల్‌మీ P4 లైట్ 5G ఆండ్రాయిడ్ 16తో Realme UI 7.0 ఇస్తుంది. మూడు ఫోన్లు కూడా ఆధునిక సాఫ్ట్‌వేర్ ఫీచర్లు అందిస్తాయి.
రెడ్మి 15A 5G, పోకో C85x 5Gలో Unisoc T8300 ప్రాసెసర్ ఉంది.
రియల్‌మీ P4 లైట్ 5Gలో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ఉంది. ఈ చిప్‌సెట్ పర్‌ఫామెన్స్, ఎఫిషియెన్సీలో మెరుగ్గా ఉంటుంది. గేమింగ్, మల్టీటాస్కింగ్‌కు రియల్‌మీ మంచి ఆప్షన్.
రెడ్మి 15A 5G, పోకో C85x 5Gలో 32MP ప్రైమరీ కెమెరా ఉంది. ఫ్రంట్ కెమెరా 8MP.
రియల్‌మీ P4 లైట్ 5Gలో 13MP రియర్ కెమెరా మరియు 5MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. కెమెరా హార్డ్‌వేర్‌లో రెడ్మి, పోకో ముందుంటాయి.
మూడు ఫోన్లు 5G, Wi-Fi, బ్లూటూత్, USB Type-C, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ సపోర్ట్ చేస్తాయి. రోజువారీ ఉపయోగానికి అన్ని ముఖ్యమైన ఫీచర్లు ఉన్నాయి.
Also Read: చీప్ టెంపర్డ్ గ్లాస్ కొంటున్నారా? ఫోన్‌లో ఈ సమస్యలకు కారణం అదే
పోకో C85x 5G ధర పరంగా మంచి ఎంపిక. బడ్జెట్ పరంగా ఆలోచించే వారు పోకోని ఇష్టపడతారు.
రియల్‌మీ P4 లైట్ 5G బ్యాటరీ, పనితీరులో బెస్ట్ ఫోన్.
రెడ్మి 15A 5G మంచి డిస్‌ప్లే, కెమెరా పరంగా మంచి బ్యాలెన్స్ చూపిస్తుంది.
మీ బడ్జెట్, అవసరాల ప్రకారం ఎంచుకోండి.
ముఖ్య గమనిక: ఈ కథనంలో తెలిపిన మూడు స్మార్ట్‌ఫోన్స్ లేదా దాని ధరలు.. ఆయా కంపెనీల ఆఫర్లపై ఆధారపడి ఉంటాయి. ఫోన్ కొనుగోలు చేసే సమయంలో వివరాలన్నీ పరిశీలించి కొనాలని వినియోగదారులకు సూచన. పై పేర్కొన్న ధరలు మీరు కొనుగోలు చేసే సమయానికి మారిపోయి ఉండవచ్చు. ‘బిగ్ టీవీ’ అలాంటి విషయాలకు బాధ్యత వహించదు. వివరాలు కేవలం మీ అవగాహన కోసమే.