E-Paper
Advertisement

Cheap Tempered Glass: చీప్ టెంపర్డ్ గ్లాస్ కొంటున్నారా? ఫోన్‌లో ఈ సమస్యలకు కారణం అదే

Cheap Tempered Glass: చీప్ టెంపర్డ్ గ్లాస్ కొంటున్నారా? ఫోన్‌లో ఈ సమస్యలకు కారణం అదే
Advertisement

Cheap Tempered Glass| చాలా మంది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు తమ ఫోన్ స్క్రీన్‌ ప్రొటెక్షన్ కోసం స్క్రీన్‌‌పై టెంపర్డ్ గ్లాస్ వేసుకుంటారు. డబ్బు ఆదా చేయాలని చాలా మంది రోడ్డు పక్కన లేదా మొబైల్ షాపుల్లో అతి తక్కువ ధరలకు లభించే టెంపర్ గ్లాస్ ఎంచుకుంటారు. కానీ తక్కువ క్వాలిటీ గల టెంపర్డ్ గ్లాస్ మీ ఫోన్‌లో సమస్యలు వస్తాయి. ఫోన్ పర్‌ఫామెన్స్, ఉపయోగాన్ని చాలా దెబ్బతీస్తుంది. దీని ప్రధాన నష్టాలు ఏమిటో సరళంగా తెలుసుకుందాం.

ఫోన్ డిస్‌ప్లేకు సరైన రక్షణ ఇవ్వదు

టెంపర్డ్ గ్లాస్ ప్రధాన ఉద్దేశ్యం ఫోన్ స్క్రీన్‌ను రక్షించడం. కానీ ఈ చీప్ గ్లాస్ తక్కువ క్వాలిటీ గల మెటీరియల్‌తో తయారవుతుంది. ఫోన్ కింద పడితే షాక్‌ను సరిగా గ్రహించలేదు. కింద పడగానే తక్కువ క్వాలిటీ టెంపర్డ్ గ్లాస్‌లో పగుళ్లు రావచ్చు లేదా పాడవవచ్చు. దీంతో ఖరీదైన రిపేర్ ఖర్చు వస్తుంది. మంచి క్వాలిటీ గ్లాస్ మాత్రమే నిజమైన రక్షణ ఇస్తుంది.

స్క్రీన్ క్లారిటీ తగ్గిపోతుంది

Advertisement

చీప్ టెంపర్డ్ గ్లాస్ స్క్రీన్ బ్రైట్‌నెస్, క్లారిటీని తగ్గిస్తుంది. కొంత కాలం తర్వాత డిస్‌ప్లే మందంగా కనిపిస్తుంది. బ్లర్ లేదా హేజీ అనిపిస్తుంది. ఎండలో కూడా ఈ సమస్య మరింత ఎక్కువ అవుతుంది. సరైన ఆప్టికల్ క్లారిటీ లేకపోవడం వల్ల వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ చాలా తగ్గిపోతుంది.

టచ్ రెస్పాన్స్ చాలా స్లో

చీప్ గ్లాస్ వల్ల డిస్‌ప్లే టచ్ పనితీరు బలహీనపడుతుంది. స్క్రీన్ ట్యాప్‌లకు త్వరగా స్పందించదు. ఒక్కసారి ట్యాప్ చేస్తే సరిపోక, రెండు సార్లు నొక్కాల్సి వస్తుంది. ఇది రోజువారీ ఉపయోగంలో చాలా ఇబ్బంది కలిగిస్తుంది. గేమింగ్ మరియు టైపింగ్ సమయంలో ఈ సమస్య ఎక్కువగా తెలుస్తుంది.

సెన్సార్లు సరిగా పని చేయవు 

Advertisement

సస్తా టెంపర్డ్ గ్లాస్ సరిగా కట్ చేయకపోవడం వల్ల ఫోన్‌కు సరిగా అతుక్కోదు. ముఖ్యమైన సెన్సార్లను బ్లాక్ చేస్తుంది. ప్రాక్సిమిటీ సెన్సార్ సరిగా పని చేయకపోతే కాల్స్ సమయంలో సమస్యలు వస్తాయి. ఫేస్ అన్‌లాక్ వంటి ఫీచర్లు కూడా పని చేయవు.

స్క్రీన్ స్టిక్కీగా, డర్టీగా అనిపిస్తుంది

మంచి టెంపర్డ్ గ్లాస్‌లో ఒలియోఫోబిక్ కోటింగ్ ఉంటుంది. ఇది ఫింగర్‌ప్రింట్స్, ఆయిల్ మార్కులను నిరోధిస్తుంది. చీప్ గ్లాస్‌లో ఈ కోటింగ్ ఉండదు. త్వరలోనే ఫింగర్‌ప్రింట్స్ పడి స్క్రీన్ స్టిక్కీగా అనిపిస్తుంది. చెమట, ఆయిల్ వల్ల తరచుగా శుభ్రం చేయాల్సి వస్తుంది.

Also Read: ఐఫోన్లు ఇక సురక్షితం కాదు.. నిమిషాల్లో డేటా చోరీ.. ప్రమాదకరమైన కొత్త స్పైవేర్ ఇదే

మొత్తం యూజర్ ఎక్స్‌పీరియన్స్ దెబ్బతింటుంది

తక్కువ ధరలో లభించే టెంపర్డ్ గ్లాస్ మొదట్లో డబ్బు ఆదా చేసినట్లు అనిపించినా, తర్వాత యూజర్‌కు సమస్యలు తెచ్చిపెడుతుంది. డిస్‌ప్లే క్వాలిటీ, టచ్ రెస్పాన్స్, డ్యూరబిలిటీ అన్నీ ప్రభావితమవుతాయి. దీంతో స్మార్ట్‌ఫోన్ వినియోగించే ఎక్స్‌పీరియన్స్ కూడా దెబ్బతింటుంది.

ఎప్పుడూ బ్రాండెడ్ లేదా హై క్వాలిటీ టెంపర్డ్ గ్లాస్ మాత్రమే ఎంచుకోండి. క్లారిటీ, కోటింగ్, పర్ఫెక్ట్ ఫిట్ వంటి ఫీచర్లను చెక్ చేయండి. తక్కువ ధర కోసం క్వాలిటీ విషయంలో రాజీపడకండి. మీ స్మార్ట్‌ఫోన్‌కు సరైన రక్షణ ఇవ్వాలి.

Related News

అదే జరిగితే.. ఈ నగరాలన్నీ కనుమరుగు? వరద ఎన్ని ‘అంతస్తుల ఎత్తు’లో దూసుకెళ్తుందంటే?

స్టైలిష్ లుక్..అల్టిమేట్ సౌండ్,యూత్‌ను ఫిదా చేస్తున్న సౌండ్ బార్

పాకెట్ సైజ్ బడ్జెట్ పవర్ బ్యాంక్..రూ.898కే బెస్ట్ మోడల్

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

Big Stories

Advertisement
×