Redmi 15C 5G: ఈనెల ప్రారంభంలో Redmi 15C 5G స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్‌లోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ ఫోన్‌పై అమెజాన్‌లో సేల్ నడుస్తోంది. మీడియాటెక్ ప్రాసెసర్, 50MP కెమెరా, భారీ బ్యాటరీతో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉన్న ఈ ఫోన్‌కు 5 సంవత్సరాల వరకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ అందించనున్నట్టు కంపెనీ ప్రకటించింది. మరి ఈ రెడ్‌మీ 15C 5G ఫోన్‌లో ఉన్న పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ధర, సేల్ వివరాలు ఏంటో ఇప్పుడు చూసేద్దామా..
రెడ్‌మీ తాజాగా లాంచ్ చేసిన Redmi 15C 5G స్మార్ట్‌ఫోన్‌ను మూడు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకొచ్చింది. 4GB RAM + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.12,499గా ఉండగా, 6GB RAM + 128GB స్టోరేజీ మోడల్‌ను రూ.13,999కు, 8GB RAM + 128GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.15,499 ధరకు అందుబాటులో ఉంది.
Also Read: 5G స్మార్ట్‌ఫోన్ ప్రేమికులకు గోల్డెన్ ఛాన్స్.. రూ.13,999కే రియల్‌మీ నార్జో 90x 5G మీ సొంతం!
ఈ రెడ్‌మీ 15C 5G హ్యాండ్ సెట్‌ను షియోమీ ఇండియా అధికారిక ఆన్‌లైన్ స్టోర్‌తో పాటు ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ డస్ట్ పర్పుల్, మూన్‌లైట్ బ్లూ, మిడ్‌నైట్ బ్లాక్ అనే ఆకర్షణీయమైన కలర్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.
ఈ స్మార్ట్‌ఫోన్ 6.9 అంగుళాల పెద్ద HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్ రేట్‌తో స్క్రోలింగ్ మరింత స్మూత్‌గా ఉంటుంది. గరిష్ఠంగా 810 నిట్స్ బ్రైట్‌నెస్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ ఉండటంతో బయట వెలుతురులో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఇది IP64 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ లభిస్తుంది. దీంతోపాటు కళ్లపై ఒత్తిడి తగ్గించేందుకు TUV రైన్‌ల్యాండ్ నుంచి లో బ్లూ లైట్, ఫ్లికర్ ఫ్రీ, సర్కాడియన్ వంటి సర్టిఫికేషన్లు కూడా ఉన్నాయి.
రెడ్‌మీ 15C 5Gలో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది LPDDR4x RAM, UFS 2.2 స్టోరేజీకి సపోర్ట్ ఇస్తుంది. అవసరాన్ని బట్టి వర్చువల్ RAM ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఫోన్ Android 15 ఆధారిత HyperOS 2పై పనిచేస్తుంది. ఇకపోతే.. కంపెనీ హామీ ప్రకారం ఈ డివైస్‌కు 2 Android OS అప్‌డేట్స్, అలాగే 5 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ అందించనున్నారు.
ఇక ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. Redmi 15C 5G వెనుక భాగంలో 50MP AI కెమెరాతో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరాను అందించారు. పవర్ కోసం ఈ హ్యాండ్‌సెట్‌లో భారీ 6000mAh బ్యాటరీ ఉంది. 33W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటంతో తక్కువ సమయంలోనే ఫోన్‌ను ఛార్జ్ చేసుకోవచ్చు.
కనెక్టివిటీ పరంగా ఈ ఫోన్‌లో 5G, 4G, Wi-Fi, బ్లూటూత్ 5.4, జీపీఎస్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే 3.5mm హెడ్‌ఫోన్ జాక్, USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్‌ను కూడా అందించారు. దీంతోపాటు ఇ-కంపాస్, యాంబియంట్ లైట్ సెన్సర్, యాక్సెలిరోమీటర్ వంటి సెన్సర్లు ఉన్నాయి. భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సర్‌ను ఇచ్చారు. అదనంగా, రిమోట్ కంట్రోల్‌గా ఉపయోగించుకునేలా IR బ్లాస్టర్ కూడా ఈ ఫోన్‌లో అందుబాటులో ఉంది.
Also Read: తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం ఫీల్.. ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో CMF ఫోన్ 2 ప్రోను పొందండిలా!