E-Paper
Advertisement

పాత మోడల్‌కు గుడ్‌బై.. సరికొత్త ఫీచర్లు, అద్భుతమైన లుక్స్‌తో Redmi 17C వచ్చేసింది!

పాత మోడల్‌కు గుడ్‌బై.. సరికొత్త ఫీచర్లు, అద్భుతమైన లుక్స్‌తో Redmi 17C వచ్చేసింది!
Advertisement

Redmi 17C: చైనా మార్కెట్లో రెడ్‌మీ కంపెనీ నుంచి సరికొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ‘రెడ్‌మీ 17C’ అధికారికంగా విడుదలైంది. తక్కువ ధరలో స్మూత్ డిస్‌ప్లే, మెరుగైన బ్యాటరీ లైఫ్ కోరుకునే వారిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ దీనిని డిజైన్ చేసింది. గతంలో వచ్చిన రెడ్‌మీ 15C మోడల్‌కు అప్‌గ్రేడ్‌గా వచ్చిన ఈ ఫోన్.. ముఖ్యంగా యువతను ఆకట్టుకునే ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది.

కళ్లకు హాయినిచ్చే పెద్ద స్క్రీన్:

ఈ సరికొత్త ఫోన్‌లో 6.88 ఇంచుల పెద్ద హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను అందించారు. దీనిలోని 120Hz రీఫ్రెష్ రేట్ వల్ల స్క్రీన్ స్క్రోలింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది. ఎక్కువ సమయం ఫోన్ చూసేవారి కోసం బ్లూ లైట్, ఫ్లికర్ ఫ్రీ సర్టిఫికేషన్లను కూడా ఇచ్చారు. దీనివల్ల సోషల్ మీడియా రీల్స్ ఎంతసేపు చూసినా కళ్లపై పెద్దగా ప్రభావం పడదు.

Advertisement

Also Read: హిందీతో పాటు 20 భాషల్లో లైవ్ ట్రాన్స్‌లేషన్.. ఈ Meta AI Glasses మాయాజాలం చూశారా?

పవర్‌ఫుల్ బ్యాటరీ:

ఈ Redmi 17C ఫోన్ మీడియాటెక్ హెలియో G81 అల్ట్రా ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. రఫ్ అండ్ టఫ్ వాడకానికి, సాధారణ గేమింగ్‌కు ఇది బాగా సెట్ అవుతుంది. ఇక దీనిలో ప్రధాన ఆకర్షణ దీనిలోని 5160mAh బ్యాటరీ. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. అయితే బాక్స్‌లో మాత్రం కేవలం 10W ఛార్జర్‌ను మాత్రమే ఇస్తున్నారు. ఈ ఫోన్ షార్ప్ బ్లాక్, డాన్క్సియా రెడ్, సీ బ్రీజ్ బ్లూ అనే మూడు ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది.

కెమెరా, ఇతర ఫీచర్లు:

Advertisement

ఇకపోతే ఫొటోల విషయానికి వస్తే.. వెనుక వైపు 13MP ప్రధాన కెమెరా, సెల్ఫీల కోసం ముందు వైపు 5MP కెమెరా ఉన్నాయి. భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఇచ్చారు. పాతకాలపు హెడ్‌ఫోన్స్ వాడుకునేందుకు వీలుగా 3.5mm ఆడియో జాక్‌ను కూడా ఇందులో కొనసాగించారు. ఈ ఫోన్ లేటెస్ట్ హైపర్‌ఓఎస్ 3 (HyperOS 3) పై రన్ అవుతుంది.

ధరల వివరాలు:

Redmi 17C రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 4GB RAM, 64GB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ.12,000 కాగా.. 4GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,000గా ఉంది. బడ్జెట్ రేంజ్‌లో పెద్ద స్క్రీన్, తిరుగులేని బ్యాటరీ బ్యాకప్ కావాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్ కానుంది.

Also Read: రియల్‌మీ నుంచి 8000mAh బ్యాటరీతో కొత్త ఫోన్.. బడ్జెట్ ధరలో వావ్ అనిపించే ఫీచర్లు!

Related News

పిల్లల ఆన్‌లైన్ క్లాసులకు బెస్ట్..రూ.18 వేలలోపు అదిరిపోయే లెనోవా స్మార్ట్ ట్యాబ్!

రూ.1,100లోపే అదిరిపోయే స్మార్ట్‌వాచ్ డీల్..వెంటనే కొనేయండి

ఇండియాలో.. పోవా ఏఐ బడ్స్ ప్రో లాంచ్ డేట్ ఫిక్స్! ఫీచర్స్ మాములుగా లేవుగా..

మధ్యతరగతి కుటుంబాలకు పర్ఫెక్ట్ టీవీ.. ఫీచర్లు చూస్తే ఫిదా అవుతారు!

జియో బిగ్ ఆఫర్.. కొత్తగా రూ.550, రూ.2000 ప్లాన్లు.. ఫ్రీగా 15 ఓటీటీలు, 1000+ ఛానెళ్లు!

జస్ట్ రూ.2,000కే 4G ఫోన్లా? UPI, టైప్-సి ఛార్జింగ్‌తో లభించే టాప్ 5 ఆప్షన్లు ఇవే!

వర్షాకాలంలో ఫ్రిజ్ టెంపరేచర్ ఎంత ఉండాలి ? కరెంట్ ఆదా చేసే టిప్స్!

ఇయర్‌బడ్స్ వాడుతున్నారా? అయితే ఈ 5 సీక్రెట్ ట్రిక్స్ మీకు కచ్చితంగా తెలిసి ఉండాలి!

Big Stories

Advertisement
×