E-Paper
Advertisement

రెడ్‌మీ A7 4G, A7 ప్రో 4G బడ్జెట్ ఫోన్లు లాంచ్.. 6300mAh బ్యాటరీ, లాంగెస్ట్ డిస్ ప్లే

రెడ్‌మీ A7 4G, A7 ప్రో 4G బడ్జెట్ ఫోన్లు లాంచ్.. 6300mAh బ్యాటరీ, లాంగెస్ట్ డిస్ ప్లే
Advertisement

Redmi A7 Pro A7 4G: రెడ్‌మీ A7 ప్రో 4G, A7 4G ఫోన్లను మంగళవారం భారత్ లో లాంచ్ చేసింది. ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్ లైనప్‌లో భాగంగా ఈ హ్యాండ్‌సెట్‌లు సరికొత్తగా లాంచ్ చేసింది. రెడ్‌మీ A7 ప్రో 5G లాంచ్ అయిన వారం తర్వాత ఇవి మార్కెట్లోకి రావడం విశేషం. ఈ రెండు మోడళ్లు 64 GB ఆన్‌బోర్డ్ స్టోరేజీ యూనిసోక్ T7250 ప్రాసెసర్‌తో పనిచేస్తాయి.

రెడ్‌మీ A7 ప్రో 4G, రెడ్‌మీ A7 4G ధర

భారత్ లో 4GB RAM, 64GB ఆన్‌బోర్డ్ స్టోరేజీతో ఉన్న వేరియంట్ రెడ్‌మీ A7 ప్రో 4G ధర రూ. 11,499గా నిర్ణయించింది. ఇది బ్లాక్, స్కైసన్‌సెట్ ఆరెంజ్ రంగులలో లభిస్తుంది. మరోవైపు, రెడ్‌మీ A7 4G 3GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 10,499. ఇది బ్లాక్, స్కై బ్లూ రంగులలో లభిస్తుంది. ఈ రెండు హ్యాండ్‌సెట్‌లను ఏప్రిల్ 23 నుంచి Mi.com, అమెజాన్ ఇండియా, ఫ్లిప్‌కార్ట్, షామీ రిటైల్ అవుట్‌లెట్‌ల అందుబాటులో ఉండనున్నాయి.

A7 ప్రో 4G, A7 4G ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

Advertisement

రెడ్‌మీ A7 ప్రో 4G 6.9 అంగుళాల LCD స్క్రీన్‌ను కలిగి ఉండగా, A7 4G 6.88 అంగుళాల LCD ప్యానెల్‌ను కలిగి ఉంది.ఈ రెండు డిస్‌ప్లేలు 120Hz రిఫ్రెష్ రేట్, 800 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 8 బిట్ కలర్ డెప్త్‌ను అందిస్తున్నాయి. A7 ప్రో 4G, A7 4G ఫోన్లు యూనిసోక్ T7250 SoC ప్రాసెసర్‌తో పనిచేస్తాయి. ప్రో మోడల్‌లో 4GB RAM, A7 4Gలో 3GB RAM ఉంది. ఇవి రెండూ 64GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో పనిచేస్తాయి. వీటిలో 2టీబీ వరకు సపోర్ట్ చేసే మైక్రో SD స్లాట్ ఉంది.

Also Read: యాపిల్, సోనీ, శాంసంగ్.. రూ.2000 లోపు బడ్జెట్లో.. బెస్ట్ ఇయర్ ఫోన్స్ ఇవే!

ఓఎస్, సెక్యూరిటీ అప్డేట్స్

Advertisement

రెడ్‌మీ A7 ప్రో 4G ఆండ్రాయిడ్ 16 బేస్డ్ హైపర్‌ఓఎస్ 3తో పనిచేస్తుంది. దీనికి నాలుగు సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లు, ఆరు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లు ఉచితంగా లభిస్తాయి. మరోవైపు, రెడ్ మీ A7 4G మోడల్ ఆండ్రాయిడ్ 15 బేస్డ్ హైపర్‌ఓఎస్ 2పై పనిచేస్తుంది. దీనికి రెండు సంవత్సరాల ఓఎస్, మూడు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్లు ఉచితంగా లభిస్తాయి. రెడ్‌మీ A7 ప్రో 4G, A7 4G లలో LED ఫ్లాష్‌తో 13 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరాతో పనిచేస్తాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలు కూడా ఉన్నాయి. Wi-Fi 5, బ్లూటూత్ 5.2, జీపీఎస్ గ్లోనాస్, గెలీలియో, USB టైప్-C పోర్ట్ లను కలిగి ఉన్నాయి. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP52 రేటింగ్ ను కలిగి ఉన్నాయి.

Related News

స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు భూకంప హెచ్చరికల సాధనంగా.. గూగుల్ బిగ్ అప్‌డేట్!

యూట్యూబ్ ఛానెల్ పెడుతున్నారా? ఈ కంటెంట్‌తో వీడియోలు చేస్తే మీరే కింగ్.. కనక వర్షం కురవాల్సిందే!

యాపిల్ ప్రియులకు ఊహించని షాక్.. ఆన్‌లైన్ స్టోర్ బంద్, కారణం ఏమిటంటే?

యూట్యూబ్‌లో ఏఐ పాటలకు ప్రత్యేక లేబుల్స్.. అసలు ఇవి ఎలా పనిచేస్తాయంటే?

మెమరీ చిప్‌ల కొరత.. 14 ఏళ్ల కనిష్టానికి పడిపోయిన గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్!

iPhone 16 తక్కువ ధరకే వస్తోందని కొంటున్నారా? ఈ విషయం తెలిస్తే ప్లాన్ మార్చుకుంటారు!

యాపిల్ వాచ్ సిరీస్ 11పై ఊహించని డిస్కౌంట్.. అమెజాన్ పండుగ సేల్‌లో టాప్-5 డీల్స్ ఇవే!

శీతాకాలం అలర్ట్.. ఏసీ అవుట్ డోర్ యూనిట్‌కు కవర్.. కేవలం రూ.200తో రూ.20 వేల నష్టానికి చెక్!

Big Stories

Advertisement
×