E-Paper
Advertisement

రిటైర్డ్ జైలర్ ఈసారి గ్లోబల్ వార్.. జైలర్ 2 లో ఊహించని ట్విస్టులు!

రిటైర్డ్ జైలర్ ఈసారి గ్లోబల్ వార్.. జైలర్ 2 లో ఊహించని ట్విస్టులు!

Rajinikanth Jailer:మూడు పదుల్లో ఉన్న కుర్ర హీరోలే ఏడాదికి ఒక సినిమా వదల్లేకపోతుంటే ఏడు పదులు దాటి ఐదేళ్ళయినా రేసు గుర్రంలా దూసుకుపోతున్నాడు తలైవా. ఈ క్రమంలోనే తాజాగా తన లేటెస్ట్ ఫిలిమ్ జైలర్ 2 కి గుమ్మడి కాయ కొట్టేసి మరోసారి బాక్సాఫీస్ వేటకి సిద్ధమైపోయాడు. ఇదే విషయమై కన్ఫాం చేస్తూ సెట్స్‌లోనే భారీ కేక్ కట్ చేసి గ్రాండ్ గా సెలబ్రేషన్స్ జరుపుకుంది మూవీ టీమ్.

పవర్‌ఫుల్ ఫ్లాష్‌బ్యాక్ మెయిన్ హైలైట్

ఇక దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘అలప్పరై కిలప్పరోమ్.. తలైవరు నిరంతరం’ అంటూ సాలిడ్ క్యాప్షన్ ఇచ్చింది సన్ పిక్చర్స్. దీంతో మా తలైవా మరోసారి బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొట్టడానికి రెడీ అయిపోయాడు అంటూ మురిసిపోతున్నారు రజిని ఫ్యాన్స్.ఇక సినిమా కథ విషయానికి వస్తే, ఈసారి ముత్తువేల్ పాండియన్ రేంజ్ గ్లోబల్ లెవల్‌లో ఉండబోతోందన్న టాక్ వినిపిస్తుంది. తమ పాత్రలను శివ రాజ్‌కుమార్, ఎస్.జే. సూర్య, మోహన్‌లాల్, రమ్య కృష్ణన్, మీర్నా మీనన్, యోగి బాబు కంటిన్యూ చేస్తుండగా.. సెకండ్ పార్ట్‌లో ముత్తువేల్ పాండియన్ జైలర్‌గా ఉన్నప్పటి పవర్‌ఫుల్ ఫ్లాష్‌బ్యాక్ మెయిన్ హైలైట్ కానుందట.

also read:మృణాల్ ఠాకూర్ కోసం ధనుష్ రిస్క్.. మరోసారి హాట్ టాపిక్ అయిన డేటింగ్ రూమర్స్!

ఆడియన్స్ ఊహకి అందని థ్రిల్స్

అంతేకాదు, ఈసారి విలన్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ మాఫియాతో ముడిపడి ఉంటుందని ఫిలిమ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్. మొత్తానికి ఫస్ట్ పార్ట్ నేషనల్ అయితే సెకండాఫ్ ఇంటర్నేషనల్ అన్న మాట. ఇక ఇందులోనూ ఆడియన్స్ ఊహకి అందని థ్రిల్స్ ఉంటాయని సమాచారం.అయితే ఫస్ట్ పార్ట్ లో నటించిన శివరాజ్ కుమార్, మోహన్ లాల్, జాకీ ష్రాఫ్ లా ఇందులోనూ పలువురు స్టార్స్ క్యామియో ఉంటాయని రూమర్స్ వినిపించినా మేకర్స్ నుండి మాత్రం ఎలాంటి క్లారిటీ రాకపోవడం గమనార్హం. మరి ఫస్ట్ పార్ట్ లో చేసినవాళ్ళే ఉంటారా లేక మరెవరినైనా యాడ్ చేశారా అనేది రిలీజ్ అయ్యాకే చూడాలి.

మొదటి పార్ట్ దాదాపు 600 కోట్లకు పైగా వసూళ్లు

ఇక సినిమా మొదటి పార్ట్ దాదాపు 600 కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టి రికార్డులు సృష్టించడంతో, ఈ సీక్వెల్‌పై అంచనాలు ఓ రేంజ్ లో పెట్టేసుకున్నారంతా. కానీ తాజాగా సినిమా నుండి ఒక కీలక సీన్ కి సంబంధించిన క్లిప్ బయటికి రావడంతో టోటల్ డిసప్పాయింట్ అయిపోయారు రజినీ ఫ్యాన్స్.ఇక లీకైన కంటెంట్‌ను షేర్ చేసే వారు ఎవరైనా జైలు ఊచలు లెక్కపెట్టాల్సిందే అంటూ ఇప్పటికే వార్నింగ్ ఇచ్చింది సన్ పిక్చర్స్. మొన్నటికి మొన్న విజయ్ ‘జన నాయకన్’ సినిమా కూడా ఇలాగే పైరసీ బారిన పడిన సంగతి తెల్సిందే.

ఇక సినిమా రిలీజ్ పై అఫీషియల్ గా మేకర్స్ ఎలాంటి క్లారిటీ ఇవ్వకున్నా, సినిమా జరుగుతున్న స్పీడ్ బట్టి ఈ సంవత్సరమే వచ్చే ఛాన్స్ పుష్కలంగా కనిపిస్తుంది. చూడాలి మరి మా టార్గెట్ 1000 కోట్లు అంటూ ఎప్పటి నుండో ఆశ పడుతున్న తమిళ తంబీల కోరికని ఈ జైలర్ 2 అయినా నెరవేరుస్తుందో లేదో!

also read:నెట్‌ఫ్లిక్స్‌లో టిల్లు గాడి రచ్చ.. స్టార్ బాయ్ సిద్ధూతో మీనాక్షి చౌదరి రొమాన్స్!

Related News

రామ్‌చరణ్ ఊచకోత.. 48 గంటల్లోనే రూ. 181 కోట్లు. కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్!

బడ్జెట్ తక్కువ సినిమాలు.. బ్లాక్ బాస్టర్ రిజల్ట్..!

యానిమల్ బ్యూటీ లవ్ ఫెయిల్యూర్ స్టోరీ.. అయ్యో అంత బాధపడిందా..?

రూ. 4000 కోట్లా? అంత సీన్ లేదు..‘రామాయణ’, ‘వారణాసి’లపై మనోజ్ భాజ్‌పేయి సెన్సేషన్ కామెంట్స్

తల్లి మరణించిన కొన్ని రోజులకే రేసింగ్ హెల్మెట్ పట్టిన అజిత్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘తలా’ లుక్!

పెళ్లయిన నాలుగేళ్లకే షాకింగ్ నిర్ణయం.. 42 ఏళ్ల వయసులో మళ్లీ ఒంటరిగా మారిన స్టార్ హీరోయిన్!

సైలెంట్‌గా ‘సెంచరీ’ కొట్టేసిన వైష్ణవ్ తేజ్…ఈసారైనా హిట్ కొడతావా గురూ ?

జూన్ 8న పూరీ మార్క్ విధ్వంసం.. విజయ్ సేతుపతి ‘స్లమ్ డాగ్ – 33 టెంపుల్ రోడ్’ క్రేజీ పోస్టర్ వైరల్!

Big Stories

×