USB Earphones 2026: ప్రస్తుతం మార్కెట్ లో చాలా రకాల USB-C వైర్డ్ ఇయర్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. పాటలు వినడానికి, సినిమాలు చూడటానికి, ఆడియో కాల్స్ మాట్లడానికి ఇవి ఎంతగానో తోడ్పాటు అందిస్తుంటాయి. కాబట్టి కొత్తగా బ్రాండెడ్ ఇయర్ ఫోన్స్ కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి రూ.2000 బడ్జెట్ లో అత్యుత్తమైనవి ఈ కథనంలో అందించడం జరుగుతోంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ప్రస్తుతం మార్కెట్ లో అత్యంత ప్రజాధారణ పొందిన ఇయర్ పాడ్స్ గా ఇవి ఉన్నాయి. రూ.1600-1900 మధ్య ఇది అందుబాటులో ఉంది. ఫీచర్ల విషయానికి వస్తే.. దీనిలోని మైక్రోఫోన్ క్వాలిటీ కాల్స్ మాట్లాడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇవి ఐఫోన్ 15, 16 సిరీస్, అన్ని రకాల టైప్-సి ఆండ్రాయిడ్ ఫోన్‌లకు సపోర్ట్ చేస్తాయి. అయితే ఈ యాపిల్ ఇయర్ పాడ్స్ ను ఎక్కువ సమయం చెవులకు పెట్టుకొని ఉన్నప్పటికీ ఏమాత్రం అసౌకర్యంగా అనిపించవని యూజర్లు చెబుతున్నారు.
సోనీ బ్రాండ్ నుండి వచ్చిన ఈ ఇయర్‌ఫోన్‌లు అత్యంత నాణ్యమైన ఆడియో క్వాలిటీని అందిస్తాయి. దీని ధర సుమారు రూ.1,590. ఇందులో ఇన్‌బిల్ట్ DAC (Digital-to-Analog Converter) ఉండటం వల్ల స్పష్టమైన సౌండ్ లభిస్తుంది. ఇది టాంగిల్-ఫ్రీ వైర్ కలిగి ఉండటం వల్ల వైర్లు చిక్కు పడే సమస్య ఉండదు.
బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్ కోరుకునే వారికి వన్ ప్లస్ కు చెందిన ఈ టైప్ సి బుల్లెట్స్ బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తాయి. ఇది మార్కెట్ లో రూ.1,299 లభిస్తోంది. దీని ప్రత్యేకతల విషయానికి వస్తే.. వీటిలో హై-రెజల్యూషన్ ఆడియో సపోర్ట్ ఉంది. దీనికి అమర్చిన 3 బటన్ల సాయంతో మ్యూజిక్, కాల్స్ ను సులభంగా ఆపరేట్ చేయవచ్చు.
శాంసంగ్ తో పాటు ఇతర కంపెనీల మెుబైల్స్ వాడేవారికి సైతం ఈ ఇయర్ ఫోన్స్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. మార్కెట్ లో ఇది సుమారు రూ.1,700-1800 పలుకుతోంది. దీనిలోని AKG ట్యూనింగ్ ఫీచర్ వల్ల మ్యూజిక్ వినేటప్పుడు బాస్ (Bass), ట్రెబిల్ సమాన స్థాయిలో యూజర్ ఎక్స్ పీరియన్స్ చేయవచ్చు. ఫాబ్రిక్ కేబుల్ తో రావడం వల్ల వైర్ త్వరగా పాడయ్యే సమస్య ఉండదు.
మ్యూజిక్ లో అధిక బాస్ (Deep Bass) కోరుకునేవారికి జేబీఎల్ బ్రాండ్ కు చెందిన ఈ ఇయర్ ఫోన్స్ ఉత్తమ ఎంపికగా నిలుస్తాయి. ఇది రూ.1100-1300 పలుకుతోంది. JBL మార్క్ సౌండ్ క్వాలిటీతో పాటు విభిన్నమైన ఈక్విలైజర్ మోడ్స్ లో మ్యూజిక్ వినే వెసులుబాటును ఈ ఇయర్ ఫోన్స్ అందిస్తాయి.
Also Read: శాంసంగ్ ఏఐ స్మార్ట్ గ్లాసెస్.. కుర్రకారుకు పండుగే.. ఫొటోలు, వీడియోలు మీ ఇష్టం!