E-Paper
Advertisement

ఏంది సామీ ఇది.. రూ.9,999కే 5G ఫోన్, అడ్వాన్స్‌డ్ AI ఫీచర్లు, 6.9 ఇంచుల డిస్‌ప్లేనా!

ఏంది సామీ ఇది.. రూ.9,999కే 5G ఫోన్, అడ్వాన్స్‌డ్ AI ఫీచర్లు, 6.9 ఇంచుల డిస్‌ప్లేనా!
Advertisement

Redmi A7 Pro 5G: తక్కువ ధరలో అదిరిపోయే ఫీచర్లు అందించే కంపెనీగా రెడ్‌మీకి మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు అదే నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ.. బడ్జెట్ యూజర్ల కోసం కంపెనీ ‘Redmi A7 Pro 5G’ని ఈనెల 13న గ్రాండ్‌ విడుదల చేయనుంది. ఈ ఫోన్ A సిరీస్‌లో భాగంగా వస్తున్న మొట్టమొదటి Pro మోడల్ కావడం విశేషం. కేవలం ధర తక్కువ ఉండటమే కాదు.. మిడ్‌రేంజ్ ఫోన్లకు గట్టి పోటీ ఇచ్చేలా దీనిని డిజైన్ చేశారు. ముఖ్యంగా కాలేజీ కుర్రాళ్లు, రోజంతా స్క్రోలింగ్ చేసేవారికి ఈ ఫోన్ తెగ నచ్చేస్తుంది.

ఇంత పెద్ద బ్యాటరీనా?

ఈ Redmi A7 Pro 5Gలో మొదట చెప్పుకోవాల్సింది దీని బ్యాటరీ గురించే. సాధారణంగా అదే పనిగా ఫోన్ ఎక్కువగా వాడితే సాయంత్రానికే ఛార్జింగ్ అయిపోతుంది. కానీ ఈ ఫోన్‌లో ఏకంగా 6300mAh భారీ బ్యాటరీని ఇచ్చారు. దీనికి ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే చాలు.. రెండు రోజుల వరకు ఛార్జింగ్ గురించి మర్చిపోవచ్చు. దీనికి తోడు 6.9 ఇంచుల భారీ డిస్‌ప్లే కూడా ఉంది. సినిమాలు చూడాలన్నా, యూట్యూబ్ వీడియోలు ఎంజాయ్ చేయాలన్నా ఈ స్క్రీన్ చాలా బాగుంటుంది. తక్కువ ధరలో ఇలాంటి కాంబినేషన్ దొరకడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.

Advertisement

Also Read: 10x ఆప్టికల్ జూమ్, 200MP కెమెరా.. ఈ ఫోన్ మీ చేతిలో ఉంటే ఇక మీరూ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫరే!

స్మార్ట్ ఫీచర్లు బడ్జెట్లోనే..

సాధారణంగా ఏఐ ఫీచర్లు అంటే రూ.50 వేలు లేదంటే రూ.లక్ష ఫోన్లలోనే ఉంటాయని అనుకుంటాం. కానీ రెడ్‌మీ ఆ ట్రెండ్‌ను మార్చేస్తోంది. ఈ ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 వెర్షన్‌తో వస్తోంది. దీనిలో గూగుల్ ‘సర్కిల్ టు సెర్చ్’ లాంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్నాయి. దీంతో స్క్రీన్ మీద ఏదైనా వస్తువు కనిపిస్తే.. దాని చుట్టూ ఒక చిన్న సర్కిల్ గీసి అది ఏంటో వెంటనే తెలుసుకోవచ్చు. అలాగే ఈ ఫోన్‌లో జెమిని వాయిస్ అసిస్టెంట్ కూడా ఉంటుంది. ఫోన్ వాడకాన్ని మరింత ఈజీగా మార్చేలా ఈ సాఫ్ట్‌వేర్ ఉండబోతోంది.

అద్భుతమైన పర్ఫార్మెన్స్..

Advertisement

చూడటానికి ఈ ఫోన్ చాలా మోడ్రన్‌గా, స్టైలిష్‌గా ఉంటుంది. వెనుక వైపు పిల్ ఆకారంలో ఉన్న కెమెరా సెటప్ ఫోన్‌కు ప్రీమియం లుక్ ఇస్తుంది. ఇక ఫొటోల విషయానికి వస్తే.. దీనిలో 32MP మెయిన్ కెమెరా ఉంది. పగటి పూట తీసే ఫొటోలు, సెల్ఫీలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి చాలా బాగుంటాయి. అంతేకాకుండా.. ఇందులో ఉన్న 5G ప్రాసెసర్ వల్ల ఇంటర్నెట్ స్పీడ్ అదిరిపోతుంది. వీడియోలు చూస్తున్నప్పుడు గానీ, గేమ్స్ ఆడుతున్నప్పుడు గానీ ఎక్కడా ఫోన్ లాగ్ అవ్వకుండా స్మూత్‌గా పనిచేస్తుంది.

ధర ఎంతంటే? 

అన్ని ఫీచర్లు బాగున్నాయి కానీ అసలు విషయం ధర కదా. ప్రస్తుతం లీకైన సమాచారం ప్రకారం.. ఈ ఫోన్ కేవలం రూ.10,000 లోపే ఉండే అవకాశం ఉంది. ఈ రేంజ్‌లో 5G ఫోన్ కావాలనుకునే వారికి, ఎక్కువ సేపు బ్యాటరీ రావాలని కోరుకునే వారికి ఇది కచ్చితంగా నచ్చుతుంది. ముఖ్యంగా తక్కువ ఖర్చులో లేటెస్ట్ ఫీచర్లు వాడాలనుకునే స్టూడెంట్స్ ఈ ఫోన్ కోసం ఏప్రిల్ 13 వరకు వెయిట్ చేయాల్సిందే. ఇండియాలో ఈ ఫోన్ లాంచ్ అయ్యాక బడ్జెట్ మార్కెట్లో దీనికి తిరుగుండదనిపిస్తోంది.

Also Read: 9000mAh భారీ బ్యాటరీతో రంగంలోకి OnePlus Nord 6.. ఫీచర్లు, ధర వివరాలు మీ కోసం!

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×