E-Paper
Advertisement

ధర తక్కువే కానీ ఫీచర్లు నెక్స్ట్ లెవెల్.. Redmi A7 Proలో గూగుల్ AI ఫీచర్లు కూడా!

ధర తక్కువే కానీ ఫీచర్లు నెక్స్ట్ లెవెల్.. Redmi A7 Proలో గూగుల్ AI ఫీచర్లు కూడా!
Advertisement

Redmi A7 Pro: స్మార్ట్‌ఫోన్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది బ్యాటరీ లైఫ్. రోజంతా ఫోన్ వాడినా ఛార్జింగ్ అయిపోకూడదని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. సరిగ్గా ఇదే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రెడ్‌మీ కంపెనీ ఒక అద్భుతమైన బడ్జెట్ ఫోన్‌ను గ్లోబల్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. అదే ‘Redmi A7 Pro’. సాధారణంగా తక్కువ ధరలో వచ్చే ఫోన్లలో ఫీచర్లు అంతంత మాత్రంగానే ఉంటాయని మనలో చాలామందికి ఒక అభిప్రాయం ఉంటుంది. కానీ, ఈ ఫోన్ చూశాక మీరు ఆ మాట మార్చుకుంటారు. ఎందుకంటే.. దీనిలో ఏకంగా 6,000mAh భారీ బ్యాటరీని ఇచ్చారు. ప్రస్తుతం విదేశాల్లో లాంచ్ అయిన ఈ ఫోన్, త్వరలోనే ఇండియాలోకి కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రీజనబుల్ ధర..

ఈ Redmi A7 Pro ధర విషయానికి వస్తే.. ఇది సామాన్యులకు అందుబాటులో ఉండే బడ్జెట్‌లోనే ఉంది. దీనిలో మనకు రెండు రకాల వేరియంట్లు దొరుకుతాయి. 4GB RAM, 64GB స్టోరేజ్ వెర్షన్ ధర సుమారు రూ.14,100 వరకు ఉండొచ్చు. ఇక కొంచెం ఎక్కువ స్టోరేజ్ కావాలనుకునే వారి కోసం 128GB వేరియంట్ కూడా ఉంది. దీని ధర రూ.16,300గా నిర్ణయించారు. కేవలం ధర మాత్రమే కాదు.. ఈ ఫోన్ చూడటానికి చాలా స్టైలిష్‌గానూ ఉంటుంది. అలాగే బ్లాక్, మిస్ట్ బ్లూ, పామ్ గ్రీన్, సన్ సెట్ ఆరెంజ్ వంటి సూపర్ కలర్స్‌లో ఈ ఫోన్ దొరుకుతుంది.

Advertisement

Also Read: ఈ కొత్త ఫోన్ కొంటే.. రూ.6,000 డిస్కౌంట్‌తో పాటు రూ.2,000 విలువైన ఇయర్‌బడ్స్ ఫ్రీ!

మెరుగైన పనితీరు..

ఈ ఫోన్ స్క్రీన్ చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఏకంగా 6.9 అంగుళాల పెద్ద హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే దీనిలో ఉంది. తద్వారా సినిమాలు చూసినా, గేమ్స్ ఆడినా ఎక్స్‌పీరియన్స్ చాలా బాగుంటుంది. ఇక దీనిలో ఇచ్చిన 120Hz రిఫ్రెష్ రేట్ వల్ల ఫోన్ వాడేటప్పుడు ఎక్కడా లాగ్ అవ్వకుండా చాలా స్మూత్‌గా పనిచేస్తుంది. ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా మంచి బ్రైట్‌నెస్‌ను ఇచ్చారు. అలాగే కళ్లకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక జాగ్రత్తలు కూడా తీసుకోవడం మంచి విషయం. ఇక దీని లోపల ఉండే యూనిసోక్ T7250 ప్రాసెసర్ వల్ల యాప్స్ అన్నీ చాలా వేగంగా ఓపెన్ అవుతాయి. లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 వెర్షన్‌తో రావడం ఈ ఫోన్‌కు మరో పెద్ద ప్లస్ పాయింట్.

స్పెషల్ ఏఐ ఫీచర్లు..

Advertisement

ఫోన్ వెనుక వైపు 13MP మెయిన్ కెమెరా ఉంది. పగటి పూట ఫొటోలు చాలా నీట్‌గా, సహజమైన రంగులతో వస్తాయి. ఇక సెల్ఫీల కోసం 8MP కెమెరా ఇచ్చారు. వీటన్నింటికీ మించి ఈ ఫోన్‌లో ఇప్పుడొస్తున్న లేటెస్ట్ గూగుల్ జెమిని ఏఐ ఫీచర్లు ఉండటం విశేషం. ఏదైనా వస్తువును ఫొటోలో చూసి దాని గురించి తెలుసుకోవడానికి ‘సర్కిల్ టు సెర్చ్’ అనే ఆప్షన్ కూడా ఇచ్చారు. భారీ బ్యాటరీకి తోడు 15W ఛార్జర్ సదుపాయం, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, మనం ఇష్టపడే హెడ్‌ఫోన్ జాక్ కూడా దీనిలో ఉన్నాయి. తక్కువ ధరలో మంచి బ్యాటరీ బ్యాకప్, స్పీడ్ కావాలనుకునే వారికి ఈ Redmi A7 Pro నిజంగా బెస్ట్ ఆప్షన్ అవుతుంది.

Also Read: టెక్ లవర్స్ డ్రీమ్ ఫోన్‌పై అమెజాన్‌లో క్రేజీ డీల్.. Galaxy Z Flip 7ను ఇలా సొంతం చేసుకోండి!

 

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×