E-Paper
Advertisement

టెక్ లవర్స్ డ్రీమ్ ఫోన్‌పై అమెజాన్‌లో క్రేజీ డీల్.. Galaxy Z Flip 7ను ఇలా సొంతం చేసుకోండి!

టెక్ లవర్స్ డ్రీమ్ ఫోన్‌పై అమెజాన్‌లో క్రేజీ డీల్.. Galaxy Z Flip 7ను ఇలా సొంతం చేసుకోండి!
Advertisement

Galaxy Z Flip 7 Price Drop: ప్రముఖ టెక్ దిగ్గజం శాంసంగ్ ఫ్లిప్ ఫోన్లంటే టెక్ ప్రియుల్లో ఒక విభిన్నమైన క్రేజ్ ఉంటుంది. చేతిలో ఇమిడిపోయే ఆ డిజైన్, ఫోన్ మడతపెట్టినప్పుడు వచ్చే ఆ ఫీల్ చాలామందికి ఇష్టం. అందుకే ‘Galaxy Z Flip’ సిరీస్‌కు ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. అయితే తాజాగా శాంసంగ్ తన లేటెస్ట్ మోడల్ Galaxy Z Flip 7పై అమెజాన్‌లో అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. రూ.1,09,999 ఉన్న ఈ ఫోన్ ధర, పలు ఆఫర్లతో ఇప్పుడు రూ.లక్ష లోపే వచ్చేస్తోంది. మరి ఈ భారీ డిస్కౌంట్ పూర్తి వివరాలేంటో తెలుసుకుందామా..

ధర ఎంత తగ్గింది?

ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో ప్రస్తుతం సెలెక్టెడ్ బ్యాంక్ కార్డ్‌ని ఉపయోగిస్తే.. రూ.10 నుంచి రూ.12వేల వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఒకవేళ మీ దగ్గర పాత ఫోన్ ఉండి, అది మంచి కండిషన్‌లో ఉంటే దాన్ని ఎక్స్ఛేంజ్ చేసి ధరను ఇంకా తగ్గించుకోవచ్చు. దీనికి తోడు నెలకు కొంత చొప్పున 24 నెలల పాటు వడ్డీ లేని ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. కాబట్టి.. ఒక్కసారిగా డబ్బు పెట్టలేం అనుకునే వారికి ఇది మంచి అవకాశం.

Advertisement

Also Read: రూ.15,000 లోపు గూగుల్ అసిస్టెంట్ టీవీలు.. ఈ టాప్ రేటెడ్ మోడల్స్‌పై ఓ లుక్కేయండి బాస్!

ఫోన్ ఫీచర్లు ఎలా ఉన్నాయి?

ఈసారి శాంసంగ్ తన ఫ్లిప్ ఫోన్ డిజైన్‌లో చిన్న చిన్న మార్పులు చేసి మరింత స్టైలిష్‌గా మార్చింది. దీనిలోని 6.9 అంగుళాల మెయిన్ స్క్రీన్ చూడటానికి చాలా రిచ్‌గా ఉంటుంది. అలాగే ఈ ఫోన్‌లో వాడిన ఎక్సినోస్ 2500 చిప్‌సెట్ వల్ల రోజూ వాడే యాప్స్ గానీ, సోషల్ మీడియా గానీ చాలా స్మూత్‌గా పనిచేస్తాయి. ఇక ఫొటోల విషయానికి వస్తే.. 50MP మెయిన్ కెమెరాతో మంచి క్వాలిటీ ఫొటోలు తీసుకోవచ్చు. బ్యాటరీ కూడా మునుపటి కంటే కొంచెం మెరుగై 4,300 mAhకు పెరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా ‘గెలాక్సీ ఏఐ’ ఫీచర్లు ఈ ఫోన్ వాడకాన్ని చాలా సులభతరం చేస్తాయి.

మైనస్‌లు ఏమైనా ఉన్నాయా?

Advertisement

రూ.లక్ష పెట్టి కొంటున్నప్పుడు కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. ఈ ఫోన్ ఇప్పటికీ 25W వైర్డ్ ఛార్జింగ్‌నే సపోర్ట్ చేస్తుంది. అంటే ఇది కాస్త స్లో అనే చెప్పాలి. ఇక గంటల కొద్దీ హెవీ గేమ్స్ ఆడేవారైతే ఫోన్ కొంచెం వేడెక్కే అవకాశం ఉంది. అలాగే కెమెరాలో జూమ్ చేసే సదుపాయం (టెలిఫోటో లెన్స్) లేకపోవడం ఒక లోటు. అదే రేటులో దొరికే ఇతర సాధారణ ఫోన్లలో కెమెరా ఇంకా పవర్‌ఫుల్‌గా ఉంటుంది.

ఈ డీల్ వర్తేనా?

పాత ఫోల్డబుల్ ఫోన్ వాడుతూ అప్‌గ్రేడ్ అవ్వాలనుకున్నా, లేదంటే అందరికంటే భిన్నంగా స్టైలిష్‌గా ఉండే ఫోన్ మీ దగ్గర ఉండాలనకుంటే ఈ డీల్‌ను వదులుకోవద్దు. రూ.లక్ష లోపు ఈ ఫోన్ దొరకడం అనేది ఖచ్చితంగా మంచి అవకాశమే. కానీ కేవలం గేమింగ్, ఫొటోగ్రఫీ మాత్రమే ముఖ్యం అనుకుంటే మాత్రం మార్కెట్లో ఉన్న ఇతర ఆప్షన్లు కూడా ఒకసారి చెక్ చేయండి. కేవలం ఫ్యాషన్, స్టైల్, పోర్టబిలిటీ కావాలనుకునే వారికి మాత్రం అమెజాన్‌లో దొరుకుతున్న ఈ డీల్ వర్త్ అనే చెప్పాలి.

Also Read: రిమోట్ పనిచేయనప్పుడు ఒక్కటి ఇస్తాం చూశారా.. దాని వెనుకున్న అసలు గుట్టు ఇదే!

ముఖ్య గమనిక:

ఈ కథనంలో మీకు పరిచయం చేసిన ప్రొడక్ట్ లేదా దాని ధరలు.. ఆయా కంపెనీల ఆఫర్లపై ఆధారపడి ఉంటాయి. వాటిని కొనుగోలు చేసేప్పుడు ఒకటికి రెండుసార్లు తప్పకుండా సరిచూసుకోగలరు. మీరు కొనుగోలు చేసే సమయానికి ఈ కథనంలో పేర్కొన్న ధరలు మారిపోయి ఉండవచ్చు. కాబట్టి.. అలాంటి విషయాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు. ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.

Related News

అదే జరిగితే.. ఈ నగరాలన్నీ కనుమరుగు? వరద ఎన్ని ‘అంతస్తుల ఎత్తు’లో దూసుకెళ్తుందంటే?

స్టైలిష్ లుక్..అల్టిమేట్ సౌండ్,యూత్‌ను ఫిదా చేస్తున్న సౌండ్ బార్

పాకెట్ సైజ్ బడ్జెట్ పవర్ బ్యాంక్..రూ.898కే బెస్ట్ మోడల్

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

Big Stories

Advertisement
×