E-Paper
Advertisement

ప్రముఖ నటి సోనాలి బింద్రేపై కేస్ ఫైల్.. భూమిని లాగేసుకున్నారంటూ రైతు ఆవేదన!

ప్రముఖ నటి సోనాలి బింద్రేపై కేస్ ఫైల్.. భూమిని లాగేసుకున్నారంటూ రైతు ఆవేదన!

Sonali bendre:ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ సోనాలి బింద్రే (Sonali Bendre) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం , అభినయంతో.. చిరంజీవి , మహేష్ బాబు లాంటి టాలీవుడ్ స్టార్ హీరోలతో జతకట్టి ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె.. ఇప్పుడు భూ కబ్జా కేసులో ఇరుక్కోవడం అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా నమ్మించి మోసం చేయడమే కాకుండా తన భూమిని లాగేసుకున్నారు అంటూ ఒక రైతు ఆవేదన చెందుతూ కోర్టును ఆశ్రయించారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

భూ కబ్జా కేసులో ఇరుక్కున్న సోనాలి బింద్రే..

పూణే జిల్లా మావల్ ప్రాంతానికి చెందిన రైతు చంద్రకాంత్ షిండే తమ కుటుంబానికి 1957వ సంవత్సరం నుంచి వారసత్వంగా వస్తున్న సుమారు 30 గుంటల భూమిని ప్రముఖ సినీనటి సోనాలి బింద్రే , ఆమె భర్త గోల్డీ బేహల్ అక్రమంగా కొనుగోలు చేశారు అంటూ ఆ రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా సోనాలి బింద్రే భర్త గోల్డీ బేహల్ తమ భూమి అక్రమంగా స్వాధీనం చేసుకోవడమే కాకుండా తమ హక్కులను పట్టించుకోలేదని వాపోయారు ఆ రైతు. తనకు న్యాయం చేయాలి అంటూ వడగావ్ మావల్ సివిల్ కోర్టులో ఆ రైతు పిటిషన్ దాఖలు చేశారు. సుమారుగా 32 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న భూమిలో అక్రమంగా నిర్మాణం కూడా చేస్తున్నారని ఆరోపించారు. పైగా దీనిపై అడిగినందుకు తమ కుటుంబాన్ని బెదిరిస్తున్నారు. అందుకే పోలీసులకు కూడా ఫిర్యాదు చేసాము అంటూ చంద్రకాంత్ షిండే తెలిపారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ప్రతి ఒక్కరు అసలు ఏం జరిగింది? అంటూ ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా దీనిపై నటి సోనాలి బింద్రే స్పందించాలని కోరుతున్నారు కూడా..

ALSO READ:ఫ్లాప్ డైరెక్టర్ తో ఫ్లాప్ హీరో.. ఇద్దరి ఫేట్ మారేనా?

స్పందించిన సోనాలి బింద్రే..

ఇకపోతే భూ కబ్జా చేసిందనే ఆరోపణలు సోనాలి బింద్రే ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆమె తరఫు న్యాయవాదులు దీనిపై స్పందించారు. సోనాలి బింద్రే తరఫున న్యాయవాదులు మాట్లాడుతూ.. భూమి కొనుగోలు పత్రాలలో తన పేరు ఎక్కడా లేదని, ఆరోపణలన్నీ పూర్తిగా అవాస్తవం.. అబద్ధమని, డబ్బుల కోసమే ఇదంతా దురుద్దేశంతో చేస్తున్న ఆరోపణలు అంటూ న్యాయవాదులు పేర్కొన్నారు. ముఖ్యంగా నటి తరఫున న్యాయవాది రాజు షిండే మాట్లాడుతూ.. ఈ భూ కబ్జా విషయంలో రైతు గతంలో తహసీల్దారు, సబ్ డివిజనల్ ఆఫీసర్ దగ్గర పలుమార్లు ఫిర్యాదులు చేశారు. అయితే అవన్నీ కొట్టివేయబడ్డాయి. అయితే తాజాగా కేసును విచారించిన న్యాయస్థానం సోనాలి బింద్రే ఆమె భర్త తో పాటు మరికొంతమందిని ప్రతివాదులుగా చేర్చింది. తదుపరి విచారణను ఏప్రిల్ 20వ తేదీకి వాయిదా వేసింది. ఏది ఏమైనా భూమి విషయంలో సినీనటి సోనాలి బింద్రే ఇలాంటి వివాదాలలో చిక్కుకోవడంతో అభిమానులు. మరి అసలు విషయం ఏమిటో తెలియాలి అంటే ఏప్రిల్ 20న కోర్ట్ విచారణలో వచ్చే తీర్పు కోసం ఎదురుచూడాల్సిందే.

Related News

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

బన్నీ-లోకేష్ కనగారాజ్ సినిమా క్యాన్సిల్ అయిందా? …. అసలు నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే!

చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ బ్యాటింగ్ స్టార్ట్.. సమంత, వరుణ్ తేజ్ రివ్యూస్ వైరల్.. ‘మెగా 158’ టీమ్ స్పెషల్ విష్

పెద్ది’ రిలీజ్ వేళ రచ్చ.. రామ్ చరణ్ విగ్రహంపై దారుణంగా ట్రోల్స్, క్షమాపణలు చెప్పిన ఫ్యాన్స్!

ఇది కదా క్యారెక్టర్ డెడికేషన్ అంటే! ‘పెద్ది’ గెటప్‌లో రోడ్లపై తిరిగిన జగ్గూభాయ్..

షూటింగ్ సెట్‌లో భారీ పేలుడు.. ఎస్‌జే సూర్య డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ఘోర విషాదం!

Big Stories

×