E-Paper
Advertisement

New Smartphone: సామాన్యుల కోసమే ఈ ఫోన్.. కేవలం రూ.5 వేల ధరలోనే లాంచ్.. ఫీచర్లు భలే ఉన్నాయి బాసు..!

New Smartphone: సామాన్యుల కోసమే ఈ ఫోన్.. కేవలం రూ.5 వేల ధరలోనే లాంచ్.. ఫీచర్లు భలే ఉన్నాయి బాసు..!
Advertisement

Redmi A3x Smartphone Launched at Expected Price Of Rs. 5,490: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రెడ్ మి తన కొత్త కొత్త మోడళ్లను మార్కెట్‌లో పరిచయం చేస్తూ ఫోన్ ప్రియులను అట్రాక్ట్ చేస్తోంది. సామాన్యులను దృష్టిలో పెట్టుకొని అతి తక్కువ ధరలోనే మంచి ఫీచర్లు కలిగిన మొబైళ్లను తీసుకువచ్చి ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఎన్నో మొబైళ్లను రకరకాల వేరియంట్లలో తీసుకువచ్చిన రెడ్ మి మంచి రెస్పాన్స్‌ను అందుకుంది. అయితే ఇప్పుడు మరొక స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లో పరిచయం చేసింది.

Redmi తన సరికొత్త A సిరీస్ స్మార్ట్‌ఫోన్ Redmi A3x ను భారతదేశంలో విడుదల చేసింది. Redmi A3xని మిడ్‌నైట్ బ్లాక్, మూన్‌లైట్ వైట్, అరోరా గ్రీన్ అనే 3 కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ తక్కువ ధరతో పాటు అద్భుతమైన ఫీచర్లతో కూడి ఉంటుందని కంపెనీ తెలిపింది. ఫీచర్ ఫోన్‌ల నుండి స్మార్ట్‌ఫోన్‌లకు మారుతున్న వారికి ఇది మంచి ఎంపికగా చెప్పవచ్చు.

Advertisement

Redmi A3x 6.71 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. దీని రిజల్యూషన్ 1650×720 పిక్సెల్‌లు. ఈ స్మార్ట్‌ఫోన్ రిఫ్రెష్ రేట్ 90 Hzగా ఉంది. ఇది స్పష్టమైన, మృదువైన డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ Unisoc Tiger T603 ప్రాసెసర్‌పై పని చేస్తుంది. ఇక స్టోరేజ్ విషయానికొస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ 3 GB RAM + 64 GB స్టోరేజ్‌, అలాగే 4 GB RAM + 128 GB స్టోరేజ్‌తో మార్కెట్లోకి వచ్చింది. మైక్రో SD కార్డ్ సహాయంతో ఈ స్మార్ట్‌ఫోన్ స్టోరేజ్‌ను 1 TB వరకు పెంచుకోవచ్చు.

Also Read: 12.1 అంగుళాలడిస్‌ప్లే, 10000mAh బ్యాటరీతో Redmi కొత్త 5జీ వేరియంట్.. నీ యవ్వ తగ్గేదే లే..!

Advertisement

అలాగే దీని బ్యాటరీ విషయానికొస్తే.. ఇది 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది USB టైప్-సి ద్వారా 10W ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఇక Redmi A3x ప్రాథమిక ఫోటోల కోసం QVGA లెన్స్‌తో 8-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 5-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. వీటితో పాటు 3.5 mm హెడ్‌ఫోన్ జాక్, డ్యూయల్ సిమ్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటివి ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14పై రన్ అవుతుంది. అయితే దీని ఎంత ఉంటుందని అంతా చర్చించుకుంటున్నారు. దీని అధికారిక ధర ఇంకా తెలియనప్పటికీ.. ఇది రూ.5,490 ధరతో అందుబాటులో ఉండే అవకాశం ఉందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Tags

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×