E-Paper
Advertisement

ఇక ఫోన్ అస్సలు వేడెక్కదు.. లోపలే ఫ్యాన్ అమర్చిన రెడ్‌మీ, ఫీచర్లు అదుర్స్ అంతే!

ఇక ఫోన్ అస్సలు వేడెక్కదు.. లోపలే ఫ్యాన్ అమర్చిన రెడ్‌మీ, ఫీచర్లు అదుర్స్ అంతే!
Advertisement

Redmi K90 Max: ఆన్‌లైన్ గేమ్స్ అంటే పడిచచ్చే వాళ్ల కోసం రెడ్‌మీ ఒక క్రేజీ న్యూస్ చెప్పింది. చైనాలో తమ పవర్‌ఫుల్ రెడ్‌మీ K90 Max మోడల్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేసింది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న K90 సిరీస్‌లో ఇదొక స్పెషల్ ఫోన్ అని చెప్పొచ్చు. మామూలుగా గేమింగ్ ఫోన్లు అంటే చూడటానికి రకరకాల లైట్లతో కాస్త వింతగా ఉంటాయి. కానీ, ఈ K90 Max మాత్రం చూడటానికి చాలా క్లాస్‌గా, సింపుల్ లుక్‌లో ఉంటూనే లోపల మాత్రం మాంచి పవర్‌ఫుల్ ఫీచర్లను దాచుకుంది.

ఈ ఫోన్‌ లోపలే ఒక కూలింగ్ ఫ్యాన్ ఉంటుంది. ఫోన్ వెనుక కెమెరాల దగ్గర అమర్చిన ఈ చిన్న ఫ్యాన్.. గంటల తరబడి గేమ్స్ ఆడినా ఫోన్ వేడెక్కకుండా చూస్తుంది. కేవలం 100 సెకన్లలోనే ఫోన్ వేడిని 10 డిగ్రీల వరకు తగ్గించేస్తుందని కంపెనీ చెబుతోంది. ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు కూడా సౌండ్ అస్సలు రాదు. అంతేకాదు.. ఫోన్ గట్టిగా ఉండటానికి అల్యూమినియం ఫ్రేమ్ వాడారు. నీళ్లలో పడినా, దుమ్ము తగిలినా ఏం కాకుండా ఐపీ రేటింగ్స్ కూడా ఇచ్చారు.

Advertisement

Also Read: 200MP కెమెరా, 7050mAh భారీ బ్యాటరీతో భారత్‌లోకి వచ్చేస్తోన్న Find X9 Ultra.. ఫీచర్లు కెవ్వు కేక!

గేమ్స్ ఆడేటప్పుడు బొమ్మలు స్పష్టంగా కనిపించాలని ఇందులో 6.83 అంగుళాల పెద్ద అమోల్డ్ స్క్రీన్‌ను ఇచ్చారు. ఇది 165Hz స్పీడ్‌తో పనిచేస్తుంది కాబట్టి.. గేమ్ ప్లే చాలా స్మూత్‌గా ఉంటుంది. ఇక ఫోన్ స్పీడ్ విషయానికి వస్తే.. లేటెస్ట్ మీడియాటెక్ డైమెన్సిటీ 9500 చిప్‌సెట్ వాడారు. దీనికి తోడు 16GB RAM ఉండటంతో ఎంత భారీ గేమ్ అయినా సరే అసలు లాగ్ అవ్వకుండా నడుస్తుంది. అలాగే డేటా దాచుకోవడానికి 1TB వరకు స్టోరేజ్ ఆప్షన్ కూడా ఉంది.

Advertisement

ఎక్కువ సేపు గేమ్స్ ఆడితే ఛార్జింగ్ త్వరగా అయిపోతుందనే భయం వద్దు. ఎందుకంటే ఇందులో ఏకంగా 8550mAh భారీ బ్యాటరీని పెట్టారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలా సేపు వస్తుంది. ఒకవేళ ఛార్జింగ్ అయిపోయినా.. 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో నిమిషాల్లో ఫుల్ చేసుకోవచ్చు. ఇక ఫొటోల కోసం 50MP మెయిన్ కెమెరా, సెల్ఫీల కోసం 20MP కెమెరా ఉన్నాయి. లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 వెర్షన్‌తో ఈ ఫోన్ మార్కెట్లోకి వస్తోంది.

చైనాలో ఈ ఫోన్ ధర రూ.48,200 నుంచి మొదలవుతుంది. షావోమీ 17T పేరుతో వచ్చే ఛాన్స్ ఉందని టాక్ నడుస్తోంది. ఫోన్ పర్ఫార్మెన్స్ అదిరిపోవాలి, బ్యాటరీ రోజంతా రావాలి అనుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్. అయితే, కేవలం ఫొటోలే ముఖ్యం అనుకుంటే మాత్రం ఇతర మోడల్స్ చూడటం బెటర్. గేమ్ లవర్స్ మాత్రం దీనికోసం వెయిట్ చేయొచ్చు.

Also Read: మిడ్‌రేంజ్ ధరలో ప్రీమియం ఫీచర్లు.. గేమర్స్ కోసం OnePlus Nord CE 6 వచ్చేస్తోంది!

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×