E-Paper
Advertisement

200MP కెమెరా, 7050mAh భారీ బ్యాటరీతో భారత్‌లోకి వచ్చేస్తోన్న Find X9 Ultra.. ఫీచర్లు కెవ్వు కేక!

200MP కెమెరా, 7050mAh భారీ బ్యాటరీతో భారత్‌లోకి వచ్చేస్తోన్న Find X9 Ultra.. ఫీచర్లు కెవ్వు కేక!
Advertisement

Oppo Find X9 Ultra: వచ్చే నెలలో మొబైల్ మార్కెట్ షేక్ అవ్వడం ఖాయం. ఎందుకు అనేగా మీ డౌట్? ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఒప్పో తమ మోస్ట్ అవేటెడ్ ఫ్లాగ్‌షిప్ సిరీస్ Find X9లో మరో రెండు అదిరిపోయే మోడల్స్‌ను ఇండియాలో లాంచ్ చేయనుంది. గ్లోబల్ మార్కెట్‌లో ఇప్పటికే హాట్ టాపిక్‌గా మారిన Oppo Find X9 Ultra, Find X9s మోడల్స్ మే నెలలో మన ముందుకు రాబోతున్నాయి. పవర్‌ఫుల్ ఫీచర్లు, కెమెరా క్వాలిటీతో వస్తున్న ఈ ఫోన్లలో ఏమేం ప్రత్యేకతలు ఉన్నాయో ఓసారి చూద్దాం.

కెమెరా అంటే అల్ట్రానే..

ఫొటోగ్రఫీ ప్రియుల కోసం ఒప్పో ఈ ఫైండ్ X9 అల్ట్రాను స్పెషల్‌గా డిజైన్ చేసింది. దీనిలో హ్యాసెల్‌బ్లాడ్ కెమెరా సిస్టమ్ ఉండటం వల్ల ఫొటోలు చాలా నేచురల్‌గా వస్తాయి. మెయిన్ కెమెరా ఏకంగా 200MP కావడం విశేషం. దీనికి తోడు 200MP పోర్ట్రెయిట్ లెన్స్ కూడా ఉంది. దీంతో మీరు తీసే ప్రతి ఫొటో ఒక DSLR కెమెరాతో తీసినట్టే క్లియర్‌గా ఉంటుంది. ఇక 10x ఆప్టికల్ జూమ్ ఉండటం వల్ల ఎక్కడో దూరంగా ఉన్న వస్తువులను కూడా స్పష్టంగా షూట్ చేయొచ్చు.

Advertisement

Also Read: వన్‌ప్లస్ నుంచి క్రేజీ అప్డేట్ మావా.. ఈ కొత్త వాచ్ ధర, ఫీచర్లు తెలిస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

స్పీడ్ విషయంలో నెక్ట్స్ లెవెల్..

ఈ ఫోన్ కేవలం కెమెరాలోనే కాదు.. స్పీడ్ విషయంలో కూడా ముందుంటుంది. దీనిలో లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌ను వాడారు. దీంతో భారీ గేమ్స్ ఆడినా, ఎన్ని యాప్స్ వాడినా ఫోన్ అస్సలు స్లో అవ్వదు. ఇక 6.82 ఇంచుల పెద్ద స్క్రీన్ మీద వీడియోలు చూస్తుంటే థియేటర్ అనుభూతి కలుగుతుంది. దీనిలో ఉన్న 7050mAh భారీ బ్యాటరీని ఫాస్ట్‌గా ఛార్జ్ చేయడానికి 100W ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.

తక్కువ ధరలో ఫ్లాగ్‌షిప్ ఫోన్..

Advertisement

మరోవైపు కొంచెం తక్కువ బడ్జెట్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు కావాలనుకునే వారి కోసం ఫైండ్ X9s రాబోతోంది. దీనిలో మీడియాటెక్ డైమెన్సిటీ 9500s ప్రాసెసర్ ఉంటుంది. చేతిలో పట్టేలా హ్యాండీగా ఉండే ఈ ఫోన్.. కాలేజ్ స్టూడెంట్స్‌కు, ఆఫీస్ పనుల కోసం ఫోన్ వాడేవారికి పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. దీనిలో కూడా 50MP ట్రిపుల్ కెమెరా సెటప్ ఇస్తున్నారు. దీనితో 4K వీడియోలు అదిరిపోయే క్వాలిటీతో తీసుకోవచ్చు.

ఫోన్ నీటిలో పడినా ఏం కాదు..

సాధారణంగా పెద్ద పెద్ద ఫోన్లలో బ్యాటరీ త్వరగా అయిపోతుందని చాలామంది భయపడుతుంటారు. కానీ ఒప్పో ఈ విషయంలో ఒక అడుగు ముందుకేసి రెండు ఫోన్లలోనూ 7000mAhకి పైగా కెపాసిటీ ఉన్న బ్యాటరీలను పెట్టింది. ఫైండ్ X9sలో 7025mAh బ్యాటరీ ఉండటం వల్ల ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజంతా హ్యాపీగా వాడుకోవచ్చు. వీటికి తోడు ఫోన్ నీటిలో పడినా ఏమీ కాకుండా వాటర్ రెసిస్టెంట్ ఫీచర్స్ కూడా ఉన్నాయి.

Also Read: వేసవిలో చల్లగా.. చలికాలంలో వెచ్చగా.. మల్టిపర్పస్ ఏసీ అంటే ఇదే, ధర కూడా తక్కువే!

Related News

iPhone 18 Pro కొనేముందు ఈ ఒక్క విషయం తెలుసుకోండి.. లేదంటే లబోదిబోమనాల్సిందే!

రూ.1,699కే బెస్ట్ పోర్టబుల్ స్పీకర్ ఇదే! ఇల్లు దద్దరిల్లే సౌండ్ గ్యారంటీ

బెస్ట్ విండోస్ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఈ మోడల్‌పై ఓ లుక్కేయండి

మెడలో వేసుకుంటే చాలు.. మన మైండ్‌లో ఏముందో చెప్పేసే ఏఐ రోబోట్ వచ్చేసింది!

బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఆఫీస్, స్టూడెంట్స్‌కు పర్ఫెక్ట్

రూ.9,490కే ఫ్రిజ్..సింగిల్ రూమ్స్, బ్యాచిలర్స్‌కు బెస్ట్!

తక్కువ ధరలో బెస్ట్ బ్రాండెడ్ వాచ్.. రెడ్‌మీ నుంచి మార్కెట్‌ను షేక్ చేసే కొత్త మోడల్!

Huawei Watch GT 7 సిరీస్ లాంచ్.. 21 రోజుల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!

Big Stories

Advertisement
×