E-Paper
Advertisement

టెలివిజన్ ప్రీమియర్ కు సిద్ధమైన ప్రభాస్ సినిమా.. ఎప్పుడు? ఎక్కడ చూడొచ్చంటే?

టెలివిజన్ ప్రీమియర్ కు సిద్ధమైన ప్రభాస్ సినిమా.. ఎప్పుడు? ఎక్కడ చూడొచ్చంటే?
Advertisement

The Raja Saab: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం ది రాజా సాబ్(The Raja Saab). ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ఈ ఏడాది సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 9వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయింది. ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కనీసం పెట్టుబడిలో సగం కలెక్షన్లను కూడా రాబట్టలేక డిజాస్టర్ గా నిలిచింది. ఇలా ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను నిరాశపరచడంతో ప్రభాస్ అభిమానులు డైరెక్టర్ మారుతి పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏప్రిల్ 26న రాబోతున్న రాజాసాబ్…

మారుతి లాంటి డిజాస్టర్ డైరెక్టర్ కు ప్రభాస్ సినిమా చేసే అవకాశం ఇచ్చినప్పటికీ ఆయన సరైన విధంగా ఆ అవకాశం అందుకోలేకపోయారని చెప్పాలి. ఇలా థియేటర్లలో ప్రేక్షకులను నిరాశపరిచిన ఈ సినిమా హాట్ స్టార్ లో కూడా పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇకపోతే తాజాగా ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ కు సిద్ధమవుతోంది. ఈ సినిమా శాటిలైట్ హక్కులను ప్రముఖ ఛానల్ స్టార్ మా (Star Maa)కైవసం చేసుకున్నారు. తాజాగా ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ కి సంబంధించిన విషయాన్ని చిత్ర బృందం అధికారకంగా ప్రకటించారు.

స్టార్ మా లో ప్రసారానికి సిద్ధమైన రాజా సాబ్..

Advertisement

ఎవ్రీబడీ స్టెప్ అసైడ్.. రాజా ఈజ్ కమింగ్ టు వైబ్ అంటూ స్టార్ మా సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా ప్రీమియర్ కి సంబంధించిన విషయాన్ని అధికారికంగా తెలియజేశారు. ఇక ఈ సినిమా ఏప్రిల్ 26వ తేదీ సాయంత్రం5:30 లకు ప్రసారం కాబోతుందని తెలిపారు. ఈ సినిమాలో ప్రభాస్ వింటేజ్ లుక్ లో కనిపించి సందడి చేశారు. ఇందులో ఈయనకు జోడిగా ముగ్గురు ముద్దుగుమ్మలు నటించిన సంగతి తెలిసిందే. మాళవిక నాయర్ తో పాటు నిధి అగర్వాల్, రిద్ది కుమార్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ సినిమా హారర్ కామెడీ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ప్రభాస్..

Advertisement

ఇలా థియేటర్లలో అలాగే డిజిటల్ మీడియాలో పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోయిన ఈ సినిమా టీవీలోనైనా ఎలాంటి ఆదరణను సొంతం చేసుకుంటుందో తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ తాతయ్య పాత్రలో నటుడు సంజయ్ దత్ నటించిన సంగతి తెలిసిందే. ఏది ఏమైనా ఎన్నో అంచనాల నడుమ సుమారు 400 కోట్ల బడ్జెట్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా నిర్మాతలకు భారీ స్థాయిలో నష్టాలను మిగిల్చింది. ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన వరుస పాన్ ఇండియా సినిమాల షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఫౌజీ సినిమా షూటింగ్ తో పాటు స్పిరిట్ సినిమా పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమాలతో పాటు కల్కి 2, సలార్ 2 సినిమాలో కూడా ప్రభాస్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

Also Read: చిరంజీవి బ్లాక్ బస్టర్ సినిమా మిస్ చేసుకున్న రాజశేఖర్…బ్యాడ్ లక్ అంటూ!

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×