E-Paper
Advertisement

Redmi Note 14 Pro Plus: రెడ్ మి నోట్ ప్రొ ప్లస్ వచ్చేస్తోంది బ్రో.. ఫీచర్స్ కిర్రాక్‌గా ఉన్నాయ్‌గా

Redmi Note 14 Pro Plus: రెడ్ మి నోట్ ప్రొ ప్లస్ వచ్చేస్తోంది బ్రో.. ఫీచర్స్ కిర్రాక్‌గా ఉన్నాయ్‌గా
Advertisement

Redmi Note 14 Pro Plus| చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ షావోమీ త్వరలో ఒక కొత్త ఫోన్ ఇండియాలో లాంచ్ చేయబోతోంది. ఒక కొత్త ఫ్లాగ్ షిప్ సిరీస్ రెడ్‌మి నోట్ 14 5జి త్వరలో భారతదేశంలో యూజర్లకు అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ చైనాలో సెప్టెంబర్ 26, గురువారం లాంచ్ కానుంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. ఈ సిరీస్ లో రెడ్మి నోట్ 14 (Redmi Note 14), రెడ్మి నోట్ 14 ప్రో (Redmi Note 14 pro), రెడ్మి నోట్ 14 ప్రో ప్లస్ (Redmi Note 14 pro plus) లాంటి స్మార్ట్ ఫోన్ మోడల్స్ ఉంటాయి.

అయితే షోవోమి కంపెనీ రెడ్మి నోట్ 14 ప్రో ప్లస్ కు ఇండియాలో లాంచ్ చేసేందుకు బిఐఎస్ ( Bureau of Indian Standards) సర్టిఫికేషన్ కోసం ప్రయత్నాల్లో ఉంది. ఇందులో భాగంగానే బిఐఎస్ వెబ్ సైట్ పై ఈ ఫోన్ దర్శనిమిస్తోంది. టెక్ రిపోర్ట్స్ ప్రకారం.. రెడ్మి నోట్ 14 5జీ స్మార్ట్ ఫోన్ 3c సర్టిఫికేషన్ సైట్ లో కూడా కనిపిస్తోంది. ఈ వెబ్‌సైట్‌లో ఈ స్మార్ట్ ఫోన్ 24090RA29C మోడల్ నెంబర్ తో చూడవచ్చు. ఇంతకుముందు ఈ స్మార్ట్ ఫోన్ ఐఎంఈఐ డేటాబేస్ లో కూడా యూజర్లు స్పాట్ చేశారు. బిఐఎస్ వెబ్‌సైట్ లో రెడ్మి నోట్ 14 ప్రో మోడల్ నెంబర్ 24094RAD4I తో చూడవచ్చు.

Advertisement

Also Read: ఇండియాలో బడ్జెట్ ఫ్లిప్ ఫోన్ త్వరలోనే లాంచ్..శాంసంగ్ కంటే సగం ధరకే ఇన్‌ఫినిక్స్ జీరో ఫ్లిప్

ఇలా సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ లో ఉండడంతో కంపెనీ త్వరలోనే భారతదేశ మార్కెట్ లో లాంచ్ చేయనుందని అంచనా. అయితే ముందు షావోమీ తన కొత్త మోడల్స్ ను ఇతర దేశాల్లో లాంచ్ చేసిన తరువాత ఇండియాలో తీసుకువచ్చేది. కానీ మోడల్ చివరి నెంబర్ లో ఐ ఉండడంతో ఇప్పుడు ఇండియాలో ముందుగానే రాబోతోందని తెలుస్తోంది.

Advertisement

రెడ్మి నోట్ 14 ప్రో ఫీచర్స్

రెడ్మి నోట్ 14 ప్రో లో చాలా అడ్వాన్సడ్ ఫీచర్స్ ఉండే అవకాశం ఉంది. టెక్ రిపోర్ట్స్ ప్రకారం.. ఇందులో 120 Hz రిఫ్రెష్ రేట్ తో 6.67 ఇంచ్ 1.5k OLED డిస్‌ప్లే ఉంటుంది. కార్నింగ్ గోరిల్లా గ్లాస్ 2 ప్రొటెక్షన్ ఉంటుంది. ఇందులో Snapdragon 7s Gen 3 చిప్ సెట్ తో పాటు 12GB RAM ఉంటుంది. 90W ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ తో 6,200 mAh బ్యాటరీ కూడా ఉండడం ప్రత్యేకం.

కెమెరా విషయానికి వస్తే.. OIS సపోర్ట్ తో 800 లెన్స్ కలిగిన 50ఎంపీ ఓమ్నీవిజన్ లైట్ ఫ్యూజన్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఈ కెమెరాలో 60mm and 2.5x ఆప్టికల్ జూమ్ తో ఫోకల్ లెన్స్ ఉండే అవకాశం ఉంది. ఇక ధర విషయానికి వస్తే.. కంపెనీ ఇప్పటివరకు దీని గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.

రెడ్మి నోట్ 14 సిరీస్ ఇండియాలో లాంచ్ డేట్ గురించి చెప్పలేదు. కానీ 2025 సంవత్సరం ప్రథమార్థం కల్లా ఈ ఫోన్ ఇండియా యూజర్లకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. 2024 సంవత్సరం జనవరిలో ఇలాగే రెడ్మి నోట్ 13 సిరీస్ ని షావోమీ ఇండియాలో లాంచ్ చేయడం గమనార్హం.

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×