BigTV English
Advertisement

IPL 2025: ధోని అదిరిపోయే ప్లాన్‌..CSKలోకి అశ్విన్, షమీ..!

IPL 2025: ధోని అదిరిపోయే ప్లాన్‌..CSKలోకి అశ్విన్, షమీ..!

Ms Dhoni And CSK Eye Mohammed Shami, R Ashwin In IPL 2025 Mega Auction: ఐపీఎల్ 2025 టోర్నమెంట్ కోసం ఫ్యాన్స్ అందరూ ఇప్పటినుంచి ఎదురుచూస్తున్నారు. మ్యాచులు ప్రారంభమైతే ఇంట్లో కూర్చుని.. ఎంజాయ్ చేయాలని ఫాన్స్ ఎంతో ఆత్రుతగా ఉన్నారు. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కోసం… ఈ సంవత్సరం చివరిలో మెగా వేలం కూడా నిర్వహించనుంది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఈ ఏడాది నవంబర్ చివర్లో… డిసెంబర్ మొదటి వారంలో మెగా వేలం జరగనుంది.


దుబాయ్ వేదికగా ఈ మెగా వేళాన్ని నిర్వహించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్లాన్ చేస్తోంది. అయితే ఈ నేపథ్యంలో.. ఏ ప్లేయర్ వేలంలోకి వస్తాడు? ఎవరు ఇంతకు కొనుగోలు అవుతారు అనే దానిపైన అందరిలోనూ ఆసక్తి ఉంది. కానీ ఇప్పటివరకు రిటెన్షన్ విధానం పైన బీసీసీఐ ఎక్కడ ప్రకటించలేదు. దీంతో టీం యాజమాన్లు గందరగోళానికి గురవుతున్నారు. అయితే మెగా వేలం నిర్వహిస్తే… ఎవరిని కొనుగోలు చేయాలనే దానిపై ఇప్పటినుంచి కసరత్తులు మొదలుపెట్టాయి జట్ల యజమాన్యాలు.

Ms Dhoni And CSK Eye Mohammed Shami, R Ashwin In IPL 2025 Mega Auction

అయితే ఇందులో భాగంగానే చెన్నై సూపర్ కింగ్స్ పెద్ద స్కెచ్ వేసినట్లు సమాచారం. టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్, మహమ్మద్ షమీని…ఈ వేళలో కొనుగోలు చేయాలని చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం భావిస్తోందట.మహేంద్ర సింగ్ ధోని కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారట.వారిద్దరిని కొనుగోలు చేస్తే.. చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ విభాగం బలంగా తయారవుతుందని ధోని సలహా ఇచ్చారట.


Also Read: Virat Kohli: కోహ్లీ సంచలన నిర్ణయం..ఇక ‘ఢిల్లీ’ నుంచి బరిలోకి !

దీంతో ఈ ఇద్దరు ప్లేయర్లను కొనుగోలు చేయాలని చిన్న యాజమాన్యం నిర్ణయం తీసుకుందట. 2015 సంవత్సరం వరకు చెన్నై సూపర్ కింగ్స్ తరఫున రవిచంద్రన్ అశ్విన్ ఆడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వేరే జట్టుకు వెళ్ళిపోయాడు. ఇక 2019లోనే మహమ్మద్ షమీని కొనుగోలు చేయాలని చెన్నై సూపర్ కింగ్స్ భావించి.. వెనక్కి తగ్గింది. కానీ ఈసారి ఎలాగైనా షమి ని కొనుగోలు చేయాలని అనుకుంటుందట.

Also Read: IPL 2025: ఐపీఎల్‌ జట్లకు BCCI గుడ్‌ న్యూస్‌..తెరపైకి కొత్త 4+2 రిటెన్షన్ పాల‌సీ…?

మహమ్మద్ షమీని 2022 ఐపీఎల్ సమయంలోనే రూ. 6.25 కోట్లకు కొనుగోలు చేసింది గుజరాత్ టైటాన్స్. అప్పటి నుంచి గుజరాత్ టైటాన్స్ లో ఇప్పటి వరకు బౌలింగ్ ఎటాక్‌లో షమీ కీలక పాత్ర పోషించాడు. గుజరాత్ టైటాన్స్ ఛాంపియన్‌ గా నిలవడంతో షమీది కీలక పాత్ర. టీమిండియా రెగ్యులర్ ఆటగాడు, దేశంలో అత్యంత అనుభవజ్ఞుడైన ఫాస్ట్ బౌలర్‌లలో ఒకరైన షమీ… గుజరాత్ టైటాన్స్ తరఫున ఇప్పటివరకు 33 మ్యాచ్‌లు ఆడాడు. 48 వికెట్లు పడగొట్టాడు.

Related News

Pratika Rawal Medal : ప్రతీకా రావల్ కు ఘోర అవ‌మానం..కానీ అంత‌లోనే ట్విస్ట్‌, ICC బాస్ జై షా నుంచి పిలుపు

Hong Kong Sixes 2025: దినేష్ కార్తీక్ చెత్త కెప్టెన్సీ.. కువైట్, UAE చేతిలో వ‌రుస‌గా ఓడిన టీమిండియా

Womens World Cup 2029: వ‌చ్చే వ‌ర‌ల్డ్ క‌ప్ 2029పై ఐసీసీ సంచ‌ల‌న నిర్ణ‌యం..ఇకపై 8 కాదు 10 జ‌ట్లకు ఛాన్స్‌, ఫాకిస్తాన్ కు నో ఛాన్స్ !

IND VS AUS 5th T20I: నేడే చివ‌రి టీ20..టీమిండియాను వ‌ణికిస్తున్న గ‌బ్బా…సూర్య, గిల్‌ కు ఇక లాస్ట్ ఛాన్స్‌

Abhishek- Gill LV Bag: ఏంట్రా అభిషేక్‌…నీ సంచులు దేశం మొత్తం అమ్మేస్తున్నారా? లేడీస్ హ్యాండ్ బ్యాగులుగా కూడా

CP Sajjanar : వీళ్లేం సెల‌బ్రిటీలు?…రైనా, ధావన్‌లపై స‌జ్జ‌నార్ సీరియ‌స్‌

Cm Revanth Reddy: హైదరాబాద్ లో మ‌రో అంత‌ర్జాతీయ స్టేడియం..ఆస్ట్రేలియా త‌ర‌హాలో బౌన్సీ పిచ్ లు

BBL New Rule : BBLలో కొత్త రూల్స్‌…ఇకపై బంతి తాకితే అభిమానుల‌కే, త్వ‌ర‌లో ఐపీఎల్ లో కూడా

Big Stories

×