E-Paper
Advertisement

Smartphone Comparison: రెడ్‌మి నోట్ 15 ప్రో+ vs శాంసంగ్ గెలాక్సీ A55 vs పోకో F7 5G.. ఏ ఫోన్ కొనుగోలు చేయాలి?

Smartphone Comparison: రెడ్‌మి నోట్ 15 ప్రో+ vs శాంసంగ్ గెలాక్సీ A55 vs పోకో F7 5G.. ఏ ఫోన్ కొనుగోలు చేయాలి?

Redmi Note 15 Pro+ vs Galaxy A55 vs Poco F7 5G Smartphone Comparison| షావోమీ ఇటీవలే భారతదేశంలో రెడ్‌మి నోట్ 15 ప్రో+ 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది. మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఈ ఫోన్ ఇప్పుడు ఆకర్షణీయంగా ఉంది. అయితే ఈ ఫోన్‌కు పోటీగా శాంసంగ్ బ్రాండ్‌లో గెలాక్సీ A55, పోకో కంపెనీకి చెందిన పోకో F7 5G ఉన్నాయి. మూడు ఫోన్లు ప్రీమియం మిడ్-రేంజ్ సెగ్మెంట్‌లో ఉన్నాయి. పర్‌ఫామెన్స్, కెమెరా, బ్యాటరీ, ఫీచర్లలో బలంగా ఉన్నాయి. ఈ ఫోన్లలో ఏది బెస్ట్ అని తెలుసుకునేందుకు వీటి ధర, డిస్‌ప్లే, ప్రాసెసర్, కెమెరా, బ్యాటరీ వివరాలు పోల్చి చూద్దాం.

ధర, స్టోరేజ్ ఆప్షన్లు

రెడ్‌మి నోట్ 15 ప్రో+ 5G 8GB ర్యామ్ + 128GB వేరియంట్ ధర రూ.37,999.
పోకో F7 5G 12GB ర్యామ్ + 256GB ధర రూ.31,999, 12GB + 512GB రూ.33,999.
శాంసంగ్ గెలాక్సీ A55 8GB ర్యామ్ + 128GB వేరియంట్ ధర రూ.28,999 ఉండగా.. 8GB ర్యామ్ + 256GB రూ.31,999 అయితే ఇందులో 12GB ర్యామ్+ 256GB వేరియంట్ రూ.34,999. శాంసంగ్ ఎక్కువ స్టోరేజ్ ఆప్షన్లు ఇస్తోంది.

డిస్‌ప్లే, విజువల్ ఎక్స్‌పీరియన్స్

రెడ్‌మి నోట్ 15 ప్రో+ 5Gలో 6.83 ఇంచ్ AMOLED డిస్‌ప్లే, 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. గరిష్ట బ్రైట్‌నెస్ 3,200 నిట్స్.
పోకో F7 5Gలో కూడా 6.83 ఇంచ్ AMOLED, 120Hz, 3,200 నిట్స్ బ్రైట్‌నెస్ ఉంది.
శాంసంగ్ గెలాక్సీ A55లో 6.6 ఇంచ్ సూపర్ AMOLED, ఫుల్ HD+ రిజల్యూషన్, 120Hz రేట్, 1,000 నిట్స్ బ్రైట్‌నెస్ ఉంది.

సాఫ్ట్‌వేర్, యూజర్ ఇంటర్‌ఫేస్

రెడ్‌మి నోట్ 15 ప్రో+ 5G, పోకో F7 5G రెండూ Android 15 ఆధారిత HyperOS 2తో రన్ అవుతాయి.
శాంసంగ్ గెలాక్సీ A55 Android 14 ఆధారిత One UI 6.1తో వస్తుంది. శాంసంగ్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు ఎక్కువ కాలం ఇస్తుంది.

ప్రాసెసర్, పర్‌ఫామెన్స్

రెడ్‌మి నోట్ 15 ప్రో+ 5Gలో Snapdragon 7s Gen 4 చిప్‌సెట్ ఉంది. బ్యాలెన్స్‌డ్ పనితీరు, బ్యాటరీ ఎఫిషియెన్సీ ఇస్తుంది. పోకో F7 5Gలో Snapdragon 8s Gen 4 ఉంది. ఫ్లాగ్‌షిప్ లెవల్ గేమింగ్, మల్టీటాస్కింగ్ చేయగలదు. సామ్‌సంగ్ గెలాక్సీ A55లో Exynos 1480 ఉంది. రోజువారీ టాస్క్‌లు స్మూత్‌గా జరుగుతాయి కానీ హెవీ గేమింగ్‌లో వెనకబడుతుంది.

రియర్ కెమెరా సెటప్

రెడ్‌మి నోట్ 15 ప్రో+ 5Gలో 200MP మెయిన్ కెమెరా (OIS సపోర్ట్), 8MP అల్ట్రా-వైడ్ ఉన్నాయి. పోకో F7 5Gలో 50MP OIS ప్రైమరీ, 8MP అల్ట్రా-వైడ్ ఉన్నాయి. సామ్‌సంగ్ గెలాక్సీ A55లో ట్రిపుల్ కెమెరా: 50MP మెయిన్ (OIS), 12MP అల్ట్రా-వైడ్, 5MP మాక్రో ఉన్నాయి.

ఫ్రంట్ కెమెరా పోలిక

రెడ్‌మి నోట్ 15 ప్రో+ 5G, శాంసంగ్ గెలాక్సీ A55 రెండింటిలోనూ 32MP ఫ్రంట్ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ బాగుంటాయి. పోకో F7 5Gలో 20MP ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ, ఛార్జింగ్

రెడ్‌మి నోట్ 15 ప్రో+ 5G, పోకో F7 5G రెండింటిలోనూ 6,500mAh బ్యాటరీ ఉంది. రెడ్‌మి 100W ఫాస్ట్ ఛార్జింగ్, పోకో 90W సపోర్ట్ చేస్తాయి. శాంసంగ్ గెలాక్సీ A55లో 5,000mAh బ్యాటరీ, 25W ఛార్జింగ్ మాత్రమే ఉంది.

Also Read: ఎండాకాలంలో కరెంటు బిల్లు లేకుండా ఎసి..  ఎన్ని సోలార్ ప్యానెల్స్ అవసరమంటే

కనెక్టివిటీ ఫీర్లు

రెడ్‌మి నోట్ 15 ప్రో+ 5Gలో Wi-Fi, బ్లూటూత్, NFC, USB Type-C ఉన్నాయి. పోకో F7 5Gలో Wi-Fi 7, బ్లూటూత్ 6.0, GPS, NFC ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ A55లో బ్లూటూత్ 5.3, NFC, డ్యూయల్ సిమ్, USB Type-C ఉన్నాయి.

ఏది బెటర్?

మంచి పర్‌ఫామెన్స్, వ్యాల్యూ కోసం పోకో F7 5G బెస్ట్.
కెమెరా, ఛార్జింగ్ స్పీడ్ కోసం రెడ్‌మి నోట్ 15 ప్రో+ 5G మంచిది.
సాఫ్ట్‌వేర్ స్టెబిలిటీ, బ్రాండ్ రిలయబిలిటీ కోసం శాంసంగ్ గెలాక్సీ A55 ఎంచుకోండి.

Related News

కేవలం రూ.1000 లోపు ఖర్చుతో ఇంటిని సూపర్ కూల్‌గా మార్చే సీక్రెట్స్ ఇవే!

రంగంలోకి దిగిన గూగుల్.. ఫేక్ కాల్స్ భరతం పట్టడం ఖాయం, వినియోగదారులు ఫుల్‌ హ్యాపీ

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!

రూ.30వేలలోపు బెస్ట్ విండో ఏసీలు.. వీటితో ఎండలకు బైబై చెప్పేయండి!

బడ్జెట్ రేంజ్‌లో.. హల్‌చల్ చేస్తున్న హైసెన్స్ 100 ఇంచుల టీవీ..

ఆకట్టుకునే 6.3 ఇంచ్ స్క్రీన్, బెస్ట్ కెమెరాతో మోటోరోలా కొత్త ఫోన్..

ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. ఫ్రిజ్ రిపేర్ ఖర్చులు మిగిలినట్టే!

Big Stories

×