E-Paper
Advertisement

Crime News: ఆస్తి కోసం సొంత చెల్లిని అతి కిరాతకంగా చంపించిన అన్న

Crime News: ఆస్తి కోసం సొంత చెల్లిని అతి కిరాతకంగా చంపించిన అన్న
Advertisement

Crime News: ఆస్తి కొరకు సొంత చెల్లిని అన్న హత్య చేయించిన ఘటన మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. చేవెళ్ల నియోజకవర్గంలో మొయినాబాద్ మండలం కేతిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన మృతురాలు స్వప్న చేవెళ్ల కోర్ట్ లో న్యాయవాదిగా విధులు పనిచేస్తుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గత మూడు సంవత్సరాలుగా తన అన్న అయినా రాజుకు మృతురాలు స్వప్నకు మధ్య కుటుంబ గొడుగువాలు జరుగుతున్నాయి. బుధవారం ఉదయం తన పొలం వద్దకు వెళ్లి భూమి సర్వేర్ ని పిలిచి సర్వే చేయించి ఇంటికి వస్తుండగా నాలుగురు వ్యక్తులు కార్ లో నుంచి వచ్చి తనపై కర్ర లతో కత్తల తో దాడి చేసి హత్య చేశారు. స్థానికులు చూసి మండలంలో ఉన్న భాస్కర్ ఆసుపత్రి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.

Also Read: GHMC Elections 2026: జీహెచ్ఎంసీలో ఎన్నికల నగారా.. గుట్టుచప్పుడు కాకుండా సిద్ధమవుతున్న రాజకీయ పార్టీలు

పోలీస్ స్టేషన్ ముందు ధర్నా..

Advertisement

ఈ విషయం తెలుసుకున్న చేవెళ్ల కోర్ట్ న్యాయవాదులు ఆసుపత్రి వద్దకు చేరుకొని బీజాపూర్ రహదారిపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా కు దిగారు. గతం లోనే ఇప్పటికి రెండు సార్లు తన హత్య ప్రయత్నం చేసాడు అని ఇప్పటికే పోలీసులకు పిర్యాదు చేసాము. పోలీసుల నిర్లక్ష్యం కారణంగా ఈ రోజు నిండు ప్రాణం పోయిందాని, న్యాయ వాదులకే న్యాయం జరగపోతే సామాన్య ప్రజలకు ఏవిదంగా పోలీసులు న్యాయం చేస్తారనిమాట్లాడారు. సొంత అన్ననే సూపరి గ్యాంగ్ తో హత్య చేయించాడు. హత్య చేసిన వారిని చేయించిన వారిని వెంటనే అదుపులో తీసుకోవాలని, వారిని కఠినంగా శిక్షించాలన్నారు. చేవెళ్ల కోర్ట్ లో నిందుతుల తరుపున ఏ ఒక లాయర్ కూడా వాకలత్ తీసుకోమన్నారు. పోలీసులు కలుగ చేసుకొని మృతురాలు స్వప్న కు న్యాయం చేస్తామని న్యాయవాదులకు వివరించి మృతదేహని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి కి తరలించారు. ఈ విషయంపై స్థానిక పోలీసుల నుంచి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

నా కొడుకే హత్య చేయించాడు

మూడు సంవత్సరాల నుంచి కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. నా కొడుకు రాజు నే నా కూతురిని హత్య చేయించాడు. భూమి కొలత చేపిందామని వెళ్ళాము. భూమి కొలత అయినా వెంటనే నాలుగురు వచ్చి కట్టెలతో, కత్తులతో నాకూతురుపై దాడి చేశారని మృతురాలి తల్లి తెలిపింది.

Advertisement

Also Read: Gemstone: ఏ రాశి జాతకులకు ఏ స్టోన్ కలిసి వస్తుందో తెలుసా – జాతి రత్నాలు ఎలా ధరించాలంటే..?

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×