E-Paper
Advertisement

Redmi Turbo 5 Pro: చార్జింగ్ పెట్టక్కర్లేదు.. బ్యాటరీ అయిపోదు.. రెడ్‌మీ టర్బో 5 ప్రో షాకింగ్ లీక్స్

Redmi Turbo 5 Pro: చార్జింగ్ పెట్టక్కర్లేదు.. బ్యాటరీ అయిపోదు.. రెడ్‌మీ టర్బో 5 ప్రో షాకింగ్ లీక్స్
Advertisement

Redmi Turbo 5 Pro: రెడ్‌మీ నుంచి రాబోతున్న కొత్త టర్బో సిరీస్ ఫోన్‌ ఇప్పుడు టెక్ ప్రపంచంలో ఆసక్తిని పెంచుతోంది. తాజాగా బయటకు వచ్చిన సర్టిఫికేషన్ అప్‌డేట్స్ చూస్తే రెడ్‌మీ టర్బో 5 ప్రో ఫోన్‌ విడుదల చాలా దగ్గరలో ఉందనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. టర్బో సిరీస్ ఎప్పటినుంచో భారీ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, స్ట్రాంగ్ పర్‌ఫార్మెన్స్‌తో యూజర్లను ఆకట్టుకుంటోంది. అదే దారిలో టర్బో 5 ప్రో ఇంకా పెద్ద అప్‌గ్రేడ్‌లతో మార్కెట్‌లోకి రాబోతోంది. ఈ ఫోన్‌ ఎప్పుడు లాంచ్ అవుతుంది, ఇందులో ఏమేం ఫీచర్లు ఉంటాయి, ఇండియాలో దీని ధర ఎంత ఉండొచ్చు అనే విషయాలను ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.

డిస్‌ప్లే వివరాలు

Advertisement

రెడ్‌మీ టర్బో 5, టర్బో 5 ప్రో రెండూ 1.5K రిజల్యూషన్‌తో కూడిన ఎల్టీపీఎస్ ఫ్లాట్ డిస్‌ప్లేను కలిగి ఉండనున్నాయి. ఈ డిస్‌ప్లే రోజువారీ యూజ్‌తో పాటు వీడియోలు, గేమింగ్‌కు కూడా మంచి విజువల్ అనుభవాన్ని ఇవ్వగలదని చెబుతున్నారు. అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఉండే అవకాశం ఉంది. ఇది వేగంగా అన్‌లాక్ కావడంలో సహాయపడుతుంది.

బిల్డ్ క్వాలిటీ డిజైన్

Advertisement

ఈ టర్బో సిరీస్ ఫోన్‌లో మెటల్ మిడ్ ఫ్రేమ్ ఉపయోగించనున్నారు. దీని వల్ల ఫోన్ చేతిలో పట్టుకున్నప్పుడు ప్రీమియం ఫీల్ వస్తుంది. అలాగే ఐపీ68 లేదా ఐపీ69 లెవెల్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కూడా అందించే ఛాన్స్ ఉంది. అంటే నీటిలో పడిపోయినా, దుమ్ము ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లోనూ ఈ పోన్ సేఫ్‌గా ఉండే అవకాశం ఉంటుంది. సిమెట్రికల్ డ్యూయల్ స్పీకర్లు ఉండడం వల్ల ఆడియో అనుభవం కూడా బాగానే ఉండొచ్చని అంచనా.

ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్‌ఓఎస్ సాఫ్ట్‌వేర్

రెడ్‌మీ టర్బో 5 సిరీస్ ఫోన్‌లు ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్‌ఓఎస్ 3పై రన్ అవుతాయని సమాచారం. కొత్త హైపర్‌ఓఎస్ వెర్షన్‌తో ఇంటర్‌ఫేస్ మరింత స్మూత్‌గా, స్టేబుల్‌గా ఉండే అవకాశం ఉంది. రెడ్‌మీ యూజర్లు ఇష్టపడే కస్టమైజేషన్ ఫీచర్లు ఇందులో కొనసాగనున్నాయని చెబుతున్నారు.

9000mAh బ్యాటరీ

ఈ రెండు ఫోన్‌ల్లో దాదాపు 9000mAh బ్యాటరీ ఉండే అవకాశం ఉందని లీకులు చెబుతున్నాయి. ఇది నిజమైతే ఒకసారి ఛార్జ్ చేస్తే ఎక్కువసేపు బ్యాటరీ బ్యాక్‌అప్ ఇచ్చే అవకాశం ఉంటుంది. దీనికి తోడు 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండడం వల్ల తక్కువ టైమ్‌లోనే ఫోన్ పూర్తిగా ఛార్జ్ అయ్యే ఛాన్స్ ఉంది. బ్యాటరీ విషయంలో టర్బో సిరీస్ మరో లెవెల్‌కు వెళ్లబోతున్నట్టు కనిపిస్తోంది.

8500 చిప్‌సెట్

రెడ్‌మీ టర్బో 5లో మీడియాటెక్ డైమెన్సిటీ 8500 చిప్‌సెట్ ఉండే అవకాశం ఉంది. ఇది డైలీ యూజ్‌తో పాటు గేమింగ్‌కు కూడా మంచి పర్‌ఫార్మెన్స్ ఇస్తుందని చెబుతున్నారు. టర్బో 5 ప్రోలో అయితే ఇంకా పవర్‌ఫుల్‌గా ఉండే మీడియాటెక్ డైమెన్సిటీ 9 సిరీస్ ప్రాసెసర్ ఇవ్వబోతున్నారని సమాచారం. దీని వల్ల హై ఎండ్ యూజర్లను కూడా ఈ ఫోన్ ఆకట్టుకునే అవకాశం ఉంది.

Also Read: Upcoming Gaming Phones 2026: గేమర్స్‌కి పూనకాలే.. 2026లో గేమింగ్ బీస్ట్స్ ముందు పీసీలు కూడా వేస్ట్ మావా..

3C సర్టిఫికేషన్ అప్‌డేట్

రెడ్‌మీ టర్బో 5 ప్రో చైనాలో 3సి సర్టిఫికేషన్‌ను పూర్తి చేసింది. 2602బిఆర్‌టి18సి అనే మోడల్ నంబర్‌తో ఈ ఫోన్ లిస్ట్ అయింది. ఈ సర్టిఫికేషన్ ద్వారా ఒక విషయం మాత్రం ఖచ్చితంగా బయటపడింది, అదే 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. సాధారణంగా 3సి సర్టిఫికేషన్‌లో ఛార్జింగ్ డీటెయిల్స్ మాత్రమే బయటకు వస్తాయి. మిగతా స్పెసిఫికేషన్లు చెప్పకపోయినా, 100W ఛార్జింగ్ అనేది ఈ phoneలో పెద్ద హైలైట్‌గా మారబోతుందని అర్థమవుతోంది.

టర్బో 5 100W ఫాస్ట్ ఛార్జింగ్

ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే రెడ్‌మీ టర్బో 5 కూడా ఇదే 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తోనే రావడం. అంటే టర్బో 5, టర్బో 5 ప్రో రెండింటిలోనూ ఛార్జింగ్ విషయంలో ఎలాంటి తేడా పెట్టకుండా రెడ్‌మీ ఒకే లెవెల్ సపోర్ట్ ఇవ్వబోతోంది. ఇది టర్బో సిరీస్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చే అంశంగా చెప్పొచ్చు.

లాంచ్ టైమ్‌లైన్ వివరాలు

లీకుల ప్రకారం రెడ్‌మీ ఈ టర్బో సిరీస్ ఫోన్‌లను చైనాలో స్ప్రింగ్ ఫెస్టివల్‌కు ముందే విడుదల చేసే అవకాశం ఉంది. అంటే ఫిబ్రవరి మూడో వారంలో చైనా లాంచ్ ఉండొచ్చని అంచనా. చైనా లాంచ్ తర్వాత సాధారణంగా రెడ్‌మీ ఇండియా మార్కెట్‌కు ఈ ఫోన్‌లను తీసుకురావడానికి కొంత సమయం తీసుకుంటుంది. అందుకే ఇండియాలో రెడ్‌మీ టర్బో 5 ప్రో లాంచ్ ఏప్రిల్ లేదా మే నెలల్లో జరిగే అవకాశం ఉందని టెక్ వర్గాలు చెబుతున్నాయి.

ఇండియా ధర ఎంతంటే?

ధర విషయానికి వస్తే రెడ్‌మీ టర్బో 5 ప్రోను ఇండియాలో సుమారు 35,000 నుంచి 40,000 మధ్యలో లాంచ్ చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. టర్బో 5 మాత్రం దీనికంటే కొంచెం తక్కువ ధరలో అందుబాటులోకి రావచ్చు. ఈ ధరకు 100W ఛార్జింగ్, భారీ బ్యాటరీ, 1.5K డిస్‌ప్లే లాంటి ఫీచర్లు వస్తే రెడ్‌మీకి మంచి డిమాండ్ ఏర్పడే ఛాన్స్ ఉంది. రెడ్‌మీ టర్బో 5 ప్రో ఫోన్‌ టర్బో సిరీస్‌ను మరో స్థాయికి తీసుకెళ్లేలా కనిపిస్తోంది. లాంచ్ టైమ్ దగ్గర పడుతున్న కొద్దీ మరిన్ని అధికారిక అప్‌డేట్స్ వచ్చే అవకాశం ఉంది. ఇండియా మార్కెట్‌లో ఇది మిడ్ రేంజ్‌కు పైగా, ప్రీమియం సెగ్మెంట్‌లో రెడ్‌మీకి మంచి స్థానం తీసుకువచ్చే ఫోన్‌గా మారే ఛాన్స్ కనిపిస్తోంది.

Related News

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

Big Stories

Advertisement
×