E-Paper
Advertisement

Shoei Helmet: ఓ వైపు మంచు, మరోవైపు ఎండ.. రెండింటి నుంచి కాపాడే క్రేజీ హెల్మెట్!

Shoei Helmet:  ఓ వైపు మంచు, మరోవైపు ఎండ.. రెండింటి నుంచి కాపాడే క్రేజీ హెల్మెట్!
Advertisement

Shoei New Electronic Anti-Fog Sun Shield Helmet:  ప్రపంచ ప్రఖ్యాత హెల్మెట్ తయారీ కంపెనీ షూయి (Shoei) ఇటీవల ఒక కొత్త ఎలక్ట్రానిక్ విజర్ ఇన్సర్ట్‌ గురించి కీలక ప్రకటన చేసింది. దీని పేరు e:DRYLENS. ఇది మోటార్‌ సైకిల్ హెల్మెట్ల కోసం డిజైన్ చేసింది. ఇది యాంటీ ఫాగ్ అంటే హెల్మెట్ మీద మంచు ఏర్పడకుండా నివారిస్తుంది. అటు వేరియబుల్ సన్ ప్రొటెక్షన్ అంటే సూర్యరశ్మి నియంత్రణ ఫీచర్లను కలిగి ఉంది. ఇది సాధారణ పిన్‌ లాక్ ఇన్సర్ట్ ల మాదిరిగా పని చేస్తుంది. కానీ, ఎలక్ట్రానిక్ డిమ్మింగ్ సిస్టమ్‌ తో మరింత అడ్వాన్స్‌డ్ గా ఉంటుంది. డై నిప్పాన్ ప్రింటింగ్ (Dai Nippon Printing) సహకారంతో డెవలప్ చేసింది.

ఈ హెల్మెట్ ఎలా పని చేస్తుందంటే?

⦿ ఎలక్ట్రానిక్ డిమ్మింగ్: లిక్విడ్ క్రిస్టల్ ఫిల్మ్ ఉపయోగించి, సన్ షీల్డ్‌ను లైట్ నుంచి డార్క్ వరకు డిమ్ చేయవచ్చు. మాన్యువల్ స్విచ్ తో లేదంటే ఆటోమేటిక్ మోడ్‌లో సర్దుబాటు చేయవచ్చు. ఇది సూర్యరశ్మి బట్టి ఆటోమేటిక్‌గా మారుతుంది.

Advertisement

⦿ యాంటీ-ఫాగ్ ప్రొటెక్షన్: మంచు ఏర్పడకుండా నివారిస్తుంది. పిన్‌ లాక్ సిస్టమ్ మాదిరిగా పని చేస్తుంది. కానీ, ఎలక్ట్రానిక్ ఇంటిగ్రేషన్‌తో వస్తుంది.

⦿ ఇతర స్పెసిఫికేషన్లు: ఇది ఒక ఇన్సర్ట్. విజర్ లోపల అమర్చుతారు. హెల్మెట్ విజర్‌కు ఫిట్ అవుతుంది. లైట్ టు డార్క్ డిమ్మింగ్ రేంజ్ ఉంది. ఇది రైడింగ్ సమయంలో విజిబిలిటీని మెరుగుపరుస్తుంది.

Advertisement

కాంపాటిబిలిటీ  

ఈ ఎలక్ట్రానిక్ విజర్ ఇన్సర్ట్‌ Shoei CWR-F2, CWR-F2R షీల్డ్స్‌ తో ఫిట్ అవుతుంది. ఇవి Shoei  నిర్దిష్ట హెల్మెట్ మోడల్స్  GT-Air సిరీస్, ఇతర అడ్వాన్స్‌డ్ మోడల్స్ లో ఉపయోగించబడతాయి. ఇతర హెల్మెట్లు, పాత సిరీస్‌లకు ఉపయోగించలేము.

Read Also: ఇండియాలోకి అడుగు పెట్టిన ఫస్ట్ టెస్లా కారు, దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

బ్యాటరీ, ఛార్జింగ్

ఎలక్ట్రానిక్ విజర్ ఇన్సర్ట్‌  ఫుల్ ఛార్జ్‌ పై సుమారు 20 గంటలు పని చేస్తుంది. USB C పోర్ట్ ద్వారా ఛార్జ్ చేయవచ్చు. పూర్తి ఛార్జ్ కు సుమారు 3 గంటలు పడుతుంది. ఇంటిగ్రేటెడ్ బ్యాటరీ ఉంది.

ధర, అవైలబిలిటీ

ఎలక్ట్రానిక్ విజర్ ఇన్సర్ట్‌ ధర జపాన్‌లో ¥27,500 (సుమారు US$176.50)  భారత కరెన్సీలో సుమారు రూ. 16 వేలు ఉంటుంది.  ప్రస్తుతం జపాన్ మార్కెట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ప్రీ ఆర్డర్స్ జనవరి 9, 2026 నుంచి ప్రారంభమవుతాయి. యూరోప్, అమెరికా,ఇతర ఇంటర్నేషనల్ మార్కెట్లలో అవైలబిలిటీ గురించి ఇంకా ప్రకటన లేదు.

Read Also: పెళ్లి బరాత్ ల బ్రాండ్ షెవర్లెట్ ఇంపాలా.. వామ్మో ఈ కార్ల వెనుక ఇంత కథ ఉందా?

Related News

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

Big Stories

Advertisement
×