E-Paper
Advertisement

T BJP Leaders: లీకు వీరులపై మోడీ ఫైర్.. రామచంద్రరావుకి ఫుల్ పవర్స్

T BJP Leaders: లీకు వీరులపై మోడీ ఫైర్.. రామచంద్రరావుకి ఫుల్ పవర్స్

T BJP Leaders: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఢిల్లీ టూర్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది… పార్టీ అంతర్గత సమావేశాలకు సంబంధించి లీకులు.. నేతల మధ్య విభేదాలు.. క్రమశిక్షణ ఉల్లంఘనలు.. ఈ వ్యవహారాలన్నింటికీ ఫుల్‌స్టాప్ పెట్టేందుకే ఢిల్లీ పెద్దలతో రామచందర్రావు కీలక భేటీ జరిగిందన్న టాక్ వినిపిస్తోంది.. అంటే పార్టీ లైన్ క్రాస్ చేస్తున్న నేతలపై కఠిన చర్యలు తీసుకునే సర్వ అధికారాలు రామచంద్రరావుకే అధిష్టానం కట్టబెట్టిందా? రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఇక నుంచైనా పార్టీ గతి మారుస్తారా?

లీకు వీరులపై ఆగ్రహం వ్యక్తం చేసిన రామచంద్రరావు
తెలంగాణ బీజేపీలో లీకుల రాజకీయాలు అధిష్టానానికి తీవ్ర అసహనాన్ని కలిగిస్తున్నాయన్న టాక్ నడుస్తోంది. అందుకు ఢిల్లీ టూర్లో తెలంగాణ బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు లీక్ వీరులపై గరం గరం అవడం చర్చకు దారితీస్తుంది. తాజాగా ఢిల్లీలో ప్రధాని మోడీతో జరిగిన తెలుగు రాష్ట్రాల ఎంపీల సమావేశంలోని రహస్య అంశాలు బయటకు లీకు అవ్వడంపై పార్టీ పెద్దలు ఆగ్రహంతో ఉన్నట్టుగా సమాచారం. ఈ క్రమంలోనే రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు ఢీల్లీ టూర్లో అదిష్టానం నుంచి లీకుల సెగ తగిలినట్టుగా కనిపిస్తుందట. ఆ సెగలో భాగమే లీకులు ఇచ్చే నేతలకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారంట. పార్టీ లోపల మాటలు బయటికి వస్తే అది రాజకీయ ద్రోహం కాదు, పార్టీ ద్రోహమేనని, లీక్ చేస్తున్నది ఎవరో తెలుసు.. కానీ అదును కోసం అధిష్టానం ఎదురుచూస్తుందని రామంచంద్రరావు అన్న మాటలు కమలం పార్టీలో వైబ్రేషన్స్ సృష్టిస్తున్నాయట

ఆర్గానిక్, అన్ ఆర్గానిక్ అని క్లాస్ పీకిన సంతోష్
లీకుల పంచాయితీ అటుంచితే ఆర్గానిక్, అన్ ఆర్గానిక్ నేతలంటూ ఇప్పటికే బీఎల్ సంతోష్ రాష్ట్ర నేతలకు క్లాస్ పీకారు., తర్వాత ప్రధాని మోడీ వారికి గట్టిగానే ట్రీట్‌మెంట్ ఇచ్చారు. అయినా గ్రామపంచాయతీ ఎన్నికల తర్వాత మళ్లీ నేతల మధ్య విభేదాలు బహిర్గతం కావడం అధిష్టానానికి చిర్రెత్తించిందన్న టాక్ వినిపిస్తోంది. కరీంనగర్‌లో బండి సంజయ్, ఈటల వర్గాల మధ్య మాటల యుద్ధం, ఫండింగ్ ఆరోపణలు, ఓటములపై ఒకరికొకరు దుమ్మెత్తిపోసుకునే రాజకీయాలు పార్టీకి డ్యామేజ్ చేస్తున్నాయని రాష్ట్ర నాయకత్వం కూడా గుర్రుగా ఉందంట. ఈ నేపధ్యంలోనే నేతలు లైన్ క్రాస్ చేస్తే చర్యలు తప్పవు.. నేతలపై చర్యలకు రాష్ట్ర అధ్యక్షుడికి పూర్తి అధికారం ఇచ్చారన్న సంకేతాలు ఢిల్లీ నుంచి పంపుతున్నారట.

రామచంద్రరావు ఢిల్లీ టూర్ నేతలు వ్యవహారాన్ని సెట్ చేసేందుకేనా?
లైన్ క్రాస్ చేస్తే నేతలపై వేటు వేసేందుకు రామచంద్రరావుకు డిల్లీ పెద్దలు సర్వ అధికారాలు ఇచ్చారా లేదా అన్నది అటుంచితే….బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఢిల్లీ టూర్ నేతల వ్యవహారాన్ని సెట్ చేసేందుకేనా?.. హస్తినాకు వెళ్ళి లీకు వీరులు కొందరు వీక్ కాక తప్పదని వార్నింగ్ లు ఎందుకిచ్చినట్టు..? వకీల్ సాబ్ ఆగ్రహానికి కారణం ఎవరు?..అనే చర్చ పార్టీలో నడుస్తుందట. పార్టీ క్రమశిక్షణ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండని నేతలెవరు.. ఇక నుంచి లైన్ క్రాస్ చేస్తే అలాంటి నేతల విషయంలో ఎలా వ్యవహారించాలన్న దానిపై ఢిల్లీ పెద్దలు సూచనలు చేశారన్నది పార్టీ నేతల్లో గుబులు రేపుతోందంట.. ఈ నేపథ్యంలోనే ఇంతకు మోడీతో జరిగిన ఎంపీల సమావేశం యొక్క అంశాలను లీకులిచ్చిన ఎంపీలెవరు..? ఆర్గానిక్ ఎంపీలా..? ఆన్ ఆర్గానిక్ ఎంపీలా..? ఎంపీల మధ్య సఖ్యత లేకపోవడమే లీకులకు కారణమా..? అన్న అంశాలపై చర్చ జరిగిందంట. లీకులే కాదు, సర్పంచ్ ల ఎన్నికల్లో కొందరు నేతలు చేసిన రచ్చపై సైతం, పెద్దలు ఆ నేతలకు గట్టిగానే అక్షింతలు వేశారని, ఇకపై మళ్ళీ అట్లాంటి పంచాయితీలు ఎవరి మధ్య రిపీట్ అయినా ట్రీట్ మెంట్ చేసే అధికారం రామచంద్రరావుకు ఇచ్చేశారా. ? అన్న బిలియన్ డాలర్ల ప్రశ్నలు ఆయన ఢిల్లీ టూర్‌తో ఉత్పన్నమవుతున్నాయి.

మోడీ స్ట్రోక్‌తో సైలెంట్ అయిపోయిన కొందరు ఎంపీలు
మోడీ ఇచ్చిన స్ట్రోక్ తో కొంతమంది తెలంగాణ ఎంపీల ఫ్రస్టేషన్తో సైలెంట్ మోడ్ లోకి వెళ్లినట్టుగా తెలుస్తోంది.. బీఎల్ సంతోష్, ప్రధాని మోడా ఇచ్చిన ఝలక్‌లతో పాటు, తాజాగా రామచంద్రరావు డేంజర్ డైలాగ్స్‌తో బీజేపీ నేతల తమ ఫ్రస్టేషన్ అంతా ప్రజా పాలన మీద చూయిస్తున్నరన్న విమర్శలు కాంగ్రెస్ నుంచి వినిపిస్తున్నాయి. ఢిల్లీ వేదికగా లీకులపై రామ చంద్రరావు గట్టిగానే మాట్లాడారంటే సినిమా తారా స్థాయిలో నడుస్తోందన్న టాక్ నడుస్తోంది. కొందరు ఎంపీలు లీకులు ఇవ్వడమే కాదు, పార్టీ లైన్ క్రాస్ చేస్తూ నోరు పారేసుకుంటున్నారు. పార్టీ లైన్లో కాకుండా తమ వ్యక్తిగత పంచాయితీలతో అటు అధికార, ఇటు ప్రతిపక్ష పార్టీలపై నోరు పారేసుకోవడం పార్టీకి మైనస్ అవుతుందన్న చర్చ కమలం పార్టీ వర్గాల్లో జరుగుతుంది.

Also Read: ఉదయగిరి టీడీపీలో ముసలం

నేతల తీరుపై ఎప్పటికప్పుడు డిల్లీ పెద్దలకు సమాచారం
ఇట్లాంటి పరిస్థితుల్లో రామచంద్ర ఢిల్లీ పెద్దలను కలవడం చర్చనీయాంశంగా మారుతుంది. ఇప్పటికే నేతలు వ్యవహరిస్తున్న తీరుపై ఎప్పటికప్పుడు డేటా అధిష్టానం చేతికి వెళ్ళిందన్న చర్చ ఉన్న నేపద్యంలో అధిష్టానం పెద్దలు రామచంద్రరావుతో ప్రధానంగా నేతల వ్యవహారంపై ఆరా తీసినట్టుగా సమాచారం. ఆ క్రమంలో నేతలకు ఫైనల్ టచ్ ఇచ్చేందుకు నూతన ఏడాదిలో నూతనంగా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన నితిన్ నబీన్ సిన్హా తో రాష్ట్ర కార్యశాల నిర్వహించాలని రాష్ట్ర నాయకత్వం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర కార్యశాల అనంతరం ముఖ్య నేతలతో ఫైనల్ ట్రీట్ మెంట్‌కు సంబంధించిన సమావేశం ఉంటుందన్న చర్చ జరుగుతుంది. ఒకవేళ అదే జరిగితే నితిన్ నబీన్ సిన్హా ఇచ్చే ట్రీట్మెంట్ తో అయినా రాష్ట్ర నేతలు గాడిలో పడతారా..? లేక అదే ధోరణిలో నడుస్తారా అన్నది చూడాలి.

Story By Vamshi Krishna, Bigtv

Related News

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

టేబుల్ మీద చర్చలు.. సరిహద్దుల్లో దాడులు.. అమెరికా, ఇరాన్ మధ్య అసలేం జరుగుతోంది?

Big Stories

×