E-Paper
Advertisement

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?
Advertisement

Construction Waste: ఫైనాన్షియల్ ఐటీ కారిడార్ అంటే ఆకాశాన్ని తాకే భవనాలు ఐటీ కంపెనీలు రద్దీగా ఉండే రోడ్లు. కానీ ఇప్పుడు సీన్ మారింది. ప్రస్తుతం ఇక్కడ బిల్డింగ్స్‌నే తలదన్నేలా నిర్మాణ వ్యర్థాలు గుట్టల్లా పేరుకుపోయాయి. ఇందుకు కారణం బిల్డర్లు. రాత్రికి రాత్రే గుట్టుచప్పుడు కాకుండా ప్రభుత్వ భూముల్లో టన్నుల కొద్దీ వ్యర్థాలను పారబోస్తున్నారు.

నిర్మాణ వ్యర్థాలు..

సాధారణంగా 200 గజాల స్థలంలో మూడంతస్తుల భవనం నిర్మిస్తే కనీసం 100 టన్నుల నిర్మాణ వ్యర్థాలు వెలువడుతాయి. వీటిలో రాళ్లు, ఇటుక, మట్టి, ఇసుకతో పాటు కాంక్రీట్, ఫ్లైవుడ్, ప్లాస్టిక్ ఉంటాయి. లెక్కప్రకారమైతే వీటి తరలింపునకు నిర్మాణదారులు నగరపాలక సంస్థలకు దరఖాస్తు చేసుకోవాలి. కానీ ఎక్కువ మంది అలా కాకుండా ప్రభుత్వ స్థలాల్లో పారబోస్తున్నారు.

Advertisement

Also read: Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

100 నుంచి 150 కోట్లు..

గచ్చిబౌలిలోని సర్వే నెంబర్-44లో 10ఎకరాలు, కొండాపూర్‌లోని సర్వే నెంబర్-59లో 30 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. వీటిపై ప్రైవేటు పట్టాదారులు, ప్రభుత్వం మధ్య వివాదం నడుస్తుంది. ఫలితంగా భూములపై పర్యవేక్షణ లేకుండా పోయింది. ఇదే అవకాశంగా నిర్మాణదారులు 30 లక్షల టన్నుల వ్యర్థాలను డంప్ చేశారు. వాస్తవానికి టన్నుకు 500రూపాయలు చెల్లించి రాంకీ లేదా SSR సంస్థల ద్వారా తరలించాల్సి ఉన్నా అలా చేయడం లేదు. దాంతో తప్పదు అన్నట్టుగా ఇప్పుడు వీటిని క్లియర్ చేయాలంటే ప్రభుత్వానికి 100 నుంచి 150 కోట్ల రూపాయల్ని ఖర్చు చేయాలి.

ఊపిరాడక నరకం..

Advertisement

ఈ వ్యర్థాలతో ప్రమాదం ఉందని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. భారీ వర్షాలు కురిస్తే ఈ మట్టి, కెమికల్స్ బురదగా మారి సెల్లార్లలోకి వెళ్లే ప్రమాదం ఉందటున్నారు. మరోవైపు ఖానామెట్, తమ్మిడికుంట పరిసరాల్లోని వ్యర్థాలకు నిప్పుపెట్టడంతో స్థానికులు ఊపిరాడక నరకం చూస్తున్నారు. దీంతో వ్యర్థాల తరలింపునకు ప్రభుత్వం బిడ్లను ఆహ్వానించింది. ఇకపై వ్యర్థాలు పారబోస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. తప్పు జరిగింది సరే.. ఇంతకీ దీనంతటికి బాధ్యులెవరో తేల్చరా..వారిపై చర్యలు తీసుకోరా?

Storey By:Appa Rao big Tv

Also read: స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Related News

కమ్మని కబుర్లు వెనుక కన్నింగ్ ప్లాన్.. వీల్లని నమ్మితే మీ పని అయిపోయినట్టే?

ఒకే దెబ్బకు రెండు నిర్ణయాలు.. సురేఖ వ్యవహారంతో పాటు కేబినెట్ మార్పులపై రచ్చ!

తెలంగాణలో పొల్యూషన్ డేంజర్ బెల్స్.. ప్రాణాలు కాపాడే మందుల వెనుక పల్లెల వినాశనం!

కొత్త పార్టీ ప్రకటనతో విజయసాయి రెడ్డి బిగ్ ప్లాన్.. జగన్‌కు చెక్ పడినట్టేనా..!

పవన్ బర్త్‌డే వేళ సంచలన నిర్ణయం.. జనసేనలో యువజన విభాగం ఏర్పాటుకు రంగం సిద్ధం!

347 కోట్ల మంది మ‌హిళ‌లు.. ఆర్టీసీలో ఫ్రీ ప్ర‌యాణం! రూ. 12,167 కోట్ల మేర ఆ కుటుంబాల‌కు ఆదా..!

వెయ్యి రోజులుగా కేసీఆర్ మేధోమ‌థ‌నం….కొంగొత్త ప‌థ‌కాల‌కు రూప‌క‌ల్ప‌న‌..! బీఆరెస్ స‌మ‌ర్థింపు ప్ర‌క‌ట‌న‌లు…

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు బిగ్ అలర్ట్.. ఉచిత రిజిస్ట్రేషన్లతో పేదలకు అపార్ట్‌మెంట్లు!

Big Stories

Advertisement
×