E-Paper
Advertisement

ఎండల ధాటికి పేలుతున్న ఫ్రిడ్జ్‌లు.. ఈ సౌండ్స్ వస్తే జాగ్రత్త, లేదంటే బ్లాస్టే!

ఎండల ధాటికి పేలుతున్న ఫ్రిడ్జ్‌లు.. ఈ సౌండ్స్ వస్తే జాగ్రత్త, లేదంటే బ్లాస్టే!
Advertisement

Refrigerator Lifespan: సీజన్‌తో సంబంధం లేకుండా వంటింట్లో నిత్యం ఆన్‌లో ఉండే వస్తువు ఏదైనా ఉందంటే అది రిఫ్రిజిరేటరే. ఇది గనుక ఇంట్లో లేకపోతే రోజూ కూరగాయల కోసం మార్కెట్‌కు పరిగెత్తాలి. ముఖ్యంగా ఎండకాలంలో చల్లటి నీళ్లు తాగాలన్నా కష్టమే. అయితే, ఎంతో ఉపయోగపడే ఈ ఫ్రిడ్జ్ ఎన్నాళ్లు మన్నుతుంది? అది ఎప్పుడు పాడైపోతుందో ముందే తెలుసుకోవడం ఎలా? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం పదండి..

ఫ్రిడ్జ్ సగటు జీవితకాలం:

సాధారణంగా ఒక మంచి ఫ్రిడ్జ్ సగటున 12 ఏళ్ల పాటు పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. కానీ అన్ని ఫ్రిడ్జ్‌లు ఒకేలా ఉండవు. కొన్ని కంపెనీల మోడల్స్ 20 ఏళ్ల వరకు కూడా అద్భుతంగా పనిచేస్తే.. మరికొన్ని మాత్రం ఐదారేళ్లకే మొరాయిస్తుంటాయి. మనం వాడే విధానం, ఆ బ్రాండ్ క్వాలిటీపైనే దీని జీవితకాలం ఆధారపడి ఉంటుంది. విచిత్రమేంటంటే.. ఎక్కువ ఫీచర్లు ఉండే ఖరీదైన స్మార్ట్ ఫ్రిడ్జ్‌లు.. మామూలు ఫ్రిడ్జ్‌ల కంటే త్వరగా పాడయ్యే అవకాశం ఉంది. వాటిలో ఉండే వాటర్ డిస్పెన్సర్లు, ఐస్ మేకర్ల వంటి ఆధునిక టెక్నాలజీ వల్ల త్వరగా రిపేర్లు వస్తుంటాయి.

ఎక్కువ కాలం మన్నాలంటే..

Advertisement

ఖరీదైన ఫ్రిడ్జ్ కొంటేనే ఎక్కువ కాలం వస్తుందనే నమ్మకం లేదు. మన బడ్జెట్‌కు తగ్గట్టుగా, మంచి రివ్యూలు ఉన్న నమ్మకమైన బ్రాండ్‌ను ఎంచుకోవడమే ముఖ్యం. కొన్న తర్వాత దాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత. వారానికోసారి ఫ్రిడ్జ్ లోపల శుభ్రం చేయాలి. లేదంటే ఆహార పదార్థాల మరకలు డోర్ రబ్బర్లకు అంటుకుని, లోపలి చల్లదనం బయటకు పోతుంది. దీనివల్ల కరెంట్ బిల్లు పెరగడమే కాకుండా కంప్రెషర్ త్వరగా పాడవుతుంది. అలాగే ఏడాదికి రెండు సార్లు ఫ్రిడ్జ్ వెనుక లేదా కింద ఉండే కండెన్సర్ కాయిల్స్‌ను దుమ్ము లేకుండా క్లీన్ చేసుకోవాలి.

ఉంచే స్థలం కూడా ముఖ్యమే:

ఫ్రిడ్జ్‌ను ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. దానికి నేరుగా ఎండ తగిలేలా లేదా పొయ్యి పక్కన వేడి తగిలేలా ఉంచకూడదు. ఫ్రిడ్జ్ చుట్టూ గాలి ఆడటానికి తగినంత ఖాళీ స్థలం ఉండాలి. దానిపై బరువైన వస్తువులను పెట్టకూడదు. అన్నిటికంటే ముఖ్యంగా.. లోపల పట్టనంతగా వస్తువులను కుక్కి కుక్కి పెట్టకూడదు.

Advertisement

Also Read: అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ సొంత ఫోన్ చూశారా? లుక్ అదిరింది కానీ, అంతలోనే ఊహించని వివాదం!

పాడైపోతోందని చెప్పే సంకేతాలు:

ఫ్రిడ్జ్ పూర్తిగా ఆగిపోయే ముందు కొన్ని సంకేతాలను ఇస్తుంది. సాధారణంగా ఫ్రిడకజ్ ఆన్‌లో ఉన్నప్పుడు హమ్మింగ్ శబ్దం వస్తుంది. కానీ అలా కాకుండా వింత వింతగా కిర్రుమనే శబ్దాలు లేదా పెద్దగా ఘటఘటమనే శబ్దాలు వస్తుంటే లోపల ఏదో సమస్య ఉందని అర్థం. అలాగే ఫ్రిడ్జ్‌లో పెట్టిన వస్తువులు త్వరగా చల్లబడకపోవడం, పాలు, కూరగాయలు త్వరగా పాడైపోతుండటం కూడా అది పాడైపోయిందనడానికి గుర్తు.

వేడి ఎక్కువగా వస్తుందా?

ఫ్రిడ్జ్ వెనుక భాగం కొద్దిగా వెచ్చగా ఉండటం సహజమే. కానీ ముట్టుకోలేనంత వేడిగా మారుతుంటే మాత్రం ప్రమాదమే. కండెన్సర్ కాయిల్స్ నిండిపోవడం వల్ల లేదా కంప్రెషర్ పాడవడం వల్ల ఇలా జరుగుతుంది. కంప్రెషర్ మార్చడానికి వేలల్లో ఖర్చవుతుంది కాబట్టి.. అంత ఖర్చు పెట్టే కంటే కొత్త ఫ్రిడ్జ్ కొనుక్కోవడమే లాభదాయకమని నిపుణులు సూచిస్తున్నారు. ముందే ఇలాంటి మార్పులను గమనించి జాగ్రత్తపడితే అనవసర ఖర్చులను తప్పించుకోవచ్చు.

Also Read: సింగిల్ ఛార్జ్‌తో రెండ్రోజులు నాన్‌స్టాఫ్ మ్యూజిక్.. Moto Buds 2 ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే!

Related News

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్.. సూపర్ ఏఐ ఫీచర్స్ రియల్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్

జియో క్యూ1 రిజల్ట్స్.. భారీగా పెరిగిన లాభాలు.. రికార్డు స్థాయిలో కస్టమర్లు!

బిగ్ బ్యాటరీ, క్రేజీ AI ఫీచర్లతో రంగంలోకి దిగనున్న iQOO Z11 Lite 5G.. రేటు కూడా బడ్జెట్‌లోనే!

Big Stories

Advertisement
×