E-Paper
Advertisement

పూరి జగన్నాథ్ ‘స్లమ్‌డాగ్’ ఊసేది?.. డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చేస్తుందా?

పూరి జగన్నాథ్ ‘స్లమ్‌డాగ్’ ఊసేది?.. డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చేస్తుందా?
Advertisement

Slumdog Movie: పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘స్లమ్‌డాగ్’ (Slumdog) గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో, ఫిలిం నగర్ సర్కిల్స్‌లో ఒకటే చర్చ నడుస్తోంది. సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఉన్న బజ్, ఆ తర్వాత పూర్తిగా తగ్గిపోవడం.. అసలు ఈ సినిమా థియేటర్లలోకి వస్తుందా? లేక ఓటీటీ బాట పడుతుందా? అనే సందేహాలు అభిమానుల్లో వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, లోగుట్టు ఇక్కడ చూద్దాం.

Read also-సెన్సార్ పూర్తి చేసుకున్న రామ్ చరణ్ ‘పెద్ది’.. ఈ డిటైల్స్ చూస్తే ఫ్యాన్స్‌కు పూనకాలే..

మేకర్స్ ప్లాన్..

Advertisement

సాధారణంగా పూరి జగన్నాథ్ సినిమా అంటే షూటింగ్ మొదలైనప్పటి నుంచే ఏదో ఒక హడావుడి ఉంటుంది. కానీ “స్లమ్‌డాగ్” విషయంలో మాత్రం చిత్ర యూనిట్ పూర్తిగా సైలెంట్‌గా ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఎలాంటి అప్‌డేట్స్, సాంగ్స్, లేదా గ్లింప్స్ రాకపోవడానికి వెనుక ఒక బలమైన బిజినెస్ స్ట్రాటజీ ఉందని ఇన్సైడ్ టాక్. నిర్మాతలు ముందుగా ఈ సినిమాకు సంబంధించిన పూర్తి బిజినెస్ (థియేట్రికల్, శాటిలైట్, డిజిటల్ రైట్స్) ముగించుకోవాలని చూస్తున్నారు. వ్యాపారం క్లియర్ అయ్యాక, ఒక పక్కా ప్లాన్ ప్రకారం ఒకదాని తర్వాత ఒకటిగా సాంగ్స్, టీజర్, గ్లింప్స్ రిలీజ్ చేసి, ఒక్కసారిగా హైప్ పెంచాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకే ప్రస్తుతానికి ‘నో బజ్.. నో న్యూస్’ అనే వ్యూహాన్ని ఫాలో అవుతున్నారు.

ఓటీటీ ప్రయత్నాలు..

ఈ సినిమా నేరుగా ఓటీటీ లో రిలీజ్ కాబోతుందనే ప్రచారం కూడా గట్టిగానే సాగింది. చిత్ర బృందం కొన్ని ప్రముఖ ఓటీటీ సంస్థలతో చర్చలు జరిపిన మాట వాస్తవమే. అయితే, అక్కడ డీల్ ఇంకా ఫైనలైజ్ కాకపోవడానికి ప్రధాన కారణం ఆశించిన రేటు రాకపోవడమే అని తెలుస్తోంది. పూరి జగన్నాథ్ గత చిత్రం ఆశించిన విజయం సాధించకపోవడంతో, ఓటీటీ సంస్థలు మేకర్స్ అడిగిన భారీ బడ్జెట్‌కు వెనుకాడుతున్నట్లు సమాచారం. అందుకే ఓటీటీ ప్రయత్నాల నుండి ఇంకా ఎలాంటి అధికారిక స్పందన లేదా క్లారిటీ రాలేదు.

Advertisement

Read also-ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు బ్లాక్ బాస్టర్ న్యూస్.. ఒక రోజు ముందే ‘NTRNeel’ గ్లింప్స్.. టైం ఎప్పుడంటే?

రిలీజ్ ఎప్పుడంటే?

ప్రస్తుతానికి బిజినెస్ చర్చలు తుది దశకు చేరుకున్నట్లు వినికిడి. వన్స్ బిజినెస్ లాక్ అవ్వగానే, ప్రమోషన్స్ హోరెత్తించి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే, ఈ ఏడాది ద్వితీయార్థంలో సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. “స్లమ్‌డాగ్” సినిమా ఆగిపోలేదు.. కేవలం సరైన బిజినెస్ డీల్ కోసం వేచి చూస్తోంది. పూరి జగన్నాథ్ మార్క్ మాస్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా ఉంటుందని, సరైన సమయం చూసి ప్రమోషన్స్ మొదలుపెడతారని టాలీవుడ్ వర్గాల సమాచారం. కాబట్టి అభిమానులు కంగారు పడకుండా, అఫీషియల్ అప్‌డేట్ వచ్చే వరకు కాస్త ఓపిక పట్టాల్సిందే!

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×