E-Paper
Advertisement

Tim David: మ‌రోసారి రూల్స్ బ్రేక్ చేసిన టిమ్ డేవిడ్…కుంభ‌క‌ర్ణుడిలా నిద్ర‌పోతూ ఫీల్డింగ్

Tim David: మ‌రోసారి రూల్స్ బ్రేక్ చేసిన టిమ్ డేవిడ్…కుంభ‌క‌ర్ణుడిలా నిద్ర‌పోతూ ఫీల్డింగ్
Advertisement

Tim David:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో (Indian Premier League 2026 Tournament) భాగంగా నిన్న పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Punjab Kings vs Royal Challengers Bengaluru) మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ప్లే ఆఫ్స్ లోకి పంజాబ్ కింగ్స్ దూసుకు వెళ్ళింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా బెంగళూరు ఆటగాడు టిమ్ డేవిడ్ (Tim David) చేసిన పని వివాదంగా మారింది. లైవ్ మ్యాచ్ జరుగుతుండగానే కుంభకర్ణుని లాగా బౌండరీ గేటు దగ్గర టిమ్ డేవిడ్ పడుకున్నాడు. బంతి వేస్తున్నప్పటికీ కూడా లేవలేదు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. దీంతో టిమ్ డేవిడ్ పై యాక్షన్ తీసుకుంటుంది సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Also Read: బంగ్లాదేశ్ ప్లేయ‌ర్ల‌కు ఫీల్డింగ్ నేర్పిస్తోన్న రిజ్వాన్‌…కీపింగ్ చేత‌కానోడు ట్రైనింగ్ ఇవ్వ‌డం ఏంటి అంటూ ట్రోల్స్‌

మ‌రోసారి రూల్స్ బ్రేక్ చేసిన టిమ్ డేవిడ్…

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో గెలిచిన బెంగళూరు ప్లే ఆఫ్స్ లోకి దూసుకు వెళ్ళింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తున్న టిమ్ డేవిడ్… బౌండరీ గేటు దగ్గర పడుకున్నాడు. బౌలర్ బంతులు సంధిస్తున్నప్పటికీ మ్యాచ్ సీరియస్ గా తీసుకోకుండా… కుంభకర్ణుడి లాగా పడుకున్నాడు. ఆ తర్వాత నెమ్మదిగా లేచాడు. ఈ వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన పంజాబ్ కింగ్స్ అభిమానులు చాలా సీరియస్ అవుతున్నారు. పంజాబ్ కింగ్స్ కు అదనంగా 5 పరుగులు రావాల్సి ఉందని.. ఆ పరుగులే అదనంగా వస్తే మ్యాచ్ స్వరూపం మారిపోయేదని అంటున్నారు. కానీ అంపైర్లు అమ్ముడుపోయి, పంజాబ్ కింగ్స్ కు అన్యాయం చేశారని ఫైర్ అవుతున్నారు.

టిమ్ డేవిడ్ నిజంగానే రూల్స్ బ్రేక్ చేశాడా ?

ఐసీసీ రూల్స్ ప్రకారం మ్యాచ్ జరుగుతుండగా ఒక ఫీల్డర్ పడుకోవడం అనేది నేరమే. ఇది మ్యాచ్ ఎక్కువ తీవ్ర అంతరాయం కలిగించే అంశంగా పరిగణిస్తారు. దీన్నే ఫేక్ ఫీల్డింగ్ అని కూడా అంటారు. ఫేక్ ఫీల్డింగ్ లా 41.5 ప్రకారం, కావాలనే ఒక ఫీల్డర్ పడుకుంటే… దాన్ని డెడ్ బాల్ గా ప్రకటించాలి. అలాగే బ్యాటింగ్ జట్టుకు ఐదు పరుగుల పెనాల్టీ ఏమైంది పరుగులు కేటాయించాల్సి ఉంటుంది. అంటే ఓవరాల్ గా ఫీల్డింగ్ జట్టుకు పెద్ద నష్టం వాటిల్లుతుంది. అంటే టీమ్ డేవిడ్ చేసింది కూడా నేరంగా పరిగణించవచ్చు. అయితే పంజాబ్ కింగ్స్ జట్టు సభ్యులు గానీ, అంపైర్లు గాని ఈ అంశాన్ని గమనించకపోవడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లాభపడింది. దీని వీడియో మ్యాచ్ పూర్తయిన తర్వాత వైరల్ అయిన నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ అభిమానులు సీరియస్ అవుతున్నారు.

Advertisement

 

Also Read: Tanveer Ahmed: ఫాతిమా సనా లాగా 15 బంతుల్లో కోహ్లీ 50 ప‌రుగులు చేస్తే, న‌*గ్నంగా తిరుగుతా !Indian Premier League 2026 Tournament

 

Related News

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

Big Stories

Advertisement
×