E-Paper
Advertisement

స్మార్ట్‌ఫోన్ రీస్టార్ట్ చేయాలా? పవర్ ఆఫ్ చేయాలా? అసలు రెండింటికీ తేడా ఏంటి?

స్మార్ట్‌ఫోన్ రీస్టార్ట్ చేయాలా? పవర్ ఆఫ్ చేయాలా? అసలు రెండింటికీ తేడా ఏంటి?
Advertisement

Restart vs Power Off: ప్రస్తుత స్మార్ట్ ఫోన్ యుగంలో నిద్ర లేచిన దగ్గర నుంచి తిరిగి పడుకునేవారకూ ప్రతీ నిమిషం మెుబైల్ చేతిలో ఉండాల్సిందే. ఫోన్ మాట్లాడటానికి, రీల్స్ చూడటానికి, వినోదానికి మెుబైల్స్ కేరాఫ్ గా మారిపోయాయి. అయితే చాలా మంది మెుబైల్ యూజర్లను ఓ సందేహం ఎల్లప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. ఫోన్ లోని ‘రీస్టార్’, ‘పవర్ ఆఫ్’ మధ్య తేడా ఏంటో చాలా మందికి అర్థంకాక కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఈ నేపథ్యంలో రెండింటికి మధ్య తేడా ఏంటి? ఏ ఫీచర్ ఎలా పని చేస్తుంది? వంటి వివరాలను ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

‘రీస్టార్ట్’ అంటే ఏంటి?

మెుబైల్ ను రీస్టార్ట్ లేదా రీబూట్ చేసినప్పుడు ఫోన్ పూర్తిగా ఆగిపోదు. కేవలం ఆపరేటింగ్ సిస్టమ్ మాత్రమే క్లోజ్ అయి మళ్లీ మొదటి నుండి ఓపెన్ అవుతుంది. ఫోన్ అప్పుడప్పుడు హ్యాంగ్ అవుతున్నా, యాప్స్ సరిగ్గా ఓపెన్ కాకపోయినా రీస్టార్ట్ చేయడం బెస్ట్ అని నిపుణులు సూచిస్తున్నారు. ఇది ర్యామ్ (RAM) లోని టెంపరరీ స్టోరేజ్ ను క్లియర్ చేసి ఫోన్ స్పీడ్‌ను పెంచుతుందని తెలియజేస్తున్నారు.

మరి ‘పవర్ ఆఫ్’ సంగతేంటి?

Advertisement

రీస్టార్ట్ కు బదులు మెుబైల్ లో పవర్ ఆఫ్ ఫీచర్ ను క్లిక్ చేస్తే.. ఫోన్ లోని హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ మొత్తం పూర్తిగా ఆగిపోతాయి. ఫోన్‌లో ఎలాంటి పవర్ యాక్టివిటీ జరగదు. ఫోన్ తో కొన్ని గంటల పాటు అవసరం లేదని భావించినప్పుడు పవర్ ఆఫ్ ఫీచర్ ను ఉపయోగించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. రాత్రిళ్లు నిద్రిస్తున్న సమయంలో ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే మంచిదని స్పష్టం చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఫోన్ లోపలి భాగాలకు పూర్తి విశ్రాంతి లభిస్తుందని తెలియజేస్తున్నారు.

Also Read: చార్జర్‌ను ఎప్పుడూ ప్లగ్‌లోనే ఉంచుతున్నారా? కొంపలు అంటుకుంటాయ్ భయ్యా!

దేని ప్రాధాన్యత ఎంత?

Advertisement

నిజానికి స్మార్ట్‌ఫోన్లకు రీస్టార్ట్, పవర్ ఆఫ్.. రెండూ అవసరమే. కానీ పరిస్థితులను బట్టి వాటి ప్రాధాన్యతలు మారుతూ ఉంటాయి. మీ ఫోన్ సాఫీగా సాగాలంటే వారానికి కనీసం ఒక్కసారైనా రీస్టార్ట్ చేయడం అలవాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల బ్యాక్‌గ్రౌండ్‌లో పేరుకుపోయిన అనవసర క్యాచీ ఫైల్స్ తొలగిపోతాయని పేర్కొంటున్నారు. స్విచ్ ఆఫ్ విషయానికి వస్తే.. నెలకు ఒకసారి అయినా చేయాలని తెలియజేస్తున్నారు. నెలకు ఒకటి లేదా రెండుసార్లు ఫోన్‌ను పూర్తిగా పవర్ ఆఫ్ చేసి.. ఒక 10 నిమిషాల తర్వాత ఆన్ చేయడం వల్ల బ్యాటరీ లైఫ్ పెరుగుతుందని చెబుతున్నారు. ఫోన్ వేడెక్కే సమస్య తగ్గుతుందని స్పష్టం చేస్తున్నారు .

Also Read: ప్రీపెయిడ్ vs పోస్ట్‌పెయిడ్ సిమ్.. రెండింటికి తేడా ఏంటి? సామాన్యులకు ఏది బెస్ట్?

Related News

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు భూకంప హెచ్చరికల సాధనంగా.. గూగుల్ బిగ్ అప్‌డేట్!

యూట్యూబ్ ఛానెల్ పెడుతున్నారా? ఈ కంటెంట్‌తో వీడియోలు చేస్తే మీరే కింగ్.. కనక వర్షం కురవాల్సిందే!

Big Stories

Advertisement
×