E-Paper
Advertisement

ఛార్జర్‌ను ఎప్పుడూ ప్లగ్‌లోనే ఉంచుతున్నారా? కొంపలు అంటుకుంటాయ్ భయ్యా!

ఛార్జర్‌ను ఎప్పుడూ ప్లగ్‌లోనే ఉంచుతున్నారా? కొంపలు అంటుకుంటాయ్ భయ్యా!
Advertisement

Phone Charger: ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేని మనిషి, ఇల్లు లేదంటే ఎలాంటి అతిశయోక్తి ఉండదు. మెుబైల్స్ తో పాటు ఛార్జర్లు సైతం.. నిత్య జీవితంపై భాగమైపోయాయి. అయితే ఛార్జర్ల విషయంలో చాలా మందికి ఓ అలవాటు ఉంటుంది. ఫోన్ చార్జింగ్ అయిపోగానే ఫోన్ తీసేస్తారు కానీ చార్జర్‌ను మాత్రం సాకెట్ (Plugs) లోనే అలాగే వదిలేస్తుంటారు. కనీసం స్విచ్ కూడా ఆఫ్ చేయరు. మరి ఇలా చార్జర్‌ను 24 గంటలూ ప్లగ్‌లోనే ఉంచడం వల్ల ఏమైనా ప్రమాదమా? లేదా బిల్లు ఎక్కువగా వస్తుందా? దీనిపై టెక్ నిపుణులు ఏం చెబుతున్నారో ఈ కథనంలో చూద్దాం.

‘ఫాంటమ్ లోడ్’ (Phantom Load)

ఫోన్ ను ఛార్జర్ కు కనెక్ట్ చేసినా, చేయకపోయినా స్విచ్ ఆన్ చేసి ఉన్న చార్జర్.. కొద్ది మొత్తంలో విద్యుత్‌ను వినియోగిస్తూనే ఉంటుంది. దీనినే టెక్నికల్ భాషలో ‘ఫాంటమ్ లోడ్’ లేదా ‘వ్యాంపైర్ డ్రా’ (Vampire Draw) అంటారు. చార్జర్ లోపల ఉండే ట్రాన్స్‌ఫార్మర్, ఫోన్ లేకపోయినా కరెంట్‌ను చిన్న మొత్తంలో వాడుకుంటూనే ఉంటాయి.

కరెంట్ బిల్లు పెరుగుతుందా?

Advertisement

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చార్జర్‌ను అలా వదిలేయడం వల్ల కొద్దిమేర పవర్ బిల్లు పెరిగే ఛాన్స్ ఉంది. అయితే అది నామమాత్రంగానే ఉంటుంది. ఒక చార్జర్ నెల మొత్తం ప్లగ్‌లోనే ఉంటే.. అది కొన్ని పైసలు లేదా మహా అయితే ఒకటి రెండు రూపాయల ఖర్చును మాత్రమే పెంచుతుందని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల జేబుకు కలిగే పెద్ద నష్టం ఏమీ లేదని పేర్కొంటున్నారు. కానీ ఇంట్లో పదుల సంఖ్యలో చార్జర్లు, టీవీలు, మైక్రోవేవ్‌లు ఇలాగే ‘స్టాండ్‌బై’ మోడ్‌లో ఉంటే మాత్రం ఏడాది చివరన బిల్లులో భారీ మార్పు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

చార్జర్ పాడయ్యే ప్రమాదం ఉందా?

అయితే ఛార్జర్ ను ప్లగ్ కు అలాగే వదిలేయడం వల్ల దాని మన్నిక దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చార్జర్ ఎప్పుడూ ప్లగ్‌కు కనెక్ట్ అయి ఉండటం వల్ల అందులోని అంతర్గత భాగాలు (Internal components) నిరంతరం పని చేస్తూనే ఉంటాయని పేర్కొంటున్నారు. దీనివల్ల చార్జర్ త్వరగా వేడెక్కడం, లోపలి భాగాలు అరిగిపోవడం జరిగి చార్జర్ లైఫ్ టైమ్ తగ్గిపోతుందని హెచ్చరిస్తున్నారు.

అగ్ని ప్రమాదాలు జరుగుతాయా?

Advertisement

సాధారణంగా ఒరిజినల్, బ్రాండెడ్ చార్జర్లలో సేఫ్టీ ఫీచర్లు ఉంటాయి కాబట్టి అంత త్వరగా ప్రమాదాలు జరగవు. ఒకవేళ నాసిరకం లేదా లోకల్ చార్జర్లు వాడుతుంటే అవి ఓవర్‌హీట్ అయి షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక్కోసారి పవర్‌ సప్లైలో అకస్మాత్తుగా వోల్టేజ్ పెరిగినప్పుడు ప్లగ్‌లోనే ఉన్న చార్జర్ కాలిపోవడమే కాకుండా పక్కన ఉన్న వస్తువులకు నిప్పు అంటుకునే ప్రమాదం ఉంటుందని పేర్కొంటున్నారు. మరోవైపు బెడ్ పైనో, సోఫా పైనో చార్జర్ ఉంచి దానిపై బట్టలు లేదా దిండ్లు పెడితే వేడి బయటకు పోక ప్రమాదాలు జరిగే ముప్పు సైతం ఉంటుందని వార్నింగ్ ఇస్తున్నారు.

Also Read: ఏసీ గదిలో స్టాండ్ ఫ్యాన్.. తర్వాత జరిగే మ్యాజిక్కే వేరు.. నిజంగా ఆశ్చర్యపోతారు!

చిన్నారులు జాగ్రత్త!

ఇంట్లో చిన్న పిల్లలు లేదా కుక్కలు, పిల్లులు లాంటి పెంపుడు జంతువులు ఉన్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. సాకెట్‌లో ఉన్న చార్జర్ వైర్ కొసను పిల్లలు నోట్లో పెట్టుకున్నా లేదా జంతువులు కొరికినా వైర్లలో ఉండే విద్యుత్ వల్ల షాక్ కొట్టే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మెుత్తంగా చూస్తే.. చార్జర్‌ను ప్లగ్‌లోనే ఉంచడం వల్ల పెద్దగా కరెంటు బిల్లు పెరగపోయినా.. భద్రతా పరంగా మాత్రం రిస్క్ తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫోన్ చార్జింగ్ కాగానే స్విచ్ ఆఫ్ చేయడం లేదా చార్జర్‌ను పక్కన పెట్టడం చాలా మంచి అలవాటని స్పష్ట చేస్తున్నారు.

Also Read: BSNL కస్టమర్లకు షాక్.. రూ. 107 ప్లాన్ వ్యాలిడిటీ మళ్లీ కట్!

Related News

ఇంట్లో Wi-Fi డెడ్ జోన్స్‌కు సింపుల్ సొల్యూషన్.. పాత ఆండ్రాయిడ్ ఫోన్‌తో ఇలా చేయండి!

వాషింగ్ మెషీన్‌ను ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేయాలి? ఈ విషయం తెలుసా?

AIతో పెరుగుతున్న సైబర్ మోసాలు.. మీ డబ్బు, వ్యక్తిగత సమాచారాన్ని కాపాడుకోండిలా!

BSNL కనివిని ఎరుగని ప్లాన్స్.. రోజుకు రూ.5 మాత్రమే.. 80 రోజులపాటు మీ ఇష్టం!

కొత్త 5G ఫోన్‌తో ఫిలిప్స్ రీ-ఎంట్రీ.. సెప్టెంబర్ 2న ఏం లాంచ్ చేయనుందంటే?

బ్యాటరీ ఎక్కువకాలం మన్నాలంటే 80-20 రూల్ పాటించాల్సిందేనా?

ఒకప్పుడు ఇవే స్టేటస్ సింబల్.. 90లలో ఫేమస్ అయిన 5 ఫోన్లు ఇవే!

మ్యాక్‌లో సిస్టమ్ స్టోరేజ్ పెరిగిపోయిందా? ఈ సింపుల్ ప్రాసెస్ ద్వారా ఖాళీ చేసి స్పీడ్ పెంచండి!

Big Stories

Advertisement
×