E-Paper
Advertisement

అన్నకు సపోర్టుగా చెల్లి, ఆపై టీడీపీపై మండిపాటు, ఆ మేటరేనా?

అన్నకు సపోర్టుగా చెల్లి, ఆపై టీడీపీపై మండిపాటు, ఆ మేటరేనా?
Advertisement

Ys Sharmila: ఏపీలో రాజకీయాలు విచిత్రంగా నడుస్తున్నాయి. జగన్ చేసిన వ్యాఖ్యలకు మద్దతుగా నిలిచారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. కావాలనే టీడీపీ నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. సంజాయిషీ ఇచ్చుకోలేని వారిపై టీడీపీ చేస్తున్న దుష్ప్రచారం వారి రాజకీయ అక్కసును బయట పెట్టిందన్నారు. అసలేం జరిగింది.

రాజారెడ్డి వ్యవహారం.. టీడీపీని ఏకేసిన వైఎస్ షర్మిల

Advertisement

మీడియా ముందుకొచ్చిన ప్రతీసారి వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ అబాసుపాలవుతున్నారు. వివాదాస్పద అంశాలను తెరపైకి తెచ్చి తన గురించి సింపథీ క్రియేట్ చేసుకునే పనిలోపడ్డారు. గతవారం మీడియా ముందుకొచ్చిన జగన్, తండ్రి వైఎస్ఆర్, రాజారెడ్డి, వివేకానంద మరణాలను గురించి ప్రస్తావించారు.

అసలు రాజారెడ్డి, వైఎస్ఆర్ హయాంలో కడప, పులివెందులలో ఏం జరిగిందో ఆనాటి రాజకీయాలు నేతలు వీడియోలు టీడీపీ వైరల్ చేస్తోంది. అంతేకాదు వైసీపీని టీడీపీ నేతలు ఏకిపారేశారు. దీంతో వైసీపీ ఆత్మరక్షణలో పడిపోయింది. ఈ వ్యవహారంపై వైసీపీ నేతలు సైలెంట్ అయ్యారు. పరిస్థితి గమనించిన ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల రంగంలోకి దిగారు.

Advertisement

టీడీపీ చేస్తున్న రాజకీయాలు దుమ్మెత్తిపోశారు ఏపీ కాంగ్రెస్ చీఫ్జ. వైఎస్ఆర్, రాజారెడ్డి ఈ లోకంలో లేరని, సంజాయిషీ ఇచ్చుకోలేని వారిపై టీడీపీ చేస్తున్న దుష్ప్రచారం వారి రాజకీయ అక్కసును బయటపెట్టిందని ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. వారు అంత దుర్మార్గులే అయితే తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు విచారణ జరపలేదని ప్రశ్నించారు.

సంజాయిషీ ఇచ్చుకోలేని వారిపై దుష్ప్రచారం- షర్మిల

మీకు చేతకాలేదా? ఇప్పుడు కూడా కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతుందని, చెప్పుకోదడిన విజయాలు లేకనే కదా ఈ గోలంతా? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు. పాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకు దివంగతులను తెరపైకి తెచ్చి టీడీపీ నీచ రాజకీయాలు చేస్తోంది దుయ్యబట్టారు.

తప్పుడు ప్రచారం చేసినంత మాత్రాన మీరు ఉత్తములు కారని, ఆకాశం మీద ఉమ్మేస్తే అది తిరిగి ఎక్కడ పడుతుందో రెండేళ్లుగా అధ్వాన్న పాలన చేసి ఆపర మేధావులు తెలుసుకోవాలన్నారు. సీమలో జరిగిన అరాచకాలు ఎదురించి పేదల పక్షాన నిలబడ్డ వ్యక్తి రాజారెడ్డి అని, ప్రజలకోసం 1973 లో ఆసుపత్రిని నిర్మించి ఉచిత వైద్యం అందించిన వ్యక్తి ఆయనని గుర్తు చేశారు.

పేద బిడ్డల ఉన్నత చదువుల కోసం డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలను కట్టించారని, ఉచిత విద్యను అందించిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. అలాంటి వ్యక్తి చరిత్రను వక్రీకరించి, తప్పుగా చిత్రీకరిస్తే రాయలసీమ ప్రజలు ఎన్నటికీ హర్షించరని రాసుకొచ్చారు. సంక్షేమం, అభివృద్ధి అనే పదాలకు చిరునామా వైఎస్‌ఆర్ అని, పార్టీలకు అతీతంగా పరిపాలన చేసిన మహనీయుడని పేర్కొన్నారు.

ALSO READ: విశాఖ మెట్రోకు మళ్లీ ఏమైంది? ఓ అడుగు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కి, రైట్స్ కొర్రీలు

ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, రుణ మాఫీ, ఉచిత కరెంటు లాంటి పథకాలు ఆయనకు మాత్రమే సాధ్యమైందన్నారు. పోలవరాన్ని మొదలు పెట్టి ఐదేళ్ల ఏళ్లలో 33 శాతం పనులు చేస్తే.. రెండు సార్లు సీఎంగా ఉన్న చంద్రబాబుకు మిగతా పనుల పూర్తికి చేతకాలేదని ఆరోపించారు. మాట ఇచ్చిన ప్రకారం.. నిరుద్యోగ భృతి ఇవ్వడానికి చేతకాలేదని మండిపడ్డారు. 15 వందలు ప్రతి నెలా మహిళలకు ఇవ్వలేదని ఆరోపించారు.

కడప జిల్లాలో ఫ్యాక్షన్ లేదని చెప్పడానికి వైఎస్ఆర్ అనేది జగమెరిగిన సత్యం. అవగాహన రాహిత్యంతో దివంగత నేతను నిందించాలని చూడటం సీఎం చంద్రబాబు టీంకు తగదు. ఇకనైనా ఒట్టి మాటలు కట్టి పెట్టి.. ఓట్లేసిన ప్రజలకు మేలు తలపెట్టాలని సూచన చేశారు.

 

Related News

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

ఎవరీ పూల సుబ్బయ్య? వెలిగొండ ప్రాజెక్టుకు ఆయన పేరు ఎందుకు పెట్టారు?

Big Stories

Advertisement
×