E-Paper
Advertisement

ఇంట్లో ఇన్వర్టర్ ఎక్కడ ఉంచాలి ? ఈ చిట్కాలు పాటిస్తే.. బ్యాటరీ లైఫ్ రెట్టింపు!

ఇంట్లో ఇన్వర్టర్ ఎక్కడ ఉంచాలి ? ఈ చిట్కాలు పాటిస్తే.. బ్యాటరీ లైఫ్ రెట్టింపు!
Advertisement

Best place for home inverter: ఇంట్లో ఇన్వర్టర్ ఉంచే స్థలం దాని పనితీరుపై నేరుగా ప్రభావం చూపుతుంది. ఇన్వర్టర్. బ్యాటరీ సెటప్‌ను ప్లాన్ చేసేటప్పుడు ఈ కింది అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.

1. గాలి వెలుతురు ఉండే ప్రదేశం:
ఇన్వర్టర్ పనిచేస్తున్నప్పుడు , బ్యాటరీ ఛార్జ్ అవుతున్నప్పుడు కొంత హీట్ విడుదల చేస్తాయి. అందువల్ల ఇన్వర్టర్‌ను ఎప్పుడూ గాలి ఆడే ప్రదేశంలోనే ఉంచాలి. మూసి ఉన్న గదుల్లో లేదా ఇరుకైన కబోర్డ్స్‌లో ఉంచితే వేడి బయటకు పోలేక బ్యాటరీ త్వరగా దెబ్బతింటుంది. కిటికీలకు దగ్గరగా లేదా బాల్కనీకి సమీపంలో ఉంచడం బెస్ట్.

Advertisement

2. పొడి, చల్లని ప్రదేశం:
తేమ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో (ఉదాహరణకు బాత్‌రూమ్ దగ్గర) ఇన్వర్టర్‌ను ఉంచకూడదు. తేమ వల్ల వైరింగ్‌లో షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంది. అలాగే నేరుగా సూర్యరశ్మి తగిలే చోట కూడా ఉంచరాదు. ఎండ వేడికి బ్యాటరీలోని యాసిడ్ త్వరగా ఆవిరైపోయి పని తీరు తగ్గుతుంది.

3. నేల మీద కాకుండా స్టాండ్‌పై ఉంచండి:
చాలా మంది బ్యాటరీని నేరుగా నేల మీద పెడతారు. కానీ ఇది తప్పు. బ్యాటరీని ఎల్లప్పుడూ ప్లాస్టిక్ లేదా చెక్కతో చేసిన ఇన్వర్టర్ స్టాండ్‌పై ఉంచాలి. దీని వల్ల కింద తేమ చేరకుండా ఉంటుంది. ఒకవేళ బ్యాటరీ నుంచి యాసిడ్ లీక్ అయినా ఫ్లోరింగ్ పాడవ్వకుండా ఉంటుంది.

Advertisement

4. పిల్లలకు దూరంగా :
ఇన్వర్టర్, బ్యాటరీలకు బహిరంగంగా వైర్లు ఉంటాయి. కాబట్టి వీటిని పిల్లలు, పెంపుడు జంతువులు తాకలేని ఎత్తులో లేదా సురక్షితమైన ప్రదేశంలో ఏర్పాటు చేయాలి. వైర్లు చిందరవందరగా లేకుండా ఒక కేసింగ్‌లో అమర్చడం మంచిది.

5. కిచెన్‌కు దూరంగా ఉండాలి:
వంటగదిలో గ్యాస్ సిలిండర్ , స్టవ్ ఉండటం వల్ల, అక్కడ ఇన్వర్టర్ ఉంచడం ఏమాత్రం సురక్షితం కాదు. బ్యాటరీ ఛార్జ్ అయ్యేటప్పుడు కొన్నిసార్లు మండే స్వభావం గల వాయువులను విడుదల చేస్తుంది. అందువల్ల కిచెన్ లేదా ఫైర్ ప్లేస్‌కు ఇన్వర్టర్ కనీసం 5-10 అడుగుల దూరంలో ఉండాలి.

6. ఫ్లాట్ సర్ఫేస్:
ఇన్వర్టర్ స్టాండ్ లేదా బ్యాటరీ ఉంచే ప్రదేశం సమాంతరంగా ఉండాలి. వంకరగా ఉంటే బ్యాటరీలోని ఎలక్ట్రోలైట్ లెవెల్స్ సరిగ్గా ఉండవు. ఇది ఛార్జింగ్ సమస్యలకు దారితీస్తుంది.

ఇన్వర్టర్ అనేది మనకు అవసర సమయాల్లో తోడుండే యంత్రం. దానిని మెట్ల కింద (మెట్లు విశాలంగా ఉంటే) లేదా లివింగ్ రూమ్‌లో ఒక మూలన సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవడం బెస్ట్. క్రమం తప్పకుండా బ్యాటరీలో డిస్టిల్డ్ వాటర్ చెక్ చేస్తూ.. పైన దుమ్ము చేరకుండా చూసుకుంటే మీ ఇన్వర్టర్ ఏళ్ల తరబడి పనిచేస్తుంది.

Related News

కనిపించకుండా పోయిన వస్తువులను ఇట్టే వెతికి పట్టుకోవచ్చు.. శాంసంగ్ నుంచి క్రేజీ డివైజ్!

అమెజాన్ దసరా ఆఫర్.. రూ. 45,000 లోపే యాపిల్ ఐప్యాడ్.. రూ. 20,000 లోపే టాప్ ఫోన్లు!

Samsung Galaxy S27 Ultraలో స్నాప్‌డ్రాగన్‌కు నో ఎంట్రీ.. కారణం ఎంటో తెలుసా?

వీఐ సంచలనం.. దేశంలో తొలి ప్రీపెయిడ్ ఫ్యామిలీ ప్లాన్ లాంచ్.. డేటా షేరింగ్‌తోపాటు 10% డిస్కౌంట్!

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

Big Stories

Advertisement
×