E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: సాగర్, ధీరజ్ ల మధ్య చిచ్చు.. సుక్కు ప్లాన్ సక్సెస్.. ఇదేమీ రచ్చ రా బాబు..

Illu Illalu Pillalu Today Episodes: సాగర్, ధీరజ్ ల మధ్య చిచ్చు.. సుక్కు ప్లాన్ సక్సెస్.. ఇదేమీ రచ్చ రా బాబు..
Advertisement

(Illu Illalu Pillalu Today Episode May 12th: ప్రేమ ధీరజ్ ఇద్దరు కలిసి ఫైనాన్షియల్ దగ్గరికి వెళ్తారు. అయితే అతను చూడడానికి వింతగా ఉండడంతో ప్రేమ అతని చూస్తుంటేనే నాకు భయమేస్తుంది ఇక్కడ ఏదో జరిగినట్లు అనిపిస్తుంది అని అనుకుంటుంది. ఎందుకు ప్రేమ టెన్షన్ పడతావు మనకి కారు వస్తుంది కదా నువ్వేమీ టెన్షన్ పడొద్దు అని ధీరజ్ ఎంతగా చెప్తున్నా సరే ప్రేమ మాత్రం కంగారు పడిపోతూనే ఉంటుంది.. అయితే ధీరజ్ మాట వినకుండా సంతకం పెడతాడు.. కల నెరవేర్చుకునేందుకు ఒక్కరోజు మాత్రమే ఉంది అని చాలా సంతోషంగా ఉంటాడు. మాత్రం కరెక్ట్ గా ఈఎంఐ కట్టాలి అని వార్నింగ్ ఇస్తాడు.. సాగర్ నీ తాగమని పోస్ట్ చేస్తాడు ప్రసాద్ రావు.. కానీ ధీరజ్ గురించి లేనిపోనివి చెప్పి షాక్ అయ్యేలా చేస్తాడు..

సాగర్, ధీరజ్ ల మధ్య చిచ్చు..

ఆనంద్ రావు తన అల్లుడికి ఆ ఇంటి నుంచి ఎలాగైనా సరే బయటకు వచ్చేలా చేయాలి అని మాటలతో తన మనసుని మాయ చేస్తాడు. ధీరస్ కే కాదు ఇంట్లో వాళ్ళు ఎవరికీ కూడా నువ్వు జాబ్ తెచ్చుకొని పైకి రావడం ఇష్టం లేదు అని అనుకుంటున్నాను అని సాగర్ మనసుని చెడగొట్టేలా మాట్లాడుతాడు. అలాంటిదేం లేదు మామయ్య మా తమ్ముడికి నేనంటే చాలా ఇష్టమని సాగర్ ఎంత చెప్తున్నా సరే.. ఐదు లక్షలు ఇవ్వాలి అని కండిషన్ పెట్టాడు కదా అక్కడే నువ్వు అర్థం చేసుకోవచ్చు అని సాగర్ ని రెచ్చగొడతాడు. ఇన్ని రోజులు రైస్ మిల్లులో ఏ జీతం లేకుండా పనిచేసిన నువ్వు ఈరోజు 500000 ఇవ్వలేక పరిస్థితిలో ఉన్నావు అంటే అర్థం చేసుకోవాలి అని ప్రసాద్ అంటాడు. ఇక నిజంగానే తన కుటుంబంలోని వాళ్ళకి జాబ్ చేయడం ఇష్టం లేదేమో అని సాగర్ అనుకుంటాడు.

శ్రీవల్లి, చందులను కలిపే ప్లాన్..

Advertisement

సుకన్య వంటగదిలో పాలు కాస్తూ రొమాంటిక్ పాటలు పాడుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన శ్రీవల్లి నన్ను మా ఆయన్ని కలపడానికి నువ్వు ఇక్కడికి వచ్చావు కానీ ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావ్? పాటలు పడుకుంటున్నావా అని అంటుంది. ఒసేయ్ పిచ్చిదానా పాటలు కాదే ఇవి కలిపేది నీకోసమే అని అంటుంది. ఇందులో ఈ పొడి కలిపి మీ ఆయన చేత తాగిస్తే నీ కడుపు పండినట్లే అని శ్రీవల్లితో అంటుంది. అది విన్న వేదవతి ఏం కలపాలి దేని గురించి మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అని అడుగుతుంది. వేదవతిని చూసిన శ్రీవల్లి కన్య ఇద్దరు కూడా షాక్ అవుతారు.. మీ అబ్బాయి కోసం బాదం పడితే తెప్పించాను అది వేడి వేడి పాలలో వేసి తాగితే తనకి చాలా ఇష్టమని అంటుంది. ఆపాలంటే అందరికీ ఇష్టమే అందరికీ కలపాలి అని ఇంకాస్త పాలు వేసి ఆ పొడిని పాలల్లో కలిపి అందరికీ ఇవ్వాలని వేదవతి అనుకుంటుంది.

ప్రేమ, నర్మదలు రాత్రి రచ్చ..

వేదవతి పాలని అందరికీ కలిపి ప్రేమ నర్మదలను పిలిచి మీ ఆయనలకు కూడా ఈ పాలను కలిపాను ఇవ్వండి మీ కడుపు పండి తొందరగా గర్భవతులు అవుతారు అని అంటుంది. ఇక వాళ్ళిద్దరూ కూడా గ్లాసులు తీసుకొని లోపలికి వెళ్తారు. అయితే వేదవతి గ్లాస్ ని తిరుపతి తీసుకుని తాగి దీన్ని తాగుతుంటే ఏదో తెలియని ఉత్సాహం మొదలవుతుంది అని అనుకుంటాడు.. కన్యా ఎక్కడుందో తెలుసుకోవాలి అని తెగ వెతికేస్తూ ఉంటాడు. తిరుపతి ఆ పాలను తాగి ఉంటాడు అని గమనించిన కన్య అతనికి దొరక్కుండా ఉండాలి అని పారిపోతూ ఉంటుంది.

ప్రేమ, ధీరజ్ లు కలిసిపోతారా..?

Advertisement

వేదవతి ఇచ్చిన పాలని ప్రేమ ధీరజ్ కి ఇవ్వడానికి తీసుకుని వస్తుంది. కానీ ధీరజ్ మాత్రం ఆ పాలని తాగడు నేను ఇందాకే మజ్జిగ తాగాను ఈ రెండు తాగితే అవి రెండు కొట్టుకొని లస్సి అవుతాయి అని అంటాడు. నువ్వు తాగకుండా నేను తాగేస్తాను అని ప్రేమ ఆ పాలని తాగేసి మత్తులోకి వెళ్ళిపోతుంది. అయితే ధీరజ్ ఎక్కడున్నాడని వెతుక్కుంటూ లోపలికి వచ్చి అతనిపై ప్రేమగా చేతులు వేస్తుంది. అది గమనించిన ధీరజ్ ప్రేమకి ఏదో తేడాగా జరుగుతుందని ఆలోచిస్తూ ఉంటాడు. కొంపతీసి మందేమైనా తాగావా అని ధీరజ్ అడుగుతాడు. పాలు మాత్రమే తాగాను రా అని అనగానే ధీరజ్ కి అనుమానం వస్తుంది.

నర్మద ఎమోషనల్ సీన్..

నర్మదా సాగర్ కోసం పాలను తీసుకుని వెళ్లి అలానే పట్టుకొని కూర్చుంటుంది. అయితే ఎంతసేపు అలా పట్టుకుని ఉన్నా కూడా సాగర్ మాత్రం ఆ పాలను తాగడు. దాంతో నర్మదా ఈ పాలను తాగుతావా లేదంటే నన్నే తాగమంటావా అని అడుగుతుంది. అయితే ఆ పాలని తాగిన నర్మదా మత్తులోకి వెళ్ళిపోతుంది. కనీసం తేడాగా మారిపోవడంతో సాగర్ ఏమైంది నీకు అని అడుగుతాడు. ఎంతసేపు నీ జాబు, నీ మొండితరమే తప్ప నన్ను పట్టించుకోడమే మానేశావు. ఒకప్పుడు మల్లెపూలు తెచ్చే వాడివి ఇప్పుడు నాకోసం మల్లెపూలు కూడా తీసుకురాలేదు అని అంటుంది..

శ్రీవల్లి, చందు కలిసిపోతారా..?

వల్లి చందు కోసం పాలని తీసుకుని వెళుతుంది. ఆ పాలను తాగిన చందు మత్తుగా మారిపోతాడు. శ్రీవల్లి పాలను తాగేసాడు ఇప్పుడు మేము కలిసిపోవచ్చు అని చాలా సంతోషంగా ఉంటుంది. ఇక మొత్తానికి శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అవుతుంది. కన్యతో ఆ విషయం గురించి చెప్తుంది. వీళ్ళిద్దరి మధ్య ఆ బంధం బలపడి శ్రీవల్లి తల్లి అవుతుందేమో చూడాలి. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Brahmamudi Rekha : ‘బ్రహ్మముడి ‘ రేఖ ఆస్తులు.. ఇన్నేళ్లలో అంత సంపాదించిందా..?

Related News

Telugu Tv Serials : ఈ వారం సీరియల్స్ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్ ఏదంటే..?

ఇంద్రజకు ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎన్ని లక్షలో తెలుసా..? సినిమా కన్నా ఎక్కువే..

Gundeninda GudiGantalu Today episode: సంబరాలు చేసుకున్న ప్రభా.. చింతామణి కుట్ర తెలిసిపోతుందా..? బాలుకు షాక్..

Podarillu Today Episode : విగ్నేశ్వరి దెబ్బకు మహా ఫ్యూజుల్ అవుట్.. మహా కోసం సర్ప్రైజ్ ప్లాన్.. నిజం తెలిసిపోతుందా..?

Intinti Ramayanam Today Episode: అయ్యో పాపం శ్రీయ.. పల్లవి నగలను కొట్టేసిందా..? అక్షయ్ సీరియస్..

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ కు షాక్.. వల్లి ఫిట్టింగ్ అదిరిపోయింది.. నెక్స్ట్ ఏం జరుగుతుంది..?

Sunday Movies in Tv : ఆదివారం టీవీ సినిమాలు.. మాస్ ఫ్యాన్స్ కు పునకాలే..

Nindu Noorella Saavasam Serial Today Episode July 18th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్లాన్ ప్రకారం బుజ్జమ్మ చంపాలనుకున్న ప్రచండ

Big Stories

Advertisement
×