E-Paper
Advertisement

చిన్న ఫ్యామిలీకి పర్ఫెక్ట్ ఫ్రిజ్ ఇదేనా? తక్కువ కరెంట్ బిల్లుతో ఎక్కువ స్టోరేజ్.. ఇంకా ఎన్నో !

చిన్న ఫ్యామిలీకి పర్ఫెక్ట్ ఫ్రిజ్ ఇదేనా? తక్కువ కరెంట్ బిల్లుతో ఎక్కువ స్టోరేజ్.. ఇంకా ఎన్నో !
Advertisement

Samsung 223L Single Door Refrigerator: ప్రస్తుతం ఫ్రిజ్ కొనడం అంటే కేవలం కూలింగ్ కోసం కాదు ..స్మార్ట్ సేవింగ్స్, స్టైలిష్ డిజైన్, సరైన స్టోరేజ్ వంటి ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్ కావాలి. ఈ ట్రెండ్‌ను అర్థం చేసుకుని శామ్సంగ్ తీసుకొచ్చిన Samsung 223L Direct Cool Single Door Refrigerator (RR24C2823S8/NL) ఇప్పుడు బడ్జెట్ సెగ్మెంట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లు, ఎక్కువ రోజులు పాడవకుండా ఉండి చిన్న కుటుంబాలకు ఇది పర్ఫెక్ట్ ఆప్షన్‌గా నిలుస్తోంది. అయితే ఈ ఫ్రిజ్ పూర్తి వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Samsung 223L ఫ్రిజ్ ఓవర్‌వ్యూ:

శామ్సంగ్ ఈ మోడల్‌ను ప్రత్యేకంగా ఇండియన్ కస్టమర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని రూపొందించింది. 223 లీటర్ల కెపాసిటీతో ఉంటే ఆ ఫ్రిజ్ చిన్న,మిడిల్ క్లాస్ కుటుంబాలకు బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తోంది . డైలీ అవసరాలకు సరిపోయేలా సింపుల్ డిజైన్, ఉపయోగించడానికి అనువైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. మార్కెట్లో అనేక ఆప్షన్లు ఉన్నప్పటికీ.. ఈ మోడల్ తక్కువ ధరలో ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది.

Advertisement

పవర్ సేవింగ్ టెక్నాలజీ:
ఈ ఫ్రిజ్‌లో ఉన్న డిజిటల్ ఇన్వర్టర్ కంప్రెసర్ దీని ప్రధాన ఆకర్షణ. ఇది అవసరాన్ని బట్టి టెంపరేచర్ మార్చుకుంటూ కరెంట్ ఖర్చును తగ్గిస్తుంది. ఫలితంగా.. మీ కరెంట్ బిల్లు తగ్గుతుంది. అంతేకాకుండా.. ఇది తక్కువ శబ్దంతో పనిచేయడం వల్ల ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కువ రోజులు పనిచేయడంలో Samsung ఈ కంప్రెసర్‌పై 20 ఏళ్ల వారంటీ ఇవ్వడం కస్టమర్లకు మరింత నమ్మకాన్ని కలిగిస్తోంది.

కూలింగ్ ఫుడ్ ఎప్పటికీ ఫ్రెష్:

Advertisement

Direct Cool టెక్నాలజీతో పనిచేసే ఈ ఫ్రిజ్ వేగంగా కూలింగ్ అందిస్తుంది. ఫ్రూట్స్, వెజిటబుల్స్, మిల్క్ ప్రోడక్ట్స్ వంటి పదార్థాలు ఎక్కువసేపు తాజాగా ఉండేలా ఇది సహాయపడుతుంది. రోజువారీ వాడకంలో ఫుడ్ వృథా కాకుండా నిల్వ ఉంచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. కూలింగ్ సమానంగా విస్తరించడం వల్ల ప్రతి మూలలో కూడా సరైన చల్లదనం ఉంటుంది.

స్టోరేజ్, డిజైన్ :
ఈ ఫ్రిజ్‌లో ఉన్న టఫ్‌న్డ్ గ్లాస్ షెల్వ్స్ బలంగా ఉండి ఎక్కువ బరువును కూడా తట్టుకోగలవు. పెద్ద గిన్నెలు,వాటర్ బాటిల్స్, ఫుడ్ కంటైనర్లు అన్నీసులభంగా అమర్చుకోవచ్చు. బయట నుంచి చూసినప్పుడు కూడా ఈ ఫ్రిజ్ సింపుల్ , ఎలిగెంట్ లుక్‌తో ఆకట్టుకుంటుంది. చిన్న కిచెన్‌లకు కూడా ఇది సరిగ్గా సరిపోతుంది. ఉపయోగించడానికి ఈజీగా ఉండటం దీని మరో ప్లస్ పాయింట్.

సేఫ్టీ, డ్యూరబిలిటీ :
వోల్టేజ్ మార్పులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కూడా ఈ ఫ్రిజ్ బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇందులో బిల్ట్-ఇన్ స్టెబిలైజర్ ఉంది. అదనంగా.. యాంటీ బ్యాక్టీరియల్ గాస్కెట్ ఫుడ్‌ను హైజీనిక్‌గా ఉంచడంలో సహాయ పడుతుంది. డోర్ లాక్ సిస్టమ్ ఉండటం వల్ల చిన్న పిల్లలున్న ఇళ్లలో ఇది మరింత సేఫ్‌గా ఉంటుంది. ఎక్కువ రోజులు వాడటానికి అవసరమైన అన్ని ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

పవర్ కట్ :
పవర్ కట్ అయినా కూడా ఈ ఫ్రిజ్ లోపలి చల్లదనాన్ని కొంతసేపు నిల్వ ఉంచుతుంది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో లేదా తరచూ పవర్ కట్ సమస్య ఉండే చోట్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఫుడ్ క్వాలిటీ దెబ్బతినకుండా కాపాడడంలో ఇది సహాయ పడుతుంది.

Also Read: 56 గంటల బ్యాటరీ లైఫ్.. 50dB నాయిస్ క్యాన్సిలేషన్! రియల్ మీ కొత్త బడ్స్ ఫీచర్స్ మాములుగా లేవుగా!

ధర, వాల్యూ ఫర్ మనీ:

రూ.18,000 నుంచి రూ. 20,000 మధ్యలో లభించే ఈ ఫ్రిజ్ ధర పరంగా చాలా అఫోర్డబుల్‌గా ఉంటుంది. ఈ ధరలో ఇన్వర్టర్ టెక్నాలజీ, మంచి స్టోరేజ్, సేఫ్టీ ఫీచర్లు అన్నీ అందించడం దీన్ని వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్‌గా నిలబెడుతుంది. తక్కువ బడ్జెట్‌లో మంచి ఫ్రిజ్ కోసం చూస్తున్న వారికి ఇది బెస్ట్ ఆప్షన్ గా చెప్పవచ్చు.

ఎవరికి బెస్ట్?

ఈ ఫ్రిజ్ ముఖ్యంగా చిన్న కుటుంబాలు, కొత్తగా ఫ్యామిలీ స్టార్ట్ చేసే వారికి, లేదా తక్కువ కరెంట్ బిల్ కోరుకునే కస్టమర్లకు అనుకూలంగా ఉంటుంది. డైలీ యూజ్ కోసం ఇది సరైన సైజ్ , ఫీచర్లను అందిస్తుంది.

మైనస్ :

ఇది Direct Cool ఫ్రిజ్ కావడం వల్ల మాన్యువల్ డిఫ్రాస్ట్ చేయాల్సి ఉంటుంది. ఫ్రాస్ట్ ఫ్రీ ఫీచర్ లేకపోవడం కొంతమందికి చిన్న మైనస్‌గా అనిపించవచ్చు. అయితే ఈ ధరలో ఇది సాధారణమే.

మొత్తానికి.. Samsung 223L Direct Cool Refrigerator బడ్జెట్ సెగ్మెంట్‌లో బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తోంది. మంచి ఫీచర్లు, , తక్కువ ధర అన్నీ కలగలిపిన ఈ ఫ్రిజ్ మిడిల్ క్లాస్ వారికి బెస్ట్ ఛాయిస్.. మీరు రూ. 20,000 లో మంచి ఫ్రిజ్ కోసం చూస్తున్నట్లయితే.. ఈ మోడల్‌ను తప్పకుండా ట్రై చేయండి.

Related News

రూ.20వేలలోపు శామ్‌సంగ్ గెలాక్సీ M36 5G.. ఫోన్ అంటే ఇలా ఉండాలి బాస్

స్టూడెంట్స్ అండ్ యూత్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్.. సూపర్ ఏఐ ఫీచర్స్ రియల్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్

Big Stories

Advertisement
×