E-Paper
Advertisement

బడ్జెట్ ధరలోనే బ్రాండెడ్ టీవీ.. 43 ఇంచుల శాంసంగ్ 4K అల్ట్రా HD టీవీపై సూపర్ డిస్కౌంట్

బడ్జెట్ ధరలోనే బ్రాండెడ్ టీవీ.. 43 ఇంచుల శాంసంగ్ 4K అల్ట్రా HD టీవీపై సూపర్ డిస్కౌంట్
Advertisement

Samsung 43 Inch 4K Smart TV: మీ పాత టీవీని మార్చాలని ప్లాన్ చేస్తున్నారా? బడ్జెట్ ధరలో ప్రీమియం బ్రాండ్ టీవీ కోసం వెతుకుతున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్, తన Crystal 4K సిరీస్‌లో ఫేమస్ అయిన UA43UE81AFULXL మోడల్‌పై అదిరిపోయే డీల్‌ను అందిస్తోంది. కేవలం రూ. 36,990 ధరకే లభిస్తున్న ఈ టీవీ, మీ ఇంటిని ఒక చిన్నపాటి సినిమా థియేటర్‌గా మార్చేయడం ఖాయం.

ఎందుకు ఈ టీవీనే కొనాలి?

Advertisement

ఈ టీవీని మిగిలిన వాటితో పోలిస్తే స్పెషల్‌గా నిలిపే అంశాలు ఇవే..

1.సినిమాటిక్ డిస్‌ప్లే: ఇందులో ఉన్న 4K అల్ట్రా హెచ్‌డీ రిజల్యూషన్ , క్రిస్టల్ ప్రాసెసర్ 4K వల్ల మీరు చూసే ప్రతి పిక్చర్ స్పష్టంగా, సహజమైన రంగులతో కనిపిస్తుంది.

Advertisement

2. బెజెల్-లెస్ డిజైన్: టీవీ చుట్టూ ఫ్రేమ్ చాలా సన్నగా ఉండటం వల్ల, మీరు కేవలం సినిమాని మాత్రమే చూస్తున్న ఫీల్ కలుగుతుంది. ఇది మీ హాల్‌కు కూడా ఒక రిచ్ లుక్ ఇస్తుంది.

3. HDR 10+ సపోర్ట్: చీకటి సీన్లలో కూడా సూక్ష్మమైన వివరాలను ఈ టెక్నాలజీ స్పష్టంగా చూపిస్తుంది. ఇక నైట్ మోడ్ సినిమాలు చూసేటప్పుడు వచ్చే మజాయే వేరు!

స్మార్ట్ ఫీచర్లు.. నెక్స్ట్ లెవల్:
ఈ శాంసంగ్ స్మార్ట్ టీవీ కేవలం సినిమాలు చూడటానికే కాదు.. గేమింగ్ ప్రియులకు కూడా అద్భుతమైన ఆప్షన్.

1.మోషన్ ఎక్స్‌లరేటర్: మీరు హై-స్పీడ్ యాక్షన్ సినిమాలు లేదా గేమింగ్ ఆడుతున్నప్పుడు బొమ్మ ఏమాత్రం లాగ్ అవ్వకుండా స్మూత్‌గా ఉంటుంది.

2.వాయిస్ కంట్రోల్: రిమోట్‌లో టైప్ చేసే పని లేదు. గూగుల్ అసిస్టెంట్ లేదా అలెక్సా ద్వారా మీకు కావాల్సిన సినిమాని కేవలం నోటి మాటతో ప్లే చేయొచ్చు.

3.OTT సపోర్ట్: నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్ వీడియో వంటి చాలా యాప్స్ ఇన్‌బిల్ట్‌గా వస్తాయి.

సౌండ్ క్వాలిటీ: థియేటర్ వైబ్స్ ఇంట్లోనే!

సాధారణంగా తక్కువ ధర టీవీల్లో సౌండ్ తక్కువగా ఉంటుంది. కానీ శాంసంగ్ ఇందులో 20W స్పీకర్లతో పాటు OTS Lite (Object Tracking Sound) ఫీచర్ ఇచ్చింది. దీని వల్ల స్క్రీన్‌పై వస్తువు ఎటు కదిలితే శబ్దం అటు నుంచే వస్తున్నట్లు అనిపించి.. రియలిస్టిక్ ఫీల్ ఉంటుంది.

Also Read: ఏసీ వాడితే కరెంట్ బిల్లు ఎంత వస్తుంది? మీకు తెలియని అసలు లెక్కలివే!

భారీ డిస్కౌంట్.. అస్సలు మిస్సవద్దు
ప్రస్తుతం ఈ మోడల్ ధర రూ.29.990కే ఉంది. ఒకవేళ మీరు ఆన్‌లైన్ సేల్స్ లేదా బ్యాంక్ ఆఫర్లను ఉపయోగిస్తే.. ఈ ధర ఇంకా తగ్గే అవకాశం ఉంది. కొన్ని ప్లాట్‌ఫారమ్‌లలో ఎక్స్ఛేంజ్ ఆఫర్ల ద్వారా కూడా ఎక్కువ డబ్బు ఆదా చేయవచ్చు.

బ్రాండ్ వాల్యూ, అద్భుతమైన క్వాలిటీ, నమ్మకమైన సర్వీస్ కోరుకునే వారు కళ్లు మూసుకుని ఈ శాంసంగ్ 43 ఇంచ్ 4K స్మార్ట్ టీవీని కొనొచ్చు. స్టాక్ అయిపోయేలోపే మీ ఇంటికి కొత్త టీవీని తెచ్చేసుకోండి మరి.

Also Read: బీఎల్డీసీ Vs రెగ్యులర్ ఫ్యాన్.. కరెంట్ బిల్లును సగానికి తగ్గించే ఫ్యాన్ ఏది?

Related News

ఐకూ నుంచి క్రేజీ కాంపాక్ట్ టాబ్లెట్.. నెక్ట్స్ జనరేషన్ చిప్‌సెట్‌తో ఎంట్రీ!

ఐఫోన్ యూజర్లకు మెటా బిగ్ ఆఫర్.. ఐక్లౌడ్ లేకున్నా వాట్సప్ చాట్ బ్యాకప్ ఇక ఈజీ!

ఆకాశం నీలం, సూర్యాస్తమయం ఎరుపు.. అంతరిక్షం నలుపు.. అసలేంటీ రంగుల మిస్టరీ?

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

Big Stories

Advertisement
×