E-Paper
Advertisement

Inzamam-ul-Haq: అల్లా మీద ఒట్టు.. SRH చెత్త బౌలింగ్ లో వైభ‌వ్ డ‌బుల్ సెంచ‌రీ కొడ‌తాడు

Inzamam-ul-Haq: అల్లా మీద ఒట్టు.. SRH చెత్త బౌలింగ్ లో వైభ‌వ్ డ‌బుల్ సెంచ‌రీ కొడ‌తాడు
Advertisement

Inzamam-ul-Haq:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Indian Premier League 2026 Tournament) భాగంగా వైభవ్ సూర్యవంశీ హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ప్రతి మ్యాచ్ లో 300 స్ట్రైక్ రేట్ తో ఇరగదీస్తున్నాడు ఈ కుర్రాడు. ఇప్పటికే ముంబై అలాగే బెంగళూరు పై దండయాత్ర చేసిన వైభవ్, ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగే ఫైట్ కు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్-ఉల్-హక్ (Inzamam-ul-Haq ) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చెత్త బౌలింగ్ ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ లో వైభవ్ ఇవాళ డబుల్ సెంచరీ చేయడం గ్యారంటీ అంటూ హెచ్చరించారు. రాజస్థాన్ రాయల్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే క‌చ్చితంగా వైభవ్ ఇరగదీస్తాడని డేంజర్ బెల్స్ పంపించారు. దీంతో వైభవ్ సూర్యవంశీ పై ( vaibhav suryavanshi) ఇంజమామ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Also Read: Rohit VS Bumrah: ముంబైలో చీలిక‌..రోహిత్ శ‌ర్మ‌ను బండ బూతులు తిట్టిన బుమ్రా, రూ.50 లక్ష‌ల ఫైన్‌

ఇవాళ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ హైదరాబాద్ మధ్య బిగ్ ఫైట్

Advertisement

వరుస విజయాలతో దూసుకు వెళ్తున్న రాజస్థాన్ రాయల్స్, నేడు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో తల పడనుంది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ రెండు జట్లు తలపడతాయి. సాయంత్రం 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. దీంతో ఇప్పటికే ఉప్పల్ స్టేడియానికి చేరుకున్న రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్లు, ప్రాక్టీస్ లో మునిగిపోయారు. ఈ మ్యాచ్ ను జియో హాట్ స్టార్‌, స్టార్ స్పోర్ట్స్ ల‌లో చూడొవ‌చ్చు. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య ఇప్పటి వరకు ఇరవై ఒక్క మ్యాచ్ లు జరిగాయి. ఇందులో 12 మ్యాచ్లలో హైదరాబాద్ విజయం సాధించింది. రాజస్థాన్ రాయల్స్ కేవలం 9 మ్యాచ్లలో విక్టరీ కొట్టింది. కానీ ప్రస్తుత ఫామ్ ప్రకారం రాజస్థాన్ రాయల్స్ ను ఓడించడం  SRHకు   చాలా కష్టమని అంటున్నారు క్రీడా విశ్లేషకులు.

హైదరాబాద్ పై డబుల్ సెంచరీ చేయడం గ్యారంటీ

హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య ఇవాళ సాయంత్రం మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో వైభవ్ సూర్య వంశీ బ్యాటింగ్ పై ఇంజమామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముంబై ఇండియన్స్ అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లాంటి బలమైన బౌలింగ్ దళం ఉన్న జట్లపైన వైభవ్ సూర్య వంశీ అదరగొట్టినట్లు గుర్తు చేశారు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో తోపు బౌలర్లు ఎవరూ లేరు.. అలాంటి హైదరాబాద్ పైన వైభవ్ డబుల్ సెంచరీ చేయడం గ్యారంటీ అని హెచ్చరించారు. ఫస్ట్ బ్యాటింగ్ రాజస్థాన్ రాయల్స్ చేస్తే మాత్రం వైభవ్ సూర్య వంశీని ఆపడం ఎవరి తరం కాదని తెలిపారు. ఉప్పల్ స్టేడియంలో కొడితే తుప్పల్లో బంతులు పడతాయని డేంజర్ బెల్స్ పంపించారు. ఈ నేపథ్యంలో వైభవ్ సూర్య వంశీని త్వరగా ఔట్ చేయాలని ఇంజమామ్ కోరారు.

Advertisement

Also Read: ఐపీఎల్ నుంచి PSLలోకి రావ‌డానికి సిగ్గు అనిపించలేదా ? కుశాల్ మెండిస్ ప‌రువు తీసిన పాక్ రిపోర్ట‌ర్‌

 

 

Related News

ఉగ్రవాదుల టెన్షన్..21 ఏళ్ల తర్వాత పాకిస్తాన్‌లో అడుగుపెట్టిన ఇంగ్లాండ్

చిన్నస్వామిలో వర్షం పడాలని పోర్లు దండాలు పెట్టండి, లేకపోతే విండీస్ ఘోర ఓటమే!

విరాట్ కోహ్లీ నాలాగే ఉంటాడు కానీ, పెద్ద అంద‌గాడు కాదు !

వాళ్లంద‌రితో జై హిందూ అనిపించండి, ష‌మీ కామెంట్స్ వైర‌ల్ !

టీమిండియాకు ఏది చేత‌కాదు, ఇప్ప‌టికే విండీస్ సిరీస్ గెలిచింది, ట్రోఫీ ఇచ్చేయండి

టీమిండియా రూ.250 కోట్లు దొబ్బుకుపోతే, మాకు ఒక్క రూపాయి ఇవ్వ‌డం లేదు

నోటికి ప్లాస్ట‌ర్ వేసి, 15వ అంతస్తు నుంచి కిందకు వేలాడదీశారు!

విడాకులు త‌ర్వాత ప‌చ్చి తాగుబోతున‌య్యా..ధ‌న శ్రీపై యుజ్వేంద్ర చాహల్ సంచ‌ల‌నం !

Big Stories

Advertisement
×