E-Paper
Advertisement

శాంసంగ్ నుంచి ఏఐ ఏసీ.. ఫ్యూజులు ఎగిరే ఫీచర్లు.. ఇంటిని హిమాలయాలు చేసేయెుచ్చు!

శాంసంగ్ నుంచి ఏఐ ఏసీ.. ఫ్యూజులు ఎగిరే ఫీచర్లు.. ఇంటిని హిమాలయాలు చేసేయెుచ్చు!
Advertisement

Samsung AC: కొరియన్ టెక్ దిగ్గజం శాంసంగ్ కు ఎలక్ట్రానిక్ పరికరాల రంగంలో మంచి గుడ్ విల్ ఉంది. భారత్ లోనూ శాంసంగ్ ప్రొడక్ట్ ను అమితంగా ఇష్టపడేవారు చాలా మందే ఉన్నారు. అయితే దేశంలో వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని శాంసంగ్ ఒక అద్భుతమైన స్మార్ట్ ఏఐ ఏసీని మార్కెట్లోకి తీసుకొచ్చింది. తన అత్యాధునిక బెస్పోక్ ఏఐ విండ్ ఫ్రీ (Bespoke AI WindFree) ఎయిర్ కండీషనర్ల శ్రేణిని విడుదల చేసింది. ఈ సమ్మర్ లో బెస్ట్ అడ్వాన్స్డ్ ఏసీగా టెక్ నిపుణులు వీటిని కొనియాడుతున్నారు. ఇంతకీ ఈ శాంసంగ్ ఏసీలోని ప్రధాన ఫీచర్లు ఏంటో ఇప్పుడు పరిశీలిద్దాం.

ఏఐ ఎనర్జీ మోడ్..

ఈ నయా శాంసంగ్ ఏసీలో ప్రత్యేకమైన ఫీచర్ గా దీనిని చెప్పవచ్చు. ఏఐ ఎనర్జీ మోడ్ ద్వారా.. వినియోగదారులు తమ విద్యుత్ వినియోగాన్ని 30% వరకు ఆదా చేసుకోవచ్చు. ఇది ఇంటి సభ్యుల ఏసీ యూజింగ్ అలవాట్లను విశ్లేషించి దానికి అనుగుణంగా దానంతట అదే కూలింగ్‌ను అడ్జస్ట్ చేస్తుంది.

విండ్ ఫ్రీ టెక్నాలజీ

Advertisement

దీనిలో మరో ప్రత్యేకతగా విండ్ ఫ్రీ టెక్నాలజీ గురించి చెప్పవచ్చు. ఇది గాలి నేరుగా వ్యక్తి శరీరంపై పడకుండా.. వేల సంఖ్యలో ఉండే మైక్రో హోల్స్ ద్వారా గది అంతటా చల్లదనాన్ని సమానంగా పంపిణీ చేస్తుంది. దీనివల్ల ‘కోల్డ్ డ్రాఫ్ట్స్’ సమస్య ఉండదు.

కూలింగ్ అడ్జస్టమెంట్స్

గదిలోని ఉష్ణోగ్రత, తేమతో పాటు బయట వాతావరణ పరిస్థితులను బట్టి ఏసీ దానంతట అదే తగిన మోడ్ ను ఎంచుకుంటుంది. తద్వారా ఇంటి సభ్యులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని గది లోపల కల్పిస్తుందని శాంసంగ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లు..

Advertisement

శాంసంగ్ కు చెందిన స్మార్ట్ థింగ్స్ యాప్ ను ఉపయోగించి.. ఫోన్ ద్వారానే ఈ ఏసీని కంట్రోల్ చేయవచ్చు. అంతేకాకుండా గెలాక్సీ వాచ్ వంటి వేరబుల్ డివైజ్‌లతో కనెక్ట్ అయ్యి మీ నిద్ర నాణ్యతను బట్టి ఉష్ణోగ్రతను మార్చుకునే సదుపాయం ఇందులో కల్పించారు.

Also Read: జియో యూజర్లకు గుడ్ న్యూస్.. 84 రోజుల వ్యాలిడిటీతో వచ్చిన.. చౌకైన రీఛార్జ్ ప్లాన్స్ ఇవే!

ధర ఎంతంటే?

శాంసంగ్ ఈ బెస్పోక్ ఏఐ విండ్‌ఫ్రీ ఏసీల ప్రారంభ ధరను రూ.32,490గా నిర్ణయించింది. ఇందులో ప్రీమియం మోడల్ ను రూ.66,990కు సేల్ చేస్తుండటం గమనార్హం. ఈ బెస్పోక్ ఏఐ ఏసీలు.. ప్రముఖ రిటైల్ స్టోర్లతో పాటు శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ లో అందుబాటులో ఉన్నాయి.

Also Read: AC Water Tips: ఏసీ నీటిని వృథా చేస్తున్నారా? పెద్ద తప్పు చేస్తున్నట్లే.. ఈ లాభాలన్నీ మిస్ అవుతారు!

Related News

వాల్ క్లాక్ ఆగిపోయిందని పారేస్తున్నారా? ఈ చిన్న పని చేస్తే.. మళ్ళీ నడుస్తుంది!

ప్రొడక్ట్ బాగోలేదని టెన్షన్ పడుతున్నారా? రిటర్న్ చేయకుండానే ఫుల్ రీఫండ్

ఆన్‌లైన్ షాపింగ్‌ చేసే..99 % మందికి తెలియని విషయాలు!

ఇంట్లోనే థియేటర్ కిక్..అదుర్స్ అనిపించే 55-ఇంచుల టీవీలు!

ఈ వాక్యూమ్ క్లీనర్స్‌తో ఎలాంటి మరకలైనా..క్షణాల్లోనే మాయం

పాత ఫోన్ వేస్ట్ అనుకుంటే పొరపాటే..ఇలా వాడితే ఎన్నో లాభాలు!

పాన్ కార్డ్ ఫోటో లేదా సిగ్నేచర్ మార్చుకోవాలా?

యూపీఐ పేమెంట్స్ చేసేటప్పుడు..ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Big Stories

Advertisement
×