Samsung 43 Inch 4K Smart TV Offer: ఇంట్లో ఒక మంచి బ్రాండెడ్ స్మార్ట్ టీవీ ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ముఖ్యంగా.. శాంసంగ్ లాంటి టాప్ బ్రాండ్ నుంచి..అదిరిపోయే ఫీచర్లు ఉన్న టీవీ దొరికితే అస్సలు వదులుకోకూడదు. ప్రస్తుతం శాంసంగ్ క్రిస్టల్ 4K ఇన్ఫినిటీ విజన్ 43 ఇంచ్ (108 cm) అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ టీవీపై ఫ్లిప్‌కార్ట్‌లో మైండ్ బ్లోయింగ్ ఆఫర్ నడుస్తోంది. ఏకంగా 31 శాతం ఫ్లాట్ డిస్కౌంట్‌తో పాటు అదనపు ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ క్రేజీ టీవీ ఫీచర్లు , ఆఫర్ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
ధర , డిస్కౌంట్ వివరాలు:
సాధారణంగా మార్కెట్లో ఈ శాంసంగ్ క్రిస్టల్ 4K స్మార్ట్ టీవీ అసలు ధర రూ.41,300 గా ఉంది. కానీ ప్రస్తుత ‘హాట్ డీల్’ఆఫర్‌లో భాగంగా దీనిపై 31% భారీ డిస్కౌంట్ ఇస్తున్నారు.
ఆఫర్ ధర: డిస్కౌంట్ పోను ఈ టీవీని మీరు కేవలం రూ.28,490 కే సొంతం చేసుకోవచ్చు.
ఎక్స్ఛేంజ్ ఆఫర్: మీ పాత టీవీని మార్చుకోవాలనుకుంటే.. దీనిపై అదనంగా మరో రూ.3,720 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది. అంటే మీ పాత టీవీ కండిషన్‌ను బట్టి ఈ స్మార్ట్ టీవీని ఇంకా తక్కువ ధరకే ఇంటికి తీసుకెళ్లవచ్చు.
ఫీచర్లు:
క్రిస్టల్ 4K డిస్‌ప్లే & ఇన్ఫినిటీ విజన్ :
ఈ టీవీ మోడల్ ఐడీ UA43UE84AFULXL. ఇది 2025 లాంచ్ మోడల్ అయినప్పటికీ.. ఇప్పటికీ మార్కెట్లో బెస్ట్ సెల్లర్‌గా దూసుకుపోతోంది.
అల్ట్రా హెచ్‌డీ (4K) రిజల్యూషన్: నార్మల్ హెచ్‌డీ టీవీలతో పోలిస్తే.. ఇందులో పిక్చర్ క్వాలిటీ 4 రెట్లు అద్భుతంగా ఉంటుంది. ప్రతీ సీన్ చాలా క్లియర్ గా, రియలిస్టిక్‌గా కనిపిస్తుంది.
4K అప్‌స్కేలింగ్ : ఈ ఫీచర్ చాలా స్పెషల్. మీరు చూసే పాత సినిమాలు లేదా తక్కువ క్వాలిటీ వీడియోలను కూడా ఈ టీవీ తన ఇంటెలిజెంట్ టెక్నాలజీతో 4K క్వాలిటీకి దగ్గరగా మార్చి చూపిస్తుంది.
ఇన్ఫినిటీ విజన్: బెజెల్స్ (స్క్రీన్ చుట్టూ ఉండే అంచులు) చాలా సన్నగా ఉండటం వల్ల డిస్‌ప్లే పెద్దదిగా, లగ్జరీగా కనిపిస్తుంది.
టైజెన్ ఓఎస్ & స్మార్ట్ ఫీచర్స్ :
ఇది శాంసంగ్ సొంత ఆపరేటింగ్ సిస్టమ్ అయిన టైజెన్ పై పనిచేస్తుంది. ఇది చాలా స్మూత్‌గా, ఎలాంటి లాగ్ లేకుండా రన్ అవుతుంది.
ఓటీటీ యాప్స్ సపోర్ట్: నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, యూట్యూబ్ వంటి అన్ని రకాల పాపులర్ యాప్స్ ఇందులో ఇన్‌బిల్ట్‌గా వస్తాయి.
సౌండ్ అవుట్‌పుట్: ఇందులో 20 W పవర్‌ఫుల్ సౌండ్ అవుట్‌పుట్ ఉంది. ఇది ఇంటి లోపల థియేటర్ లాంటి సౌండ్ ఎఫెక్ట్‌ను ఇస్తుంది.
Also Read: ఊహించని ధరల్లోనే.. డబుల్ డోర్ ఫ్రిజ్‌లు, ఇంకెందుకు ఆలస్యం
కస్టమర్ రేటింగ్స్ ,నమ్మకం:
ఆన్‌లైన్‌లో ఈ టీవీకి కస్టమర్ల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఏకంగా 77,103 మంది రేటింగ్స్ ఇవ్వగా.. 5,082 రివ్యూలతో 4.3 స్టార్ రేటింగ్‌ను సొంతం చేసుకుంది. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఈ టీవీ పర్ఫార్మెన్స్ ఎంత బాగుందో.
2 సంవత్సరాల వారంటీ :
సాధారణంగా చాలా కంపెనీలు కేవలం 1 సంవత్సరం వారంటీ మాత్రమే ఇస్తాయి. కానీ శాంసంగ్ ఈ టీవీపై 2 ఏళ్ల వారంటీ అందిస్తోంది. 1 ఏడాది స్టాండర్డ్ వారంటీ ఉంటుంది. మరో 1 సంవత్సరం అదనంగా టీవీ ప్యానల్ పై వారంటీ లభిస్తుంది. దీనివల్ల డిస్‌ప్లే పరంగా ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.
రూ.30 వేల లోపు బడ్జెట్‌లో ఒక నమ్మకమైన బ్రాండ్, లగ్జరీ లుక్, 4K క్లారిటీ, మంచి వారంటీ ఉన్న స్మార్ట్ టీవీ కావాలనుకుంటే.. శాంసంగ్ క్రిస్టల్ 4K ఇన్ఫినిటీ విజన్ (43 ఇంచ్) టీవీ ఒక పర్ఫెక్ట్ ఆప్షన్. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఆఫర్ కొన్ని రోజులు మాత్రమే అందుబాటులో ఉండొచ్చు. కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే చెక్ చేయండి.