Best Double Door Fridge 2026: ఇంట్లో వస్తువులు కొనేటప్పుడు లుక్ ఎంత ముఖ్యమో, అది ఎన్ని రోజులు పాడవకుండా ఉంటుంది అనేది కూడా అంతే ముఖ్యం. ముఖ్యంగా ఫ్రిజ్ విషయానికి వస్తే.. ఇప్పుడు అందరి ఛాయిస్ ‘స్టెయిన్‌లెస్ స్టీల్ డబుల్ డోర్ ఫ్రిజ్’. ఇవి చూడటానికి చాలా ప్రీమియంగా ఉండటమే కాకుండా.. తుప్పు పట్టకుండా లైఫ్ లాంగ్ వస్తాయి. మరి మీ బడ్జెట్‌కు తగ్గట్టు, స్మార్ట్ ఫీచర్లు ఉండి, కరెంట్ బిల్లును అదుపులో ఉంచే 5 టాప్-రేటెడ్ డబుల్ డోర్ ఫ్రిజ్ మోడల్స్ ఏంటో, వాటి ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందామా..
బెస్ట్ ఆప్షన్స్ 5 డబుల్ డోర్ ఫ్రిజ్‌లు:
1. శామ్‌సంగ్ స్మార్ట్ వై-ఫై డబుల్ డోర్ ఫ్రిజ్ (Samsung 467L 3-Star Smart Wi-Fi Refrigerator):
పెద్ద కుటుంబాలకు ఈ ఫ్రిజ్ ఒక వరం అని చెప్పాలి. 467 లీటర్ల కెపాసిటీతో వచ్చే ఈ మోడల్ కేవలం ఫ్రిజ్ మాత్రమే కాదు, ఒక స్మార్ట్ డివైజ్.
ప్రత్యేకత: దీంట్లో వై-ఫై కనెక్టివిటీ ఉంది. అంటే మీరు ఆఫీస్ లో.. ఉన్నా సరే ఫోన్ ద్వారా ఫ్రిజ్ టెంపరేచర్‌ని కంట్రోల్ చేయొచ్చు.
ట్విన్ కూలింగ్ ప్లస్: ఫ్రీజర్ లోని వాసన కింద ఉన్న వెజిటబుల్ బాక్స్‌కు రాకుండా.. రెండింటికీ విడివిడిగా కూలింగ్ అందిస్తుంది. దీని స్టెయిన్‌లెస్ స్టీల్ ఫినిషింగ్ కిచెన్‌కు రిచ్ లుక్ ఇస్తుంది.
2. ఎల్‌జీ కన్వర్టిబుల్ డబుల్ డోర్ ఫ్రిజ్ (LG 343L 3-Star Convertible Refrigerator):
ఇండియాలో నమ్మకానికి మరో పేరు ఎల్‌జీ. మీడియం సైజ్ ఫ్యామిలీస్ కోసం ఈ 343 లీటర్ల ఫ్రిజ్ పర్ఫెక్ట్‌గా సరి పోతుంది.
కన్వర్టిబుల్ ఫీచర్: ఇంట్లో పండగలు లేదా ఫంక్షన్లు ఉన్నప్పుడు ఫ్రీజర్‌లో.. సామాన్లు ఎక్కువైతే, ఆ ఫ్రీజర్‌ను కూడా నార్మల్ ఫ్రిజ్‌గా మార్చుకోవచ్చు.
డోర్ కూలింగ్: ఫ్రిజ్ లోపల మాత్రమే కాకుండా.. డోర్ సైడ్ ఉన్న బాటిల్స్ కి కూడా సమానంగా కూలింగ్ అందుతుంది. దీని షైనీ స్టీల్ బాడీపై గీతలు అంత త్వరగా పడవు.
3. వర్ల్‌పూల్ ఇంటెలిఫ్రెష్ ప్రో బాటమ్ మౌంట్ (Whirlpool Intellifresh Pro 312L 3-Star):
చాలా మందికి ఫ్రిజ్ కింద ఉన్న వెజిటబుల్ బాక్స్ లోంచి కూరగాయలు తీయడానికి పదే పదే వంగడం కష్టంగా ఉంటుంది. అలాంటి వారి కోసమే ఈ బాటమ్ మౌంట్ ఫ్రిజ్.
డిజైన్: దీంట్లో ఫ్రీజర్ కింద ఉంటుంది. మనం రోజూ వాడే ఫ్రిజ్ భాగం పైకి ఉంటుంది. కాబట్టి వంగాల్సిన అవసరం అస్సలు ఉండదు.
6th సెన్స్ టెక్నాలజీ: లోపల ఉన్న ఆహార పదార్థాల బరువును.. బట్టి ఇది కూలింగ్‌ను ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేస్తుంది. దీని వల్ల కరెంట్ చాలా ఆదా అవుతుంది.
4. పానాసోనిక్ టీజీ సిరీస్ (Panasonic 292L 3-Star Convertible Refrigerator):
తక్కువ బడ్జెట్‌లో బ్రాండెడ్ ఫ్రిజ్, అదీ మోడ్రన్ ఫీచర్లతో కావాలనుకునే వారికి పానాసోనిక్ బెస్ట్ ఆప్షన్.
సరౌండ్ కూలింగ్: గాలి ఫ్రిజ్ లోపల అన్ని మూలలకూ సమానంగా సర్క్యులేట్ అవుతుంది. దీని వల్ల ఆకుకూరలు, పండ్లు వారం రోజులైనా సరే అప్పుడే తోట నుంచి తెచ్చినట్లు ఫ్రెష్‌గా ఉంటాయి.
ఇన్వర్టర్ కంప్రెషర్: ఇది చాలా నిశ్శబ్దంగా పనిచేస్తుంది. కరెంట్ ఒడిదుడుకులు ఉన్నా స్టెబిలైజర్ లేకుండానే నడుస్తుంది.
Also Read: నీళ్లు లేకుండా కూలర్ వాడితే మోటార్ కాలిపోతుందా? అసలు నిజం ఇదే!
5. గోద్రెజ్ ఈన్ ఫ్రాస్ట్ ఫ్రీ (Godrej Eon 260L 2 Star Refrigerator):
చిన్న కుటుంబాలకు లేదా బ్యాచిలర్స్‌కు 260 లీటర్ల కెపాసిటీ ఉన్న ఈ గోద్రెజ్ ఫ్రిజ్ చాలా బాగా సెట్ అవుతుంది.
బడ్జెట్ ఫ్రెండ్లీ: తక్కువ ధరలో.. మంచి స్టెయిన్‌లెస్ స్టీల్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది.
మల్టీ ఇన్వర్టర్ టెక్నాలజీ: ఇది కంప్రెషర్ లైఫ్‌ను పెంచడమే కాకుండా.. తక్కువ పవర్ తీసుకుంటుంది. లోపల టఫ్ అండ్ గ్లాస్ షెల్వ్స్ ఉండటం వల్ల బరువైన గిన్నెలు పెట్టినా తట్టుకుంటుంది.
ఈ రోజుల్లో ఫ్రిజ్ అంటే కేవలం నీళ్లు చల్లబరిచే మిషన్ మాత్రమే కాదు, ఇంటి అందాన్ని పెంచే ఒక అలంకరణ కూడా. పైన చెప్పుకున్న శామ్‌సంగ్, ఎల్‌జీ, వర్ల్‌పూల్ వంటి మోడల్స్ అన్నీ కూడా స్టెయిన్‌లెస్ స్టీల్ బాడీతో వస్తున్నాయి. మీ కుటుంబ సభ్యుల సంఖ్య , మీ బడ్జెట్‌ను బట్టి ఇందులో మీకు నచ్చిన బెస్ట్ స్మార్ట్ డబుల్ డోర్ ఫ్రిజ్‌ను ఎంచుకుని మీ ఇంటికి తెచ్చేసుకోండి.