E-Paper
Advertisement

ఒక్కసారి ఈ ఫోన్ ఫీచర్లు చూశాక వేరేది కొనరు.. Galaxy A27తో శాంసంగ్ మాస్టర్ ప్లాన్, ఫుల్ డీటెయిల్స్ ఇవే!

ఒక్కసారి ఈ ఫోన్ ఫీచర్లు చూశాక వేరేది కొనరు.. Galaxy A27తో శాంసంగ్ మాస్టర్ ప్లాన్, ఫుల్ డీటెయిల్స్ ఇవే!
Advertisement

Samsung Galaxy A27 5G: టెక్ దిగ్గజం శాంసంగ్ నుంచి మరో బడ్జెట్ 5G ఫోన్ త్వరలోనే మార్కెట్‌లోకి అడుగు పెట్టనుంది. తమ పాపులర్ Galaxy A సిరీస్‌లో మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మన తెచ్చేందుకు ఫుల్ స్పీడ్‌తో రెడీ అవుతోంది. అదే Galaxy A27 5G. తాజాగా ఈ ఫోన్ గీక్‌బెంచ్ వెబ్‌సైట్‌లో మరోసారి దర్శనమిచ్చింది. అయితే ఈసారి మునుపటి కంటే క్రేజీ స్కోర్లతో టెక్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. గతేడాది వచ్చిన Galaxy A26 కంటే దీనిలో చాలా పవర్‌ఫుల్ అప్‌డేట్స్ ఉండబోతున్నాయని తాజా రిపోర్ట్స్ చూస్తుంటే అర్థమవుతోంది.

రికార్డ్ బ్రేక్ చేసిన శాంసంగ్..

గీక్‌బెంచ్ టెస్టుల్లో ఈ ఫోన్ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది. గతంలో ఈ ఫోన్‌కు వచ్చిన స్కోర్ల కంటే ఇప్పుడు వచ్చిన నెంబర్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. సింగిల్ కోర్ టెస్టులో 994 పాయింట్లు, మల్టీకోర్ టెస్టులో 2,985 పాయింట్లు సాధించి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దీనికి అర్థం.. ఈ ఫోన్ వాడేటప్పుడు చాలా స్మూత్‌గా ఉంటుందని, అస్సలు హ్యాంగ్ అవ్వదని శాంసంగ్ హింట్ ఇస్తోంది. సాఫ్ట్‌వేర్ పరంగా కంపెనీ ఈ ఫోన్‌ను బాగా ట్యూన్ చేసినట్లు కనిపిస్తోంది.

Advertisement

Also Read: భారత్‌లోకి వచ్చేసిన Vivo X300 FE .. ఐదేళ్ల అప్‌డేట్స్, 100x జూమ్ కెమెరా.. ఐఫోన్, శాంసంగ్‌లకు చుక్కలే!

పవర్‌ఫుల్ చిప్‌సెట్..

Galaxy A27 5G స్పీడ్‌కు కారణం దీనిలో వాడిన స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 చిప్‌సెట్. ఇది 8 కోర్ల ప్రాసెసర్‌తో వస్తోంది. దీంతో గేమ్స్ ఆడినా, మల్టీ టాస్కింగ్ చేసినా ఫోన్ చాలా స్పీడ్‌గా పనిచేస్తుంది. మరో విశేషం ఏమిటంటే.. ఈ ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 వెర్షన్‌తో రాబోతోంది. అలాగే దీనిలో 6GB RAM ఆప్షన్ ఉండబోతోంది. అయితే కొంచెం ఎక్కువ బడ్జెట్‌లో కావాలనుకుంటున్న కోసం 8GB వేరియంట్‌ను కూడా కంపెనీ లాంచ్ చేసే ఛాన్స్ ఉంది.

అద్భుతమైన కెమెరా సెటప్..

Advertisement

ఈ ఫోన్ స్క్రీన్ విషయానికొస్తే.. 6.7 అంగుళాల పెద్ద డిస్‌ప్లేను అందించారు. తద్వారా వీడియోలు చూసినా, సినిమాలు చూసినా మంచి ఫీల్ వస్తుంది. ఇక కెమెరా లవర్స్ కోసం వెనుకవైపు మూడు కెమెరాలను సెట్ చేశారు. 50MP మెయిన్ కెమెరాతో పాటు, అదిరిపోయే ల్యాండ్‌స్కేప్ ఫొటోల కోసం 8MP అల్ట్రా వైడ్ కెమెరా, మరో కెమెరాలో 2MP మాక్రో లెన్స్‌ను అమర్చారు. ఇక సెల్ఫీల కోసం 12MP ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు.

ధర ఎంత ఉండొచ్చు?

శాంసంగ్ ఇంకా లాంచ్ డేట్ అనౌన్స్ చేయలేదు కానీ, ఇప్పటికే బ్రెజిల్ వెబ్‌సైట్‌లో ఈ ఫోన్ పేరు కనిపించడంతో అతి త్వరలోనే మార్కెట్లోకి వచ్చేస్తుందని ఫిక్స్ అయిపోవచ్చు. గతేడాది Galaxy A26 దాదాపు రూ.25 వేల రేంజ్‌లో లాంచ్ అయ్యింది. కాబట్టి.. ఈ కొత్త A27 5G కూడా అదే బడ్జెట్‌లో లేదా కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు. శాంసంగ్ వాలెట్ వంటి స్మార్ట్ ఫీచర్లు కూడా దీనిలో ఉండటంతో, మధ్యతరగతి యూజర్లకు ఇదొక బెస్ట్ బడ్జెట్ ఫోన్ అవుతుంది.

Also Read: Honor Play 80 Plus విడుదలైంది రోయ్.. 7,500mAh బ్యాటరీ, ఆండ్రాయిడ్ 16.. ఫుల్ డీటెయిల్స్ మీ కోసం!

Related News

ఇంట్లో Wi-Fi డెడ్ జోన్స్‌కు సింపుల్ సొల్యూషన్.. పాత ఆండ్రాయిడ్ ఫోన్‌తో ఇలా చేయండి!

వాషింగ్ మెషీన్‌ను ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేయాలి? ఈ విషయం తెలుసా?

AIతో పెరుగుతున్న సైబర్ మోసాలు.. మీ డబ్బు, వ్యక్తిగత సమాచారాన్ని కాపాడుకోండిలా!

BSNL కనివిని ఎరుగని ప్లాన్స్.. రోజుకు రూ.5 మాత్రమే.. 80 రోజులపాటు మీ ఇష్టం!

కొత్త 5G ఫోన్‌తో ఫిలిప్స్ రీ-ఎంట్రీ.. సెప్టెంబర్ 2న ఏం లాంచ్ చేయనుందంటే?

బ్యాటరీ ఎక్కువకాలం మన్నాలంటే 80-20 రూల్ పాటించాల్సిందేనా?

ఒకప్పుడు ఇవే స్టేటస్ సింబల్.. 90లలో ఫేమస్ అయిన 5 ఫోన్లు ఇవే!

మ్యాక్‌లో సిస్టమ్ స్టోరేజ్ పెరిగిపోయిందా? ఈ సింపుల్ ప్రాసెస్ ద్వారా ఖాళీ చేసి స్పీడ్ పెంచండి!

Big Stories

Advertisement
×