E-Paper
Advertisement

రూ. 23,437 కోట్ల రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఏపీ, తెలంగాణకు గుడ్ న్యూస్!

రూ. 23,437 కోట్ల రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..  ఏపీ, తెలంగాణకు గుడ్ న్యూస్!
Advertisement

Railway Network Expansion Across 6 States: దేశంలో రైల్వే మౌలిక వసతులను మరింత బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం రూ. 23,437 కోట్ల వ్యయంతో మూడు పెద్ద రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల ద్వారా భారతీయ రైల్వే నెట్‌ వర్క్‌కు సుమారు 900 కిలోమీటర్ల అదనపు లైన్లు యాడ్ కానున్నాయి. రద్దీ తగ్గించడం, రైళ్ల రాకపోకలను వేగవంతం చేయడం, సరుకు రవాణాను మెరుగుపరచమే లక్ష్యంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక వివరాలు వెల్లడించారు. ప్రస్తుతం కొన్ని ప్రధాన రైల్వే మార్గాల్లో భారీ రద్దీ కొనసాగుతోంది. దీనివల్ల ప్యాసింజర్, గూడ్స్ రైళ్ల రాకపోకల్లో ఆలస్యం జరుగుతోంది. ఈ సమస్యలను తగ్గించేందుకు మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

కొత్తగా ఆమోదం పొందిన ప్రాజెక్టులు ఇవే!

తాజాగా కేంద్రం ఆమోదం పొందిన ప్రాజెక్టుల్లో నాగ్దా–మధుర, గుంతకల్–వాడి, బుర్హ్వాల్–సీతాపూర్ మార్గాల్లో మూడవ,  నాల్గవ రైల్వే లైన్లను నిర్మించనున్నారు. ఈ మూడు ప్రాజెక్టులు పూర్తయితే రైల్వే నెట్‌ వర్క్ సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టులు ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్‌లో భాగంగా అమలు చేయబడుతున్నాయి. రోడ్డు, రైలు, ఇతర రవాణా వ్యవస్థల మధ్య మెరుగైన అనుసంధానం కల్పించడం ఈ ప్రణాళిక ముఖ్య ఉద్దేశం. దీని వల్ల సరుకు రవాణా మరింత వేగంగా జరిగే అవకాశం ఉంటుంది.

6 రాష్ట్రాల్లో ఈ ప్రాజెక్టు పనులు

Advertisement

మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని 19 జిల్లాల్లో ఈ ప్రాజెక్టులు అమలు కానున్నాయి. మొత్తం 4,161 గ్రామాలకు ఈ ప్రాజెక్టుల వల్ల ప్రయోజనం కలుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దాదాపు 83 లక్షల మంది ప్రజలు ఈ అభివృద్ధి వల్ల లాభపడే అవకాశం ఉంది. ఈ విస్తరణలతో పర్యాటక రంగానికీ మేలు జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. మహాకాలేశ్వర ఆలయం, రణతంబోర్ నేషనల్ పార్క్, కియోలాడియో జాతీయ పార్క్, మధుర లాంటి ముఖ్య ప్రాంతాలకు రైలు కనెక్టివిటీ మరింత మెరుగుపడుతుంది. పర్యాటకుల ప్రయాణం సులభంగా మారే అవకాశం ఉంది.

సరకు రవాణాకు అత్యంత కీలకం

సరుకు రవాణా పరంగా కూడా ఈ ప్రాజెక్టులు కీలకంగా మారనున్నాయి. బొగ్గు, సిమెంట్, ఉక్కు, ఆహార ధాన్యాలు వంటి వస్తువుల రవాణా వేగవంతం అవుతుంది. ప్రభుత్వం అంచనా ప్రకారం, సంవత్సరానికి అదనంగా సుమారు 6 కోట్ల టన్నుల సరుకును రవాణా చేసే సామర్థ్యం ఏర్పడుతుంది. రైల్వే రవాణా పెరగడం వల్ల చమురు వినియోగం కూడా తగ్గుతుంది. దీని ద్వారా దేశానికి భారీగా ఇంధన దిగుమతి ఖర్చు ఆదా అవుతుంది. ప్రభుత్వం లెక్కల ప్రకారం, సుమారు 37 కోట్ల లీటర్ల చమురు వినియోగం తగ్గే అవకాశం ఉంది. అలాగే కర్బన ఉద్గారాలు కూడా గణనీయంగా తగ్గి పర్యావరణానికి మేలు కలగనుంది.

Advertisement

Read Also: ప్రపంచంలో తొలి లేడీస్ స్పెషల్ ట్రైన్.. స్ఫూర్తిదాయక ప్రయాణానికి 34 ఏళ్లు!

Related News

విదేశాల్లో పెళ్లిళ్లు వద్దంటూ పిలుపునిచ్చిన మోదీ.. ఇండియాలో సెలెబ్రిటీ వెడ్డింగ్ డెస్టినేషన్స్ ఇవే

అమరావతి ఓవైపు.. ఫ్యూచర్ సిటీ మరోవైపు.. దక్షిణ భారత ముఖచిత్రాన్ని మార్చబోతున్న రెండు మెగా నగరాలు!

రాత్రి 9 తర్వాత నో ఎంట్రీకి చెక్.. శ్రీశైలానికి 24/7 రూట్ క్లియర్!

కారు, మెట్రో కాదు.. ఇంటికి వెళ్లాలంటే నదిలో దూకాల్సిందే!

నేపాల్ వరదల్లో నమ్మశక్యం కాని ఘటనలు.. ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచిన 6 అద్భుతాలు..!

ఒకే బిల్డింగ్‌లో ఊరంతా.. ఈ వింత చూస్తే షాక్ అవ్వాల్సిందే!

గాల్లో తేలే పుస్తకాలు.. చుట్టూ అద్దాల మాయ.. ప్రపంచాన్ని అబ్బురపరుస్తున్న ఫ్యూచరిస్టిక్ లైబ్రరీ!

27 సార్లు గర్భం.. 69 మంది పిల్లలు.. ప్రపంచంలోనే ఎక్కువ మంది పిల్లల్ని కన్న తల్లి ఈమే!

Big Stories

Advertisement
×