E-Paper
Advertisement

Samsung Galaxy A35 Phone: రూ.1000కే గ్యాలక్సీ A35 మొబైల్ ఫోన్.. నెట్టింట వైరల్ అవుతోన్న ఆఫర్, నిజమేనా?

Samsung Galaxy A35 Phone: రూ.1000కే గ్యాలక్సీ A35 మొబైల్ ఫోన్.. నెట్టింట వైరల్ అవుతోన్న ఆఫర్, నిజమేనా?
Advertisement

Samsung Galaxy A35 Phone: క్రిస్మస్ సమయం దగ్గరపడుతుండటంతో దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫార్మ్స్ భారీ ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా శామ్‌సంగ్ మొబైల్స్‌పై ఈసారి 40 నుంచి 50 శాతం వరకు ఫ్లాట్ డిస్కౌంట్‌లను ప్రకటించింది. ఈ ఆఫర్ల హడావిడిలో శామ్‌సంగ్ గెలాక్సీ ఏ35 5జి మోడల్ ప్రధానంగా వార్తల్లో నిలుస్తోంది. కొన్ని డీల్స్‌లో ఈ ఫోన్ కేవలం రూ. 1,000కే లభిస్తుందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం సంచలనం సృష్టిస్తోంది.

నిజంగా రూ.1కే మొబైల్ వస్తుందా?

Advertisement

శామ్‌సంగ్ గెలాక్సీ ఏ35 యొక్క మార్కెట్ ధర సాధారణంగా 30 వేల రూపాయలకి పైగా ఉంటుంది. అయితే ప్రస్తుతం క్రిస్మస్ స్పెషల్ సేల్‌లో ఇది 18 వేల నుంచి 20 వేల మధ్య అందుబాటులోకి వచ్చింది. బ్యాంక్ క్యాష్‌బ్యాక్, ఎక్స్ చేంజ్ ఆఫర్స్ కలిపి ధర ఇంకాస్త తగ్గుతుందని సమాచారం. అయితే, దీని ఆధారంగానే “కేవలం రూ. 1,000 కి గెలాక్సీ ఏ35” అనే వార్త వైరల్ కావడంతో ప్రజలను కన్‌ఫ్యూజ్ చేసింది. నిజంగా ఎలా కొనాలి? ఏ సైట్‌లో ఈ ఆఫర్ వస్తుంది? అనే ప్రశ్నలు సోషల్ మీడియా అన్నీ సైట్లలో వెతకడం మొదలు పెట్టారు.

అప్‌డేటెడ్ లుక్‌ డిజైన్

Advertisement

శామ్‌సంగ్ గెలాక్సీ ఏ35 5జి యొక్క డిజైన్ దాని మిడ్-రేంజ్ సెగ్మెంట్‌లో అత్యంత ఆకర్షణీయంగా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ అప్‌డేటెడ్ లుక్‌తో వస్తుంది, ఇది వినియోగదారులకు చేతిలో పట్టుకున్నప్పుడు ఒక ప్రీమియమ్ అనుభూతినిస్తుంది. దీని మొత్తం బిల్డ్ క్వాలిటీ ఉన్నత స్థాయిలో ఉంది. ఈ డిజైన్ కొనుగోలుదారులకు స్టైలిష్, స్మార్ట్‌ఫోన్ అనుభవాన్ని అందిస్తోంది.

6.6 ఇంచుల సూపర్ అమోలేడ్ డిస్‌ప్లే

గెలాక్సీ ఏ35 ఫోన్ లో 6.6 ఇంచుల సూపర్ అమోలేడ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఇవ్వడంతో స్క్రీన్ అనుభవం ప్రీమియమ్ స్థాయిలో ఉంటుంది. అప్‌డేటెడ్ లుక్‌తో ఫోన్ డిజైన్ చేతిలో పట్టుకుంటే క్లాస్ ఫీల్ ఇస్తుంది. బిల్డ్ క్వాలిటీ, విజువల్ అవుట్‌పుట్ రెండూ అద్భుతంగా ఉంటాయని యూజర్లు చెబుతున్నారు.

Also Read: Best Mobiles Under 10000: రూ.10 వేల లోపు బెస్ట్ 5జి ఫోన్‌లు ఇవే.. బడ్జెట్ కింగ్‌ కోసం మార్కెట్‌లో భారీ డిమాండ్

50 మెగాపిక్సెల్ ప్రధాన లెన్స్ కెమెరా

కెమెరా విషయానికి వస్తే, 50 మెగాపిక్సెల్ ప్రధాన లెన్స్, 8ఎంపి అల్ట్రా వైడ్, 5ఎంపి మైక్రోతో ట్రిపుల్ సిస్టమ్ ఉంది. నైట్ ఫోటోగ్రఫీ, వీడియో రికార్డింగ్, సెల్ఫీ అన్నింటిలోనూ స్పష్టత వెరీ హైగా వస్తోంది. ముందుభాగంలో 13ఎంపి కెమెరా ఇవ్వడం వల్ల వీడియో కాల్స్, మీ సెల్ఫీ ఫోటోలను మరింత ప్రొఫెషనల్, క్లారిటీగా మార్చే ఒక ప్రత్యేక ఫోటోగ్రఫీ సపోర్ట్ ఉంచారు.

5000mAh సామర్థ్యం బ్యాటరీ

బ్యాటరీ విషయానికి వస్తే 5000mAh సామర్థ్యం ఉన్న పవర్ బ్యాటరీ ఒక్కసారి చార్జ్ పెడితే రోజంతా సులభంగా నడుస్తుంది. 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో తక్కువ సమయంలో పూర్తి చార్జ్ అవుతుంది. పనితీరు విషయంలో ఎక్సినోస్ 1380 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 14 ఆధారంగా వన్ యూఐ కలవడం వల్ల యూజ్ అనుభవం వేగంగా ఉంటుంది.

అసలు విషయానికి వస్తే.. రూ.1వేలకే వస్తుందా?

అయితే అసలు విషయానికి వస్తే, రూ.1 వేలకే దొరుకుతుందన్న ప్రచారం పూర్తి నిజం కాదు. ఇది సాధారణ ఆఫర్ కాదు. ఫ్లాష్ సేల్ లేదా లక్కీ డ్రా తరహాలో మాత్రమే వచ్చే ప్రోమోషనల్ డీల్. అందరికీ వర్తించదు. అంతేకాదు ఇలాంటి వార్తలపై ఆధారపడి ఫేక్ లింక్‌‌ను క్లిక్ చేస్తే స్కామ్‌కి గురయ్యే ప్రమాదం ఉంది. అందుకే అధికారిక ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ లేదా శామ్‌సంగ్ సైట్‌ని మాత్రమే నమ్మాలని నిపుణులు సూచిస్తున్నారు. కానీ రూ.1000కి దొరుకుతుందన్న నమ్మకం మాత్రం పెట్టుకోవద్దని వినియోగదారులకు హెచ్చరిక. నిజమైన ఆఫర్ గుర్తించగలిగితే, గెలాక్సీ ఏ35 మీ చేతిలోకి వచ్చే అవకాశం ఉంది. ఆ సందర్భంలో ఈ క్రిస్మస్ నిజంగా గోల్డన్ ఛాన్స్‌లా మారడం ఖాయం.

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×