E-Paper
Advertisement

The Raja Saab OTT : చరిత్రలో ఫస్ట్ టైం ఇలాంటి డీల్… రాజా సాబ్‌కు కోట్లు కోట్లు సెట్

The Raja Saab OTT : చరిత్రలో ఫస్ట్ టైం ఇలాంటి డీల్… రాజా సాబ్‌కు కోట్లు కోట్లు సెట్
Advertisement

The Raja Saab OTT : పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ సినిమా వస్తుంది అంటేనే సినిమా పట్ల భారీ స్థాయిలో అంచనాలు ఉంటాయి. ప్రభాస్(Prabhas) సినిమాలకు వచ్చే ఓపెనింగ్స్ ఏ ఇతర హీరోల సినిమాలకు కూడా రావనే చెప్పాలి. పాన్ ఇండియా స్థాయిలో ప్రభాస్ సినిమాలకు ఏ స్థాయిలో క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. త్వరలోనే ప్రభాస్ హీరోగా మారుతి (Maruthi)దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ హర్రర్ థ్రిల్లర్ ది రాజా సాబ్(The Raja Saab) సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది . ఈ సినిమాని సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 9 న విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించారు. అందుకు అనుగుణంగానే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు.

హాట్ స్టార్ చేతికి ది రాజా సాబ్..

ఇకపోతే గత రెండు రోజుల వరకు ఈ సినిమా డిజిటల్ హక్కులు కూడా అమ్ముడు పోలేదంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా సోషల్ మీడియా కథనాల ప్రకారం ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సమస్థ జియో హాట్ స్టార్ (Jio HotStar)కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను 140 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్టు సమాచారం. అయితే బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమాకు వచ్చే ఆదరణ బట్టి రాజాసాబ్ సినిమా డిజిటల్ హక్కుల ధరలు కూడా పెరుగుతాయని తెలుస్తుంది.

ఫస్ట్ టైం ప్రభాస్ సినిమాకు భారీ డీల్…

Advertisement

సాధారణంగా ఒక సినిమా ఓటీటీ డీల్ క్లోజ్ అయింది అంటే మొదట కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం నిర్మాతలకు డబ్బులు చెల్లిస్తారు. తరువాత ఆ సినిమాకు ఎన్ని వ్యూస్ వచ్చాయనే విషయంతో నిర్మాతలకు సంబంధం ఉండదు. అలా కాకుండా మరో విధంగా కూడా చిత్ర నిర్మాతలతో ఓటీటీ సంస్థలు డీల్ కుదుర్చుకునే ముందు వ్యూయర్ షిప్ లేదు అనుకుంటే వచ్చిన వ్యూస్ లోనే 20 లేదా 30% డబ్బులను నిర్మాతలకు ఇస్తారు. చిన్న సినిమాల విషయంలో ఇలాంటి పద్ధతిని అనుసరిస్తూ ఉంటారు కానీ రాజా సాబ్ సినిమాకు మాత్రం 140 కోట్ల రూపాయలతో భారీ డీల్ కుదుర్చుకోవడమే కాకుండా వచ్చిన వ్యూస్ లో కూడా షేర్ ఉంటుంది. ఇప్పటివరకు ఏ సినిమాకు లేనివిధంగా రాజా సాబ్ సినిమాకు ఇలాంటి డీల్ కుదుర్చుకోవటం విశేషం.

ప్రభాస్ కు జోడిగా ముగ్గురు…

Advertisement

ఇలా చరిత్రలోనే మొదటిసారి రాజా సాబ్ సినిమాకు ఇలాంటి డీల్ కుదరడంతో చిత్ర నిర్మాతలకు భారీ లాభాలు ఉంటాయని చెప్పాలి. ప్రభాస్ ఈ సినిమా విషయానికి వస్తే చాలా రోజుల తర్వాత ఇలాంటి కామెడీ హర్రర్ సినిమా ద్వారా ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదల చేసిన అప్డేట్స్ కూడా మంచి అంచనాలనే పెంచాయి. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రభాస్ లుక్స్ కూడా అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా రిద్ది కుమార్, నిధి అగర్వాల్, మాళవిక మోహన్ హీరోయిన్లుగా నటించబోతున్నారు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read: Kriti Sanon: ప్రభాస్ మాత్రమే సరైనోడు.. కృతి సనన్ కామెంట్స్ విన్నారా?

Related News

ఆకాశం నుంచి కురిసే యాసిడ్‌ వర్షం… ప్రాణాల కోసం పరుగులు…సైన్స్‌ ఫిక్షన్‌ డిజాస్టర్‌ థ్రిల్లర్‌

అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×