E-Paper
Advertisement

ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్.. ఊహించని విధంగా తగ్గిన Galaxy A36 5G ధర, ఇప్పుడే కొనేయండి!

ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్.. ఊహించని విధంగా తగ్గిన Galaxy A36 5G ధర, ఇప్పుడే కొనేయండి!
Advertisement

Flipkart Offers: ప్రముఖ టెక్ దిగ్గజం శాంసంగ్ బ్రాండ్‌లో ఒక మంచి మిడ్‌రేంజ్ ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే మీకొక సూపర్ ఛాన్స్. మొబైల్ మార్కెట్‌లో మంచి క్రేజ్ ఉన్న Samsung Galaxy A36 5G ధర ఇప్పుడు భారీగా తగ్గింది. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో నడుస్తున్న ప్రత్యేక తగ్గింపులు, బ్యాంక్ ఆఫర్ల వల్ల ఈ ఫోన్‌ను చాలా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. 50MP మెయిన్ కెమెరా, పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో వచ్చే ఈ ఫోన్‌పై ఆఫర్ల వివరాలు, దీని ప్రత్యేకతేలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ధర ఎంత తగ్గిందంటే?

Samsung Galaxy A36 5G (8GB RAM + 128GB స్టోరేజ్) వేరియంట్ గతేడాది మార్చిలో రూ.32,999 ధరకు లాంచ్ అయింది. కానీ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఇది కేవలం రూ.27,495 ధరకే లిస్ట్ అయింది. ఈ మొబైల్‌ను SBI క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే.. మరో రూ.1,375 అదనపు డిస్కౌంట్ పొందొచ్చు. దీంతో అన్ని ఆఫర్లు పోను ఈ ఫోన్‌ను రూ.26,120కే దక్కించుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే లాంచ్ ధర కంటే దాదాపు రూ.6,879 వరకు లాభం చేకూరుతుంది.

మెరుగైన పనితీరు:

Advertisement

ఈ ఫోన్ లుక్ అండ్ డిజైన్ చాలా ప్రీమియంగా ఉంటుంది. దీనిలో 120Hz రీఫ్రెష్ రేట్‌తో కూడిన 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను అందించారు. దీనివల్ల వీడియోలు చూడటం, గేమ్స్ ఆడటం చాలా స్మూత్‌గా సాగిపోతుంది. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. ఈ ఫోన్‌లో ఆక్టాకోర్ ఎగ్జినోస్ 1380 ప్రాసెసర్‌ను వాడారు. ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారిత వన్ యూఐ 7 సాఫ్ట్‌వేర్‌పై నడుస్తుంది. రోజువారి వాడకంతో పాటు మల్టీటాస్కింగ్ కూడా ఇందులో చాలా ఈజీగా చేసుకోవచ్చు.

Also Read: వాటర్ ప్రూఫ్, అడ్వాన్స్‌డ్ జీపీఎస్‌తో Amazfit కొత్త స్మార్ట్‌వాచ్‌లు లాంచ్.. ధర ఎంతంటే?

అదిరిపోయే పిక్చర్ క్వాలిటీ:

Advertisement

ఇక ఫొటోగ్రఫీ కోసం ఈ ఫోన్ వెనుక భాగంలో మూడు కెమెరాలు ఉన్నాయి. అందులో 50MP ప్రధాన కెమెరాతో పాటు, 8MP అల్ట్రావైడ్, 5MP మాక్రో కెమెరాలు ఉన్నాయి. ఇవి మంచి క్వాలిటీతో కూడిన ఫొటోలను అందిస్తాయి. ఇక సెల్ఫీల కోసం ముందు భాగంలో 12MP కెమెరాను ఇచ్చారు.

మరిన్ని ఫీచర్లు:

రోజంతా ఛార్జింగ్ టెన్షన్ లేకుండా ఉండటం కోసం ఈ Samsung Galaxy A36 5Gలో 5,000mAh బ్యాటరీని అమర్చారు. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. అలాగే దీనికి ఐపీ67 రేటింగ్ ఉంది కాబట్టి.. దుమ్ము, నీటి చినుకుల నుంచి రక్షణ లభిస్తుంది. బ్లూటూత్ 5.4, 5G కనెక్టివిటీ, ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ వంటి అన్ని లేటెస్ట్ ఫీచర్లు దీనిలో ఉన్నాయి.

Also Read: జియో బ్రాడ్‌బ్యాండ్ ధమాకా ఆఫర్.. ఒకసారి రీఛార్జ్ చేస్తే 13 నెలల పాటు నెట్, ఓటీటీలు ఫ్రీ!

Related News

ఇదేందయ్యా ఇది.. ఈ ఫ్రిడ్జ్‌లో మనుషులు కూర్చోవచ్చా? జపానోళ్లది బుర్రే బుర్ర!

లండన్ వేదికగా Samsung Galaxy Unpacked 2026.. ఈసారి ఏమేం రాబోతున్నాయంటే!

9,720mAh భారీ బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్.. షావోమీ కొత్త టాబ్లెట్ లీక్స్ రివీల్!

రూ.6 వేలకే ఇలాంటి హోమ్ థియేటరా.. భారత్‌లోకి పోర్ట్రానిక్స్ సరికొత్త సౌండ్ సిస్టమ్!

అమెజాన్‌లో ప్రత్యక్షమైన గూగుల్ సీక్రెట్ డివైజ్.. ఇండియా లాంచ్ డేట్ లీక్?

గూగుల్ కంటే ఏఐ సెర్చ్ వేగంగా పనిచేస్తుందా? ఏ సమయంలో ఏది వాడటం బెటర్?

Airtel యూజర్లకు గుడ్‌న్యూస్.. ఆ ప్రచారంలో నిజం లేదు.. క్లారిటీ ఇచ్చిన టెలికాం దిగ్గజం

కొత్త Air Purifier కొనేముందు తప్పక చూడాల్సిన 5 ముఖ్యమైన ఫీచర్లు ఇవే!

Big Stories

Advertisement
×