E-Paper
Advertisement

టాటా ఎలక్ట్రిక్ కార్లపై భారీ ఆఫర్లు.. హారియర్ EVకి రూ.2.75 లక్షల తగ్గింపు!

టాటా ఎలక్ట్రిక్ కార్లపై భారీ ఆఫర్లు.. హారియర్ EVకి రూ.2.75 లక్షల తగ్గింపు!
Advertisement

June 2026 Tata EV Discounts: జూన్ 2026లో టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వాహనాలపై భారీగా డిస్కౌంట్లు ప్రకటించింది. మోడల్‌ ను బట్టి గ్రీన్ బోనస్, ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ బెనిఫిట్స్, లాయల్టీ బోనస్‌ లు కలిపి గరిష్టంగా రూ.3.35 లక్షల వరకు తగ్గింపులు లభిస్తున్నాయి. ముఖ్యంగా కర్వ్ EV, హారియర్ EV, పంచ్ EV, టియాగో EV కొనుగోలుదారులు ఈ తగ్గింపులు పొందే అవకాశం ఉంటుంది.

⦿ టాటా కర్వ్ EV: రూ.3.35 లక్షలు

జూన్ లో ఎక్కువ బెనిఫిట్స్ టాటా కర్వ్ EVపై అందుబాటులో ఉన్నాయి. కొన్ని వేరియంట్లపై మొత్తం రూ.3.35 లక్షల వరకు ఆఫర్లు లభిస్తున్నాయి. ఇందులో గ్రీన్ బోనస్‌ తో పాటు ఎక్స్ఛేంజ్, స్క్రాపేజ్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. కర్వ్ EV మంచి పనితీరు, ఆకర్షణీయమైన డిజైన్, ఎక్కువ రేంజ్, లేటెస్ట్ ఫీచర్లతో మార్కెట్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

⦿ టాటా హారియర్ EV: రూ.2.75 లక్షలు

Advertisement

టాటా హారియర్ EV పై కూడా క్రేజీ ఆఫర్లు ప్రకటించారు. అన్ని వేరియంట్లపై కలిపి రూ.2.75 లక్షల వరకు తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ బెనిఫిట్, లాయల్టీ బోనస్‌తో పాటు ప్రత్యేక ఆఫర్లు కూడా ఉన్నాయి. హారియర్ EV మంచి పనితీరు, సౌకర్యవంతమైన డ్రైవింగ్ ఎక్స్ పీరియెన్స్, మంచి రోడ్ ప్రెజెన్స్‌ ఆకట్టుకుంటుంది.

⦿ టాటా పంచ్ EV: రూ.1.45 లక్షలు

టాటా పంచ్ EV కొనాలనుకునే వారికి కూడా మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. వేరియంట్‌ను బట్టి రూ.95,000 నుంచి రూ.1.45 లక్షల వరకు బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా లాంగ్ రేంజ్ వేరియంట్లపై ఎక్కువ డిస్కౌంట్లు అందిస్తున్నారు. పంచ్ EV నగర ప్రయాణాలకు అనువైన కాంపాక్ట్ SUVగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

⦿ టియాగో EV: రూ.1.45 లక్షలు

Advertisement

టియాగో EVపై కూడా భారీ తగ్గింపులు ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌ బ్యాక్‌ పై రూ.65,000 నుంచి రూ.1.45 లక్షల వరకు ఆఫర్లు లభిస్తున్నాయి. లాంగ్ రేంజ్ వేరియంట్లపై ఎక్కువ ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. సరసమైన ధరలో ఎలక్ట్రిక్ కారు కోరుకునే వారికి టియాగో EV ఇప్పటికీ మంచి ఆప్షన్ గా కొనసాగుతోంది.

⦿  టాటా నెక్సాన్ EV: రూ.50 వేలు

టాటా నెక్సాన్ EVపై కూడా చక్కటి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అన్ని వేరియంట్లపై గరిష్టంగా రూ.50,000 వరకు బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంది. ఇందులో గ్రీన్ బోనస్, ఎక్స్ఛేంజ్, స్క్రాపేజ్ బెనిఫిట్లు ఉన్నాయి. నెక్సాన్ EV లేటెస్ట్ ఇంటీరియర్, ఫీచర్లు, విశ్వసనీయత కారణంగా భారత EV మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

జూన్ 2026లో టాటా ఎలక్ట్రిక్ కార్లపై లభిస్తున్న ఈ ఆఫర్లు EV కార్లను  కొనుగోలు చేయాలనుకునే వారికి మంచి అవకాశంగా చెప్పొచ్చు. ముఖ్యంగా కర్వ్ EV, హారియర్ EVలపై ఉన్న భారీ డిస్కౌంట్లు వినియోగదారుల దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది. అయితే, ఈ ఆఫర్లు నగరాన్ని బట్టి మారే అవకాశం ఉంది.

Read Also: హ్యుందాయ్ కార్లపై భారీ ఆఫర్లు.. క్రెటాపై ఏకంగా రూ.1 లక్ష డిస్కౌంట్!

Related News

వర్షాకాలంలో ఇంట్లో EV ఛార్జింగ్ చేస్తున్నారా? ఈ ఒక్క తప్పు చేస్తే అగ్గికి బుగ్గి అవ్వడం పక్కా!

యమహా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లుక్ లీక్.. ఫీచర్లు చూస్తే షాక్ అవుతారు!

సిట్రోయెన్ మాస్టర్ స్ట్రోక్.. బసాల్ట్ ఎక్స్ కంఫర్ట్ ఎడిషన్ విడుదల!

అమ్మకాల్లో టాటా పంచ్ జోష్.. ఏకంగా 8 లక్షల మార్క్ క్రాస్!

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×