E-Paper
Advertisement

షాకింగ్ అప్డేట్.. వాట్సప్‌లో ఇక పెయిడ్ సర్వీస్, ఆ 6 ఫీచర్లు వాడాలంటే డబ్బులు కట్టాల్సిందే!

షాకింగ్ అప్డేట్.. వాట్సప్‌లో ఇక పెయిడ్ సర్వీస్, ఆ 6 ఫీచర్లు వాడాలంటే డబ్బులు కట్టాల్సిందే!
Advertisement

WhatsApp Plus: సాధారణంగా మనం మొదటి నుంచి ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్‌ను ఫ్రీగానే వాడుకుంటున్నాం. అయితే ఇప్పుడు వాట్సప్ నుంచి సరికొత్త అప్డేట్ ఒకటి వచ్చేసింది. అదే WhatsApp Plus. ఇదొక పెయిడ్ సర్వీస్ అన్నమాట. అంటే.. కొంత డబ్బు కట్టి సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే మరిన్ని కొత్త ఫీచర్లు వస్తాయి. ప్రస్తుతానికి ఇది కొంతమంది ఐఫోన్ యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ విషయంలో కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. డబ్బులు కట్టని వాళ్లకు పాత ఫీచర్లు ఎక్కడికీ పోవు. ఎప్పటిలాగే ఫ్రీగా మెసేజులు, కాల్స్ చేసుకోవచ్చు. ఇది కేవలం అదనపు ఫీచర్లు కావాలనుకునే వాళ్ల కోసం మాత్రమే.

యాప్ లుక్‌నే మార్చేయొచ్చు:

మనకు నచ్చిన రంగుల్లో యాప్ ఉంటే చూడటానికి బాగుంటుంది కదా? అందుకే వాట్సప్ ప్లస్ తీసుకున్న వాళ్లకు 18 రకాల రంగులను (యాక్సెంట్ కలర్స్) పరిచయం చేశారు. రాయల్ పర్పుల్, ఫారెస్ట్ గ్రీన్ లాంటి వెరైటీ కలర్స్‌ను మీరు సెట్ చేసుకోవచ్చు. అంతేకాదు.. ఫోన్ స్క్రీన్ మీద కనిపించే వాట్సప్ ఐకాన్‌ను కూడా 14 రకాల డిజైన్లలో మనకు నచ్చినట్టు మార్చుకోవచ్చు. దీంతో మన వాట్సప్ ఇతరుల వాట్సప్ కంటే చాలా డిఫరెంట్‌గా, స్టైలిష్‌గా కనిపిస్తుందన్నమాట.

స్టిక్కర్లు, రింగ్‌టోన్లతో కొత్త అనుభూతి:

Advertisement

చాటింగ్‌లో స్టిక్కర్లు ఉంటే ఆ సరదా మామూలుగా ఉండదు. ఈ కొత్త సబ్‌స్క్రిప్షన్‌లో స్పెషల్ యానిమేటెడ్ స్టిక్కర్ ప్యాక్‌లు ఇస్తున్నారు. వీటిని మనం పంపినప్పుడు అవతలి వాళ్లు చూడగలరు కానీ, వాళ్లు డౌన్‌లోడ్ చేసుకోవాలంటే మాత్రం వాళ్లు కూడా మనీ పే చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు ఒక 10 రకాల కొత్త రింగ్‌టోన్లు కూడా వచ్చాయి. ఎప్పుడూ వినే టోన్లు కాకుండా ఫ్లట్టర్, టెంపో లాంటి సరికొత్త టోన్లతో మన వాట్సప్ కాల్స్ మరింత స్పెషల్‌గా అనిపిస్తాయి.

Also Read: అయ్య బాబోయ్.. జస్ట్ రూ.799కే సోనీ బ్రాండ్ హెడ్‌ఫోన్సా? ఫీచర్లు చూస్తే వెంటనే ఆర్డర్ చేసేస్తారు!

20 చాట్‌లను పిన్ చేసుకోవచ్చు:

Advertisement

మనం ఎక్కువగా మాట్లాడే వ్యక్తుల చాట్‌లను పిన్ చేసుకుంటాం కదా. ఇప్పటివరకు కేవలం మూడు చాట్‌లు మాత్రమే పిన్ చేసుకునే వీలుండేది. కానీ వాట్సప్ ప్లస్ ఉంటే ఏకంగా 20 చాట్‌ల వరకు పిన్ చేసుకోవచ్చు. దీంతో ఇంపార్టెంట్ మెసేజ్ల కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. అలాగే మనకు నచ్చిన వాళ్లందరినీ ఒక లిస్టులో పెట్టుకుని, వాళ్లందరికీ ఒకే రకమైన థీమ్ లేదా రింగ్‌టోన్ సెట్ చేసుకునే ఫీచర్ కూడా చాలా బాగుంది.

డబ్బులు ఎంత కట్టాలి?

ప్రస్తుతానికి ఐఫోన్లలో లేటెస్ట్ వెర్షన్ వాడుతున్న కొంతమందికి మాత్రమే ఇది కనిపిస్తోంది. యూరప్ దేశాల్లో దీని ధర నెలకు దాదాపు 2.49 యూరోలుగా (మన దగ్గర సుమారు రూ. 274) ఉంది. భారతదేశంలోకి వచ్చేసరికి ధర కొంచెం అటు ఇటుగా ఉండవచ్చు. ఇకపోతే కొత్తగా ట్రై చేసేవాళ్ల కోసం వారం లేదా నెల రోజులు ఫ్రీ ట్రయల్ కూడా ఇచ్చే అవకాశం ఉందట. ఒకసారి యాప్ సెట్టింగ్స్ లోకి వెళ్లి మీకు ఈ ఆప్షన్ వచ్చిందో లేదో చెక్ చేసుకోండి. వాడుకలో ఉన్న ఫీచర్లకు తోడు త్వరలో మరిన్ని కొత్త అప్‌డేట్స్ కూడా రానున్నాయట.

Also Read: స్టూడెంట్స్, ఆఫీస్ యూజర్స్‌కు లక్కీ ఛాన్స్.. MacBook Neoపై క్రేజీ ఆఫర్, HDFC కార్డ్ ఉంటే మరో బంపర్ డిస్కౌంట్!

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×