Lift Accident: గచ్చిబౌలిలోని ఉమెన్స్ PG హాస్టల్‌లో అత్యంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ ఐదేళ్ల పపిపాప లిప్ట్‌లో ప్రాణాలు కోల్పోయిన వార్త అందరిని కలిచి వేసింది. దీంతో అక్కడి వారంతా ఒక్క సారిగా షాక్‌కి గురయ్యారు.
గచ్చిబౌలిలోని ఉమెన్స్ PG హాస్టల్‌లో ఈ సంఘటన జరిగింది. హస్టల్‌లోని అపార్ట్‌మెంట్ లిఫ్ట్‌లో ఐదేళ్ల చిన్నారి బాలిక ఇరుక్కుని అక్కడిక్కడే మృతి చెందింది. పాప తల్లితండ్రులు అదే హాస్టల్‌లో వంట మాస్టర్‌గా పనిచేస్తున్నారు. వీరు బెంగాల్ నుండి వచ్చి హస్టల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే చిన్నారి హస్టల్‌లోని లిప్ట్‌లో ఎక్కి వెల్తున్న క్రమంలో చిన్నారి జుట్టు లిప్ట్ ముందున్న గేట్‌లో ఇరుక్కుని ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో బాలిక తల వెంట్రకులు ఇరుక్కోని నుజ్జు నుజ్జైంది. దీంతో అక్కడ ఉన్న వారంతా ఓక్కసారిగా షాక్‌కి గురయ్యారు.
Also Read: రోజూ రుద్దే పని లేకుండా.. బాత్రూమ్ టైల్స్ మెరిసిపోవాలంటే ఇలా ట్రై చేయండి!
చిన్నారి మృతిని చూసి హస్టల్‌లో ఉన్నవారంతా కన్నీరు మున్నీరయ్యారు. కళ్ల ముదే తన కూతురు లిప్టులో ఇరుకొని చనిపోవడంతో ఆ తల్లితండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. బాలిను బైటికి తీయడాని ఎంత ప్రయత్నించినా రాక పోవడంతో అక్కడ వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, హైడ్రా సిబ్బంది కలిసి బాలిక మృతదేహన్ని బయటకు తీసారు. అనంతరం పోలీసు ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
గచ్చిబౌలిలోని ఉమెన్స్ PG హాస్టల్‌లో దారుణం
అపార్ట్‌మెంట్ లిఫ్ట్‌లో ఇరుక్కుని ఐదేళ్ల బాలిక మృతి
హాస్టల్‌లో వంట మాస్టర్‌గా పనిచేస్తున్న బెంగాల్ కుటుంబం
లిఫ్ట్‌లో వెళ్తుండగా గేట్‌లో ఇరుక్కున్న బాలిక జుట్టు
ప్రమాదంలో నుజ్జు నుజ్జయిన బాలిక తల
మృతదేహాన్ని బయటకు తీసిన హైడ్రా, ఫైర్… pic.twitter.com/XQnGPdb0NG
— BIG TV Breaking News (@bigtvtelugu) May 13, 2026
Also read: జవాబుదారీతనం ఎక్కడ? నిర్మాత మండలిని ప్రశ్నిస్తూ పదవికి నట్టి కుమార్ గుడ్ బై!