E-Paper
Advertisement

అబ్బా ఏం ఆఫర్..శాంసంగ్ లేటెస్ట్ 5G ఫోన్ ధర భారీగా తగ్గింది.. ఇక మీదే ఆలస్యం!

అబ్బా ఏం ఆఫర్..శాంసంగ్ లేటెస్ట్ 5G ఫోన్ ధర భారీగా తగ్గింది.. ఇక మీదే ఆలస్యం!
Advertisement

Galaxy A57 Price Drop: శాంసంగ్ కంపెనీ ఈ ఏడాది మార్చిలో మార్కెట్లోకి విడుదల చేసిన Galaxy A57 5G మొబైల్ ఇప్పుడు భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్‌పై అదిరిపోయే ధర తగ్గింపుతో పాటు బ్యాంక్ ఆఫర్లను కూడా అందిస్తోంది. 50 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా కలిగి ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఉన్న డీల్స్, ఆఫర్ల వివరాలు మీ కోసం..

భారీగా తగ్గిన Galaxy A57 5G ధర:

మార్చిలో విడుదలైనప్పుడు ఈ ఫోన్ 8GB/256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.56,999గా ఉండేది. కానీ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఇది రూ.51,950కే అందుబాటులో ఉంది. దాదాపు రూ.5,000 తగ్గిందన్నమాట. దీనికి తోడు ఎస్‌బీఐ డెబిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే ప్రత్యేక డిస్కౌంట్ ఉంటుంది. అలాగే మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా గరిష్టంగా రూ.38,950 వరకు ఆదా చేసుకోవచ్చు. అయితే ఈ ఎక్స్ఛేంజ్ విలువ మీ పాత ఫోన్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది.

ఆకట్టుకునే అమోలెడ్ డిస్‌ప్లే:

Advertisement

ఈ ఫోన్ 6.7 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రీఫ్రెష్ రేట్‌తో వస్తుంది కాబట్టి.. ఫోన్ స్క్రీన్ చాలా స్మూత్‌గా పనిచేస్తుంది. అలాగే నీరు, ధూళి నుండి రక్షణ కోసం దీనికి ఐపీ68 రేటింగ్ ఇచ్చారు. Galaxy A57 5G కేవలం 6.9 మిమీ మందం, 179 గ్రాముల బరువుతో చాలా తేలికగా, పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది.

Also Read: సైలెంట్‌గా మొబైల్ మార్కెట్‌లో దిగిన Honor X7e.. ఫీచర్లు, ధర వివరాలపై ఓ లుక్కుయండి!

అద్భుతమైన కెమెరా క్వాలిటీ:

Advertisement

ఇక ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. దీనిలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఎఫ్1.8 అపెర్చర్‌తో కూడిన 50MP మెయిన్ కెమెరా, 12MP అల్ట్రావైడ్ కెమెరా, 5MP మాక్రో కెమెరా ఉన్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 12MP కెమెరాను అమర్చారు. దీనివల్ల ఫొటోలు చాలా స్పష్టంగా వస్తాయి.

బ్యాటరీ సామర్థ్యం ఎంతంటే?

ఈ ఫోన్ ఎగ్జినోస్ 1680 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత వన్ యూఐ 8.5 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఇది రన్ అవుతుంది. రోజంతా నిలిచేలా ఇందులో 5,000mAh సామర్థ్యం గల పవర్‌ఫుల్ బ్యాటరీని అందించారు. కనెక్టివిటీ కోసం యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్, బ్లూటూత్, వై-ఫై వంటి అన్ని లేటెస్ట్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

Also Read: యాడ్స్, బ్లోట్‌వేర్ లేని బెస్ట్ 5G ఫోన్.. రూ.12 వేల లోపే లాంచ్ చేసిన లావా!

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×